ShareChat
click to see wallet page
search
||.ఆంజనేయ,అంజనీపుత్ర,శక్తిస్వరూపా నారాయణా నమోస్తుతే.|| ➖️🌸➖️🌸➖️🌸➖️🌸➖️🌸➖️🌸➖️🌸➖️ ఆంజనేయుని శ్లోకాలు 🙏🙏🙏🙏🙏🙏🙏 శ్లోకం 1 మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాంవరిష్టం | వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామ దూతం శరణం ప్రపద్యే|| భావము:- మనస్సుని జయించినవాడు, గాలి వేగంతో పయనించేవాడు, పంచేంద్రియాలను తన అధీనంలో ఉంచుకున్నవాడు,గొప్ప తెలివిగలిగినవాడు, వానరులలో ముఖ్యుడు, శ్రీ రామచంద్రునకు దూత అయిన హనుమంతునికి ప్రణామం చేస్తున్నాను. శ్లోకం 2 యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం| భాస్పవారి పరిపూర్ణ లోచనం మారుతిం నమత రాక్షసాంతకం|| భావము:- దయ్యాల బారి నుండి కాపాడేవాడు, ఎక్కడ శ్రీ రాముని పొగిడినా కళ్ళలో నీళ్ళు, రామ భజన చేస్తూ పులకరించిపోయేవాడైన హనుమంతునికి నమస్కారము. శ్లోకం 3 బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతా| అజాడ్యం వక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్|| భావము:- ఎవరైతే హనుమంతున్ని నిత్యం ధ్యానిస్తారో వారు ఆరోగ్యం, ఐశ్వర్యం, బుద్ధి, బలం, ధైర్యం, పేరుప్రఖ్యాతులు, ఙ్ఞానం, వాక్చాతుర్యం తప్పక పొందగలుగుతారు. శ్లోకం 4 అంజనానందం వీరం జానకీ శోక నాశనం| కపీషమక్ష హంతారం వందే లంకాభయంకరం|| భావము:- అంజనాదేవి కుమార,జానకీ మాతా శోకాన్ని పోగొట్టినవాడా,వానరమూక రాజా, లంక రాజుకు భయం పుట్టించిన వాడా, రావణుని రెండవ కుమారుడైన అక్షను సం హరించిన ఆంజనేయ నీకు వందనాలు.|| 🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷🔥🌷 . #🌅శుభోదయం #🙏🏻మంగళవారం భక్తి స్పెషల్ #🌷మంగళవారం స్పెషల్ విషెస్ #🕉️శ్రీ ఆంజనేయం #🚩జై భజరంగబలి💪
🌅శుభోదయం - ShareChat