అవతారమూర్తుల సచ్ఛరిత్ర పరమ పావనము మరియు పుణ్యదాయకము. అది సకల కల్మషాలను దహించి వేస్తుంది. శ్రద్ధా, భక్తులతో ఆలకించి తన్మయులైన వారు భాగ్యజీవులు. అట్టివారు ఇహపరాలను సాధించగల దివ్యాశీస్సులును పొందగలరు.
తల్లీ తండ్రులు మనకు దేహాన్ని ఇస్తారు. మరణం మన నీడలానే వెంట ఉంటుంది. కాని సద్గురువు జనన మరణచక్రాలను తప్పిస్తారు. సద్గురువు జీవికి జన్మనిస్తారు, ఆపై అనుగ్రహిస్తారు. జనన మరణాలను నివారిస్తారు.
ఆయన కరుణాసముద్రుడు. భక్తికి వశుడు, ప్రేమ స్వరూపుడు, వేదగ్రాహ్యుడు, జ్ఞాన ప్రకాశకుడు,
సత్ చిత్ ఆనందస్వరూపుడు మరియు సర్వవ్యాపి. ఆయనకు ఆడగాని, మగగాని, కులంగాని, గోత్రంగాని కోరడు.
ఆయన సృష్టించిన కొబ్బరికాయలు, పూలూ, పండ్లూ, నైవేద్యాలూ, హారతలు, అగరొత్తులూ అవసరంలేదు. అష్టాత్తర శత సహస్రనామాలతో పనిలేదు. అష్టోపచార, షోడశోపచార పూజాతంతులతో అవసరంలేదు.
కేవలం నీవు ఆయనతో ఎంతసేపు మమేకమయ్యవో
అది అయన కోరేది.
అట్టి పరమాత్మడైన సద్గురువు సచ్ఛరిత్ర పారాయణ మనచిత్తాన్ని ప్రసన్నం చేస్తుంది.
పరమానందం మనముందు నాట్యం చేస్తుంది.
ఎన్నిసార్లు చదివినా నిత్యనూతనంగా ఉంటుంది.
పరిశుధ్ధ చిత్తముతో, ఏకాగ్రతతో పరమ పావనమూ, పరమపవిత్రమయిన సాయి సచ్ఛరిత్ర మనమంతా లెక్కలేనన్ని సార్లు చదివి, చదివిన దానిని మననం చేసి, సాయిని ఏకాగ్రతతో మనస్సులో నిలుపుదాం.
పారాయణ అంటే బుధవారంతో మొదలెట్టి.
గురువారంతో ముగించి మన లౌకిక కోర్కెలు కోరడంకాదు. అలాకూడ చేయవచ్చు,
కానీ మన పెద్దాయనతో బంథం అంత వరకే ఉంటుంది.
ఎలా అంటే ఉదాహరణకీ మనం ఓ హోటల్ కెళ్ళి టిఫెనో, భోజనమో పార్సిల్ చేయించుకుని, డబ్బు చెల్లించి బయిటకొచ్చాక, మనకు హోటల్ వానికి ఏమి సంభందం ఉంటుంది?
అలానే మ్రొక్కుబడిగా పారాయణం చేసినా
అలానే ఉంటుంది.
సచ్ఛరిత్ర పారాయణం అంటే ఆయనతో పరాయణత్వం చెందటమే కదా!
ఏదో ఒక గురువారం సాయి మందిరానికి వెళ్ళి
ఓ కొబ్బరికాయ, అష్టోత్తరం, ఓ పల్లకీ సేవచేస్తే
మనబంధం అంతవరకే ఉంటుంది.
అలాకాక సచ్ఛరిత్ర నిత్యపారాయణంచేయాలి,
అది నిరంతర పారాయణం కావాలి.
ఒక క్షణమైనా సాయిని వీడిన వాడు సాయి భక్తుడా
అని సచ్ఛరిత్ర ప్రశ్నిస్తుంది?
మరిమనం ఎంతసమయం ఆ పెద్దాయనకు
కేటాయిస్తున్నామో ఎవరికి వారు అంతరంగంలో
ప్రశ్నించుకోవాలి?
అందరిలో సాయిని చూడాలి.
సత్సంగాలలో మునకలు వేయాలి.
సాయి సధ్బక్తులతో నిరంతరం కలుస్తుండాలి.
సాయి లీలలే మాట్లాడుకోవాలి.
సాయిగానమే చేయాలి.
సాయి చింతనలో నిరంతరముండాలి. #🌅శుభోదయం #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🎶భక్తి పాటలు🔱


