*మంచి రోజులు చూడాలంటే..!!*
*మంచి రోజులు చూడాలని ఆశ పడుతున్నారా? అయితే మీ నోటిని కాపాడుకోండి. నోటి ద్వారా చెడ్డ మాటలు రానీయకండి. అబద్ధాలు ఆడకండి. మాట్లాడకండి. ఎదుటివారిని గాయపరిచే మాటలు మాట్లాడకండి. ఇతరులను అవమానించే విధంగా, గాయపరిచే విధంగా, హేళన చేసే విధంగా, గేలి చేసే విధంగా నోటిలో నుంచి మాటలు రానీయకండి. నోటి మాటలో శక్తి ఉంది అనే సత్యాన్ని గ్రహించండి!! నోటి మాట గాయాలను కడుతుంది, గాయాలను చేస్తుంది.*
*పిల్లలు లేని వారిని చూసి, ఉద్యోగాలు లేక బాధపడుతున్న వారిని చూసి, అప్పుల పాలు అయిన వారిని చూసి, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని చూసి, అందం లేని వారిని చూసి, వృద్ధులను చూసి, మోడు బారిన జీవితాలు జీవించే వారిని చూసి, ఎవరికి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతూ.. నలిగిపోతున్న వారిని చూసి, మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారిని చూసి, కుదరని రోగాలతో బాధపడుతున్న వారిని చూసి, కట్టుకోవడానికి బట్టలు లేని వారిని చూస్తూ.. తినడానికి తిండి లేని వారిని చూస్తూ.. నివసించడానికి గృహాలు లేని వారిని చూస్తూ.. వ్యాపారంలో నష్టపోయిన వారిని చూస్తూ.. డబ్బు లేని వారిని చూస్తూ... ఉద్యోగంలో ప్రమోషన్ లేక బాధపడుతున్న వారిని చూస్తూ.. కన్న బిడ్డల చేత.. బాధపడుతున్న తల్లిదండ్రులను చూస్తూ.. కొడుకులను బాధపరిచే తల్లిదండ్రులను చూస్తూ.. అనాధులను చూస్తూ... విధవరాండ్రులను చూస్తూ.. కుంటి వారిని చూస్తూ.. గ్రుడ్డివారిని చూస్తూ.. అంగవైకల్యం కలిగిన వారిని చూస్తూ.. అవహేళనగా, కించపరిచే విధంగా, వారిని బాధపరిచే విధంగా మాట్లాడే.. దుర్మార్గులు ఎంతమంది లేరు? అలాంటివారు దేవుని బిడ్డలు కానే కాదు. వారు సైతానికి సంబంధించిన వారు. దేవుని బిడ్డలు ఇతరులను సంతోషపెట్టే మాటలు మాట్లాడుతారు తప్ప తన తోటి వారిని ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడరు. ఇంతకీ నీవు దేవుని బిడ్డవా? సాతాను సంబంధివా? ఒక్కసారి ఆలోచించుకో!!*
*భార్యను నిందిస్తూ మాట్లాడే భర్తలు లేరా? భర్తను గాయపరిచే మాటలు మాట్లాడే భార్యలు లేరా? నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ.. కుటుంబంలో ప్రతి ఒక్కరిని గాయపరిచే వారు లేరా? మాటలతో రెచ్చగొడుతూ. అమ్మాయిలను, అబ్బాయిలను పాపంలోకి దించేవారు లేరా? జాగ్రత్త నీ నోటి ద్వారా ఏం మాట్లాడుతున్నావో దేవుడు చూస్తున్నాడు!! నీవు నేను కలిగి ఉన్న దేవుడు.. కళ్ళు ఉండి చూసే దేవుడు.. చెవులు ఉండి వినే దేవుడని గుర్తుపెట్టుకో!!*
*"జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాని పలుకకుండ తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండ తన పెదవులను కాచుకొనవలెను." (1 పేతురు 3:10)*
******************************-
*ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!*
*WhatsApp Community - 1 link:*
https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD
***************************************
*Telegram group Link*
https://t.me/+XtII92fKOXAyNWQ9
********************************
*- మీ సహోదరుడు మోషే*
*- (Calvary Kiranalu )*
*-(📲 9550576444)*
#jesu #యేసు ప్రభువు #JESU I LOVE YOU JESUS #✝️Jesu✝️ #jesu words #Jesus


