మెదక్ జిల్లా:-చేగుంట తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు రాష్ట్ర రహదారిపై బైఠాయించారు. పూర్తిస్థాయిలో అన్ని సబ్జెక్టులకు ఉపాధ్యా యులు లేరని వాపోతూ ధర్నా చేశారు. సంబంధిత అధికారులకుఎన్నిసార్లు విన్నవించినా పూర్తిస్థాయిలో ఉపాధ్యా యులు పాఠశాలకు రావడంలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. గణిత పాఠాలు ఇంకా మొదలు కాలేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టి విద్యాబోధన చేయాలని కోరారు.#schoolstudents #protest #students #🗞️అక్టోబర్ 13th అప్‌డేట్స్💬