ShareChat
click to see wallet page
search
*🕉️ఓం శ్రీ దత్తాయ నమః☸️* 🍃🌹🍃🌹🍃🌹🍃🌹🍃 *🌺🌾దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !* *తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!* *🌹🌾ఎవరైతే శ్రీ దత్తాత్రేయుని భక్తితో స్మరిస్తారో వారి సమస్త పాపములు నశిస్తాయి.* *దీనిలో సందేహం లేదని "దత్త హృదయం" నందు చెప్పబడినది*. *⚜️🚩శ్రీ దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర సంతుష్టుడు*. *తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా* *“అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ”* *అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు ఏదో ఒక రూపంలో వచ్చి*, *రక్షించి కోరిన కోరికలు తీర్చు దయామయుడు* *శ్రీదత్తాత్రేయుడు*. *⚜️🚩శ్రీ దత్తుని రూపంలో అంతరార్థం* *శ్రీ దత్తమూర్తి మూడు* *శిరస్సులతో, ఆరు భుజములతో, ఆయుధములతో, నాలుగు కుక్కలతో, ఆవుతో ఉన్నట్టు చిత్రించబడి ఉంటుంది*. *వీటికి గల అర్థాలను పరిశీలిస్తే* *🌹🌾మూడు శిరస్సులు:* *బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు*, *సృష్టి, స్థితి, లయములు*, *ఓంకారములోని అ, ఉ, మ లు త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మము*. *🌹🌾నాలుగు కుక్కలు:* *నాలుగు వేదములు ఇవి*. *శ్రీ దత్తమూర్తి సకల వేదవిజ్ఞానమును అధిగమించిన జ్ఞానసాగరుడు*. *🌹🌾ఆవు:* *మనసే మాయాశక్తి.* *సంకల్ప, వికల్పములకు, సుఖ దుఃఖములకు కారణమైన మాయను యోగబలముచే శ్రీదత్తమూర్తి కామధేనువుగా మార్చాడు*. *🌹🌾మాల:* *అక్షరమాల.* *సర్వమంత్రమయము, సమస్త వైఖరి, వాగ్జాలమునకు, సాహిత్య సంగీతములకు సర్వ వ్యవహారములకు మూలము*. *🌹🌾త్రిశూలము :* *ఆచారము, వ్యవహారము, ధర్మార్థ కామముల సంపుటి*. *🌹🌾చక్రము:* *అవిద్యా నాశకము, ఆత్మావలోకన, సామర్థ్యమును, వివేకమును కలుగచేయును*. *🌹🌾డమరు:* *సర్వవేదములు దీనినుంచి ప్రాదుర్భవించినవి*. *🌹🌾కమండలము:* *సమస్త బాధలను పోగొట్టును.* *శుభములను సమకూర్చును*. *🌺🌾మాలా కమండలు రథః కరపద్మ యుగ్మే* *మధ్యస్థ పాణి యుగళే ఢమరు త్రిశూలే* యస్యస్త ఊర్ధ్వ కరయోశ్శుభశంఖచక్రే వందే తమత్రి వరదం భుజషట్కయుక్తమ్ దత్తాత్రేయం శివం శాంతం సచ్చిదానంద మద్వయం ఆత్మరూపం పరం దివ్యం అవధూత ముపాస్మ హే* *🌹🌾బ్రహ్మవిష్ణు శివాత్మకుడైన దత్తాత్రేయులవారి రూపంలో ముమ్మూర్తుల ఏకత్వం ప్రకాశిస్తోంది*. *🌹🌾స్వామి ఆరు చేతులతో ప్రకాశిస్తున్నాడు*. *క్రింది రెండు చేతులలో అక్షమాల, కమండలం ధరించాడు (బ్రహ్మ).* *మధ్య చేతుల్లో ఢమరుకం, త్రిశూలం దాల్చాడు (శివుడు).* *పైరెండు చేతుల్లో శంఖు చక్రాలు ధరించాడు (విష్ణువు)*. *ఇలా ఆరు చేతులతో ప్రకాశిస్తూ, అత్రికి వరాన్ని అందించిన దత్తాత్రేయునికి వందనం*. *🍃🌺శాంత స్వరూపంతో దీపించే సచ్చిదానందరూపుడు, అద్వయుడు, ఆత్మరూపుడు, సర్వోన్నతుడు, దివ్యుడు, అవధూత దత్తాత్రేయుని ఉపాసిస్తున్నాడు*. *🌺🍃దత్తా దత్తా దత్తా దీనదయాళ, దత్తా దత్తా దత్తా పరమకృపాళ🍃🌺* 🙏 🕉️🌺⚜️🌺🕉️🌺⚜️🌺🕉️ __________________________________________ HARI BABU.G __________________________________________ #గురు పౌర్ణమి శుభాకాంక్షలు 1 #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #శ్రీ గురు పాదవల్లభ జయంతి శుభాకాంక్షలు 💐💐 దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర జై గురు దత్త #శ్రీ దత్త జయంతి శుభాకాంక్షలు
గురు పౌర్ణమి శుభాకాంక్షలు 1 - పిఠాపురంలో కొలువై ఉన్న స్వయంభూ దత్తాత్రేయుడు సంభవామియుగే యుగే . @సంభవామి యుగే యుగే పిఠాపురంలో కొలువై ఉన్న స్వయంభూ దత్తాత్రేయుడు సంభవామియుగే యుగే . @సంభవామి యుగే యుగే - ShareChat