*అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించండి — ఎమ్మెల్యే జారె*
🗓️ 22.10.2025, బుధవారం
అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే *జారె ఆదినారాయణ గారు తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర గిరిజన, ముస్లిం మైనారిటీ, వికలాంగులు, వృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ల సంక్షేమ శాఖల మంత్రివర్యులు *అడ్లూరి లక్ష్మణ్ కుమార్* గారిని వారి చాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఇటీవల అశ్వారావుపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం *₹13 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు* మంత్రి గారికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా నియోజకవర్గంలో ఇంకా పరిష్కారం కావాల్సిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించి, *అంతర్గత రహదారులు, బీటీ రోడ్లు, అవసరమైన చోట్ల బ్రిడ్జిల నిర్మాణం* వంటి ప్రాజెక్టులకు మరిన్ని నిధులు కేటాయించవలసిందిగా ఎమ్మెల్యే గారు మంత్రి గారిని అభ్యర్థించారు. #కాంగ్రెస్ పార్టీ తెలంగాణ #కాంగ్రెస్ #🌍నా తెలంగాణ #🔹కాంగ్రెస్ #🏛️రాజకీయాలు


