ఈ రోజు జాతీయ రైతు దినోత్సవం కాబట్టి దేశంలోని ప్రతి ఒక్క ప్రజానీకం రైతుల యొక్క కఠోర శ్రమను ఒక్కసారి స్మరించుకోవాలి ! (12 - 10 - 2025)!
లేదా
అన్నదాత సుఖీభవ!
దేశంలోని సామాన్య,నిరుపేద రైతులు ,వారి రంగం అయిన వ్యవసాయంలో వారు ఎదుర్కొంటున్న సాధకబాదకాలను గురించి ప్రతి ఒక్క ప్రజానీకం తెలుసుకోవాల్సినా అవశ్యకత ఎంతైనా వుంది.అలాగే రాత్రనక,పగలనక ఆరు గాలాలు శ్రమించి మరీ వారు పండించే పంటల నుంచి వచ్చే తిండి గింజలతో కోట్లాది మంది భారతదేశ ప్రజానీకం తమ కడుపు నింపుకుంటున్నారు అనేది అక్షర సత్యం.అయితే ఎన్నో వ్యయ ప్రయాసనోలార్చి వారు పండించే పంటలకు అనేక సందర్భాలలో గిట్టుబాటు ధర లభించక పోవడం అత్యంత బాధాకరమైన విషయం.అదేవిధంగా ముఖ్యంగా సామాన్య,నిరుపేద రైతులు తీరా తమ పంట విత్తుకొనే కాలానికి విత్తనాల ధరలు ఆకాశాన్ని అంటుతుంటాయి అనే మాట సత్య దూరం కాదు.ఏదోలా రైతులు నాన కష్టాలు పడి అప్పో సొప్పో చేసి విత్తనాలు కొనితెచ్చి తమ తమ పొలాల్లో విత్తుతే తీరా పంట చేతికొచ్చి అమ్ముకునే కాలానికి అదేం కర్మణో గాని ఒక్కసారిగా ధరలకు పూనకం వచ్చినట్లుగా ఆకాశం నుంచి నేలకు పడిపోతుంటాయి.అప్పుడు వీరి పరిస్థితి చుస్తే మనకు ఏమనిపిస్తుంది అంటే ' కొనబోతే కొరివి,అమ్మబోతే అడవిలా ' ఉంటుంది వీరి దయనీయ పరిస్థితి.దీనికి ప్రధాన కారణం దళారీ వ్యవస్థ,ఈ వ్యవస్థ ఏ మాత్రం నిజాయితీ లేకుండా పనిచేస్తున్నందువల్లే,అస్థవ్యస్తంగా ఉన్నందువల్లే రైతులు తీవ్ర స్థాయిలో ఇక్కట్లు,ఇబ్బందులు ఎదుర్కొనక తప్పని పరిస్థితి నేడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొడజూపుతున్నది.కాబట్టి ఇప్పటికయినా నిద్రాణావస్థ లో వున్న మన పాలకులు కళ్ళు తెరచి సామాన్య,నిరుపేద రైతులు ఎదుర్కొంటున్న ఈ గిట్టుబాటు ధర అనే ఈ ప్రదాన సమస్యను పరిష్కరించాల్సిన గురుతర బాధ్యత వారి భుజస్కందాలపై ఎంతైనా వుంది.లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతుల కష్టం వృధా అయ్యి చివరకు వ్యవసాయం అనేది వారికి పెనుబారమై వారి జీవితాలు అగమ్య గోచరంలా మారే ప్రమాదం పొంచి వుంది అనే మాట ఏ మాత్రం అవాస్తవం కాదు.
ఏదిఏమైనా ఈ జాతీయ రైతు దినోత్సవం సందర్బంగా దేశంలోని ప్రతి ఒక్క రైతు సోదరులు కోరుకునేది, డిమాండ్ చేసేది ఒక్కటే.అదేమంటే కేంద్ర ప్రభుత్వం ఈ గిట్టుబాటుధరల విషయంలో కాస్తంత ప్రత్యేక శ్రద్ద వహించి దళారీ వ్యవస్థకు కాస్తంత సంకెళ్లు వేసి రైతులకు కాస్తంత లాభసాటిగా ఉండేలా వారు పండించే పంటలకు గిట్టుబాటు కల్పిస్తే మాత్రం దేశవ్యాప్తంగా వున్న కోట్లాది మంది రైతు సోదరులకు ఎంతో మేలు చేసిన వారవుతారు.అప్పుడే మన పెద్దలు సెలవించినట్లుగా ' రైతే రాజు', రైతే దేశానికీ వెన్నెముక ' లాంటి నామధేయాలకు గొప్ప సార్థకత చేకూర్చిన వారవుతారు. ఏమైనా ఈ ప్రత్యేక సందర్భాన దేశంలోని రైతు సోదరులందరూ ఈ సంవత్సరం మంచి అయిన పాడి పంటలతో తలతూగాలని,సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రతి ఒక్క ప్రజానీకం మనసా వాచ కర్మణా కోరుకోవాలి.ఓక విధంగా వారి శ్రేయస్సును కోరుకోవడం అనేది మనందరి బాధ్యతగా కర్తవ్యంగా కూడా తప్పక భావించాలి.అప్పుడే రైతుల కష్టానికి,వారి కఠోర శ్రమకు మనమంతా విలువను ఇచ్చిన వారమవుతాము.జై కిసాన్!అన్నదాత దుఖీభవలా కాకుండా అన్నదాత సుఖీభవలా మరో పది కాలాల పాటు సామాన్య,నిరుపేద రైతులు చల్లగా. మరో పది కాలాల పాటు వర్ధిల్లాలి అత్యంత దిగ్విజయంగా!👩🌾👩🌾👩🌾జైహింద్!
. - బుగ్గన మధుసూదనరెడ్డి,సామాజిక విశ్లేషకుడు,బేతంచెర్ల,నంద్యాల జిల్లా! #అన్నదాత


