ShareChat
click to see wallet page
search
సెప్టెంబర్ 7 చంద్ర గ్రహణము గురుంచి పూర్తి వివరణ 7-9-2025 తేదీ భాద్రపద పౌర్ణమి ఆదివారం నాడు రాత్రి 9-57 నిముషాలకు శతభిషము,పూర్వాభాద్ర నక్షత్రములో కుంభ రాశిలో రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము మన భారత దేశంలో ఏర్పడను. గ్రహణము స్పర్శ కాలము 7తేదీ రాత్రి 9-57 నిముషాలకు, సంపూర్ణ గ్రహణ ప్రారంభము రాత్రి 11-00 గంటలకు గ్రహణ మధ్యకాలము రాత్రి 11-41 నిముషాలకు, గ్రహణము విడుపు ప్రారంభము రాత్రి 12-22 నిముషాలకు, గ్రహణము ముగింపు కాలము రాత్రి 1-26 నిముషాలు గ్రహణము పుణ్యకాలం 3-29 నిముషాలు సంపూర్ణ బింబ దర్శనకాలము 1-22 నిముషాలు వృషభరాశి,--మిధున రాశి,--సింహారాశి,---కన్య రాశి,---తులరాశి,---మకరరాశి,కుంభరాశి,---మీనరాశివారికి ఈ గ్రహణము బాగాలేదు .కనుక వీలైనంత మహాశివ ఆరాధన మంచిది అనేక జన్మల పాప పరిపరహరనికి అరుదైన ఈ క్రింది మంత్రం ఎంతో ఉపయుక్తం గ్రహణ సమయంలో, సాధారణంగా "ఓం సోమాయ నమః", "ఓం చంద్రాయ నమః", "ఓం నమః శివాయ" లేదా మీ ఇష్ట దైవం యొక్క మంత్రాలను జపించవచ్చు. ఈ సమయంలో ధ్యానం చేయడo, పాత అలవాట్లను వదిలించుకోవడo, కొత్త ఉద్దేశాలను ఏర్పరచుకోవడo మంచిదని భావిస్తారు. గ్రహణం సమయంలో మంత్రం జపించడం వల్ల విశ్వంలోని శక్తితో సమలేఖనం అవుతుందని మరియు సానుకూల ప్రభావాలు ఉంటాయని నమ్ముతారు. పఠించదగిన కొన్ని మంత్రాలు: ఓం సోమాయ నమః: శాంతి మరియు చంద్రుని ఆశీర్వాదాల కోసం. ఓం చంద్రాయ నమః: భావోద్వేగ సమతుల్యతను పెంపొందించడానికి. ఓం నమో భగవతే వాసుదేవాయ: ఆధ్యాత్మిక వృద్ధి కోసం. ఓం నమః శివాయ: శివుడికి సంబంధించిన మంత్రం, గ్రహణ సమయంలో జపించవచ్చు. మీ ఇష్ట దేవత మంత్రం: మీరు పూజించే దేవుడి మంత్రాన్ని లేదా స్తోత్రాలను కూడా జపించవచ్చు. ఏం చేయాలి? ధ్యానం చేయండి: గ్రహణం సమయంలో ధ్యానం చేయడం ద్వారా అంతర్గత పరివర్తన పొందవచ్చు. ఉద్దేశాలను ఏర్పరచుకోండి: పాత అలవాట్లను విడిచిపెట్టి, కొత్త కోరికలు, ఉద్దేశాలను ఏర్పరచుకోవడానికి ఇది మంచి సమయం. ఆధ్యాత్మికంగా ఉండండి: ఈ సమయంలో ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెట్టడం మంచిది. గుర్తుంచుకోవాల్సిన విషయాలు: గ్రహణాన్ని చెడు సమయంగా భావిస్తారు, కాబట్టి గ్రహణం సమయంలో శుభకార్యాలు చేయకూడదు. మంత్రం జపించడం వల్ల విశ్వశక్తితో అనుసంధానం ఏర్పడుతుందని, సానుకూల ప్రభావాలను పొందవచ్చని నమ్ముతారు. మీరు గురువుల ద్వారా మంత్రాలు తీసుకుంటే, అవి మరింత శక్తివంతంగా ఉంటాయని నమ్ముతారు. ఈ సమయంలో మంత్ర జపం చేయడం వల్ల గ్రహణ సమయంలో ప్రసరించే కాస్మిక్ కిరణాల ప్రభావం నుండి రక్షణ లభిస్తుందని మరియు కోరికలు నెరవేరుతాయని నమ్మకం. 🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼🌿🌼 పై చంద్ర గ్రహణము వల్ల ఎలాంటి దోషము లేనివారు మేషరాశి--కర్కాటకరాశి--వృశ్చిక రాశి---ధనస్సు రాశి- వారికి బాగుంది ఏ దోషాలు లేవు. దేవాలయాలు ఉదయం 12 గంటల లోపు నివేదనలు పెట్టుకొని దేవాలయము మూసి వేయవచ్చు. మరుసటి రోజు అనగా సెప్టెంబర్ 8తేదీ ఉదయం గణపతి పూజ,పుణ్యాహవచనము,పంచగవ్య సంస్కారము చేసి వాటితో విగ్రహములకు అభిషేకము చేయవలెను. 7 తేదీ గ్రహణము రోజు తద్దినాలు పెట్టేవారు మధ్యాహ్నము 1-20 లోపు పెట్టుకోవలెను *🚩 ┈┉┅━❀ ॐ ❀━┅┉┈ 🚩* #చంద్ర గ్రహణం #🌒చంద్ర గ్రహణం🌒#
చంద్ర గ్రహణం - ShareChat