ShareChat
click to see wallet page
search
_*🚩రేపు ఇంద్రకీలాద్రిపై శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి అలంకారం🚩*_ 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️ త్రిపురు సుందరి లేదా మహా త్రిపుర సుందరి (షోడసి , లలిత మరియు రాజరాజేశ్వరి )రూపాలలో ఒక మహా విధ్యలలో ఒక స్వరూపం. సాక్ష్యాత్ ఆదిపరాశక్తి. ముల్లోకాలకి సుందరి కావును త్రిపుర సుందరి అంటారు. పదహారేళ్ళ వయస్సు కల పదహారు వివిధ కోరికలు కలది కావున షోడసి అని పిలుస్తారు. త్రిపుర అనగా ముల్లోకములు. సుందరి అనగా అందమైనది. కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం. అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం. ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చినదని సిద్ధాంతము కలదు. భాస్కరాచార్యులు రచించిన త్రిపుర ఉపనిషత్తులో ఈ దేవత మూడు రూపాలలో ఉంటుంది. *స్థూల (భౌతికం):* ధ్యాన శ్లోకాలలో వివరించబడినది. బహిర్యాగంతో పూజించబడుతుంది. *సూక్ష్మ (సున్నితం):* మూల మంత్రాలలో వివరించబడినది. జపంతో పూజించబడుతుంది. *పర (మహోన్నతం):* అంతర్యాగం (యంత్ర-మంత్ర ప్రయోగాలతో) పూజించబడుతుంది. కదంబవృక్షములు (కమిడి చెట్లు)వనముందు నివసించునదీ , ముని సముదాయమను కదంబవృక్షములను వికసిపంచేయు (ఆనందిప చేయు ) మేఘమాలయైనది , పర్వతముల కంటే ఎతైన నితంబు కలదీ , దేవతాస్త్రీలచే సేవింపబడునదీ, తామరలవంటి కన్నులు కలదీ , తొలకరిమబ్బు వలే నల్లనైనదీ , మూడు కన్నులు కల పరమేశ్వరుని ఇల్లాలు అగు త్రిపుర సుందరి. పురాత్రయంలో రెండో శక్తి లలితా అమ్మవారు. దేవి ఉపసకులకు ఈమె ముఖ్య దేవత. త్రిగుణాతీతమైన కామేవ్వరీ స్వరూపము అమ్మ ! పంచదశాక్షరి మహా మంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు లలితా మహా త్రిపుర సుందరి దేవిని. సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు ! చెరుక గడ , విల్లు , పాశాంకుసాలను ధరించిన రూపంలో , కుడివైపున సరస్వతి దేవి , ఎడమవైపున లక్ష్మీ దేవి , సేవలు చేస్తు ఉండగా , లలితా దేవి భక్తులను అనుగ్రహిస్తుంది. దారిద్రయ దుఖాలను తొలగించి , సకల ఐష్వర్య అభిష్టాలను అమ్మవారు సీధ్ధింప చేస్తుంది. ఈమే శ్రీ విద్యా స్వరూపిణి. సృష్టి , స్తితి , సమ్హార స్వరూపిణి ! కుంకుమ తో నిత్య పూజ చేసె సువాసీనులకు ఈ తల్లీ మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీచక్ర ఆరధన. కుంకుమ అర్చన , లలితా అష్టొత్తరముతో అమ్మని పూజించటం ద్వారా అమ్మ ప్రీతి చెందుతుంది. మాంగళ్య బలాన్ని కోరుతు సువాసీనులకి పూజ చెయ్యాలి. శ్రీ చక్రం లో బిందువు ఒకటిగానే కనిపించిననూ శాంతమయి అయిన ఆ దేవి మూడు వివిధ శక్తుల సమాహారము. *ఇఛ్ఛా శక్తి :* వామాదేవి , బ్రహ్మ యొక్క దేవేరి *జ్ఞాన శక్తి :* జ్యేష్ఠాదేవి , విష్ణువు యొక్క దేవేరి *క్రియా శక్తి :* రౌద్రి , శివుడు యొక్క దేవేరి ఇవన్నీ సాక్ష్యాత్ అంబికా దేవి యొక్క రూపాంతరాలే లలిత అనగా ఆటలు ఆడునది అని అర్థము. సృష్టి , స్థితి మరియు లయలు దేవి యొక్క ఆటలు. మోక్ష దాయకాలైన ఏడు క్షేత్రములలో కంచి క్షేత్రం ఒకటి. ఒకసారి వేదవేదాంగపారంగతుడు అయిన అగస్త్య మహర్షి కంచి క్షేత్రానికి వచ్చి , కామక్షి దేవిని పూజించాడు. అనేక సంవత్సరములు తపస్సు చేసాడు. అప్పుడు శ్రీ మహా విష్ణువు అతడికి హయగ్రీవ రూపములో ప్రత్యక్షమై ఎమి కొరిక అని అడగగా , మహర్షి ఆయ్నకు నమస్కరించి "పామరులైన ఈ మానవులు అందరికి మోక్షాన్ని పొందతానికి సులభమైన మార్గము ఎదైన ఉంటే , దానిని తెలియచెయ్యవల్సిందిగా ,లోక కల్యాణార్ధం విష్ణువు మూర్తిని ప్రార్థన చేసాడు. దానికి హయగ్రీవుడు *"మానవులకు భుక్తిని , ముక్తిని , దేవతలకు శక్తిని అనుగ్రహించే తల్లి , లలితా పరాశక్తి మాత్రమే"* అని చెప్పి ఆ లలితా చరిత్రను అగస్త్యుడికి వివరముగ తెలియచేసాడు. అమ్మవారు భండాసురుడు అనే లోకపీడికుడను , పరమకీరతకుదను వధించే ఘట్టంలో దేవతలు అందరు అమ్మని ప్రార్థన చెయ్యగా , వారు చేసిన యాగం నుండి చిదగ్ని సంభుతిగా అమ్మ ఆవిర్భవించింది. భండాసురుదిని వధించటం కోసమే , సమస్త లోకాలను , దేవజాతులను , ప్రకృతిని , ప్రాణకొటిని, వస్తుజాలాన్ని , మరల సృష్టించటం , సమ్రక్షించుకోవడం కోసమే అమ్మ ఆవిర్భవించింది. ఆ విధముగా ఉద్భవించిన లలితాదేవి శరీరము , ఉదయిస్తున్న వెయ్యి సూర్యుల కాంతి వలే ప్రకాసించింది. అమ్మవారు సృష్టిలోని సౌందర్యమంతటికి అవధి ! అమ్మకి మించిన సౌందర్యము లేదు. భండాసురుదిని వధించే కార్యం లో , అద్భుతమైన ఆస్చర్యకరమైన యుద్ధం చేసిన లలితకు *"కరాంగూళి నఖోత్పన్న నారయణ దశాకృతి "* అనే నామం ఏర్పడింది. అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి. దేవి భాగవతం , లలితోపాఖ్యానం నిత్యం పఠన వలన అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు. *శ్రీ లలితా అష్టోత్తర శతనామావళి* ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ ఓం రజతాచలశృంగాగ్ర మధ్యస్థాయై నమః ఓం హిమాచల మహావంశపావనాయై నమః ఓం శంకారార్ధాంగ సౌందర్య శరీరాయై నమః ఓం లసన్మరకత స్వచ్చ విగ్రహాయై నమః ఓం మహాతిశయ సౌందర్య లావణ్యాయై నమః ఓం శశాంక శేఖర ప్రాణవల్లభాయై నమః ఓం సదాపంచదశాత్మైక్య స్వరూపాయై నమః ఓం వజ్రమాణీక్య కటకకిరీటాయై నమః ఓం కస్తూరీతిలకోల్లాసిత నిటలాయై నమః ఓం భస్మరేఖాంకిత లసన్మస్తకాయై నమః ఓం వికచాంభోరుహ ధళ లోచనాయై నమః ఓం శరచ్చాంపేయ పుష్పాభ నాసికాయై నమః ఓం లసత్కాంచన తాటంక యుగళాయై నమః ఓం మణిదర్పణ సంకాశ కపోలాయై నమః ఓం తాంబూలపూరితస్మేర వదనాయై నమః ఓం సుపక్వదాడిమీ బీజరదనాయై నమః ఓం కంబుపూగ సమచ్చాయ కంధరాయై నమః ఓం స్థూలముక్తాఫలోదార సుహారాయై నమః ఓం గిరీశబద్ధమాంగళ్య మంగళాయై నమః ఓం పద్మపాశాంకుశలసత్కరాబ్జాయై నమః ఓం పద్మకైరవమందార సుమాలిన్యై నమః ఓం సువర్ణకుంభయుగ్మాభ సుకుచాయై నమః ఓం రమణీయ చతుర్భాహు సంయుక్తాయై నమః ఓం కన కాంగద కేయూర భూషితాయై నమః ఓం బృహత్సౌవర్ణ సౌందర్యవసనాయై నమః ఓం బృహన్నితంబ విలసజ్జఘనాయై నమః ఓం సౌభాగ్యజాత శృంగార మధ్యమాయై నమః ఓం దివ్యభూషణ సందోహరంజితాయై నమః ఓం పారిజాత గుణాధిక్య పదాబ్జాయై నమః ఓం సుపద్మ రాగసంకాశ చరణాయై నమః ఓం కామకోటి మహాపద్మ పీఠస్థాయై నమః ఓం శ్రీకంఠనేత్రకుముద చంద్రికాయై నమః ఓం సచామర రమావాణీ రజితాయై నమః ఓం భక్తరక్షణ దాక్షిణ్య కటాక్షాయై నమః ఓం భూతేశాలింగ నోద్భూత పులకాంగ్యై నమః ఓం అనంగభంగ జనకాపాంగవీక్షణాయై నమః ఓం బ్రహ్మోపేంద్ర శిరోరత్నరంజితాయై నమః ఓం శచీముఖ్యామరవధూ సేవితాయై నమః ఓం లీలాకల్పితబ్రహ్మాండ మండలాయై నమః ఓం అమృతాదిమహాశక్తిసంవృతాయై నమః ఓం ఏకాతపత్రసామ్రాజ్యదాయికాయై నమః ఓం సనకాది సమారాధ్య పాదుకాయై నమః ఓం దేవర్షిభిస్సూయమానవైభవాయై నమః ఓం కలశోద్భవ దుర్వాసః పూజితాయై నమః ఓం మత్తేభవక్త్ర షడ్వక్త్రవత్సలాయై నమః ఓం చక్రరాజ మహాయంత్ర మధ్యవర్తిన్యై నమః ఓం చిదగ్నికుండ సంభూత సుదేహాయై నమః ఓం శశాంకఖండ సంయుక్త మకుటాయై నమః ఓం మత్తహంసవధూ మందగమనాయై నమః ఓం వందారు జనసందోహ వందితాయై నమః ఓం అంతర్ముఖ జనానంద ఫలదాయై నమః ఓం పతివ్రతాంగనాభీష్ట ఫలదాయై నమః ఓం అవ్యాజకరుణా పూరపూరితాయై నమః ఓం నితాంత సచ్చిదానంద సంయుక్తాయై నమః ఓం సహస్రసూర్య సంయుక్త ప్రకాశాయై నమః ఓం రత్నచింతామణి గృహమధ్యస్థాయై నమః ఓం హానివృద్ధి గుణాధిక్యరహితాయై నమః ఓం మహాపద్మాటవీ మధ్య నివాసాయై నమః ఓం జాగ్రత్ స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమః ఓం మహాపాపౌఘ పాపానం వినాశిన్యై నమః ఓం దుష్టభీతి మహాభీతి భంజనాయై నమః ఓం సమస్తదేవదనుజప్రేరకాయై నమః ఓం సమస్త హృదయాంభోజ నిలయాయై నమః ఓం అనాహత మహాపద్మ మందిరాయై నమః ఓం సహస్రారసరోజాత వాసితాయై నమః ఓం పునరావృత్తి రహిత పురస్థాయై నమః ఓం వాణీగాయత్రీ సావిత్రీ సన్నుతాయై నమః ఓం రమా భూమిసుతారాధ్య పదాబ్జాయై నమః ఓం లోపాముద్రార్చిత శ్రీమచ్చరణాయై నమః ఓం సహస్ర రతిసౌందర్య శరీరాయై నమః ఓం భావనామాత్ర సంతుష్ట హృదయాయై నమః ఓం సత్యసంపూర్ణ విజ్ఞాన సిద్దిదాయై నమః ఓం శ్రీలోచన కృతోల్లాస ఫలదాయై నమః ఓం శ్రీసుధాబ్ది మణిద్వీప మధ్యగాయై నమః ఓం దక్షాధ్వర వినిర్భేదసాధనాయై నమః ఓం శ్రీనాథ సోదరీభూత శోభితాయై నమః ఓం చంద్రశేఖర భక్తార్తిభంజనాయై నమః ఓం సర్వోపాధివినిర్ముక్తచైతన్యాయై నమః ఓం నామపారాయణ అభీష్టఫలదాయై నమః ఓం సృష్టిస్థితి తిరోధాన సంకల్పాయై నమః ఓం శ్రీషోడశాక్షరీ మంత్రమధ్యగాయై నమః ఓం అనాద్యంత స్వయంభూత దివ్యమూర్త్యై నమః ఓం భక్తహంసపరాముఖ్య వియోగాయై నమః ఓం మాతృమండల సంయుక్త లలితాయై నమః ఓం భండదైత్య మహాసత్త్వ నాశనాయై నమః ఓం క్రూరభండ శిరశ్చేద నిపుణాయై నమః ఓం ధాత్రచ్యుత సురాధీశ సుఖదాయై నమః ఓం రక్తాక్ష రక్తజిహ్వాది శిక్షణాయై నమః ఓం చండముండ నిశుంభాది ఖండనాయై నమః ఓం మహిషాసురదోర్వీర్య నిగ్రహాయై నమః ఓం అభ్రకేశమహోత్సహ కారణాయై నమః ఓం మహేశయుక్త నటనా తత్పరాయై నమః ఓం నిజభర్తృముఖాంభోజ చింతనాయై నమః ఓం వృషభద్వజ విజ్ఞానభావనాయై నమః ఓం జన్మమృత్య జరారోగ భంజనాయై నమః ఓం విధేయముక్త విజ్ఞానసిద్దిదాయై నమః ఓం కామక్రోధాది షడ్వర్గనాశనాయై నమః ఓం రాజరాజార్చిత పదసరోజాయై నమః ఓం సర్వవేదాంత సంసిద్ద సుతత్త్వాయై నమః ఓం శ్రీ వీరభక్త విజ్ఞాన నిధానాయై నమః ఓం అశేష దుష్ట దనుజసూదనాయై నమః ఓం సాక్షాచ్చ్రీ దక్షిణామూర్తి మనోజ్ఞాయై నమః ఓం హయమేధాగ్రసంపూజ్య మహిమాయై నమః ఓం దక్షప్రజాపతి సుతావేషాఢ్యాయై నమః ఓం సుమబాణేక్షుకోదండ్మండితాయై నమః ఓం నిత్యయౌవన మాంగళ్యమంగళాయై నమః ఓం మహాదేవ సమాయుక్తశరీరాయై నమః ఓం మహాదేవరతౌత్సుక్య మహాదేవ్యై నమః *_🙏🙏🙏🙏🙏🙏_* #🏵️శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి🕉️ #🙏🏻అమ్మ భవాని #🙏హ్యాపీ నవరాత్రి🌸 #🎉నవరాత్రి స్టేటస్🎊 #📿నవరాత్రి పూజ విధానం🪔