#🌀దిత్వా తుపాను బీభత్సం..అనేకమంది మంది మృతి #📰ఈరోజు అప్‌డేట్స్ #🌨️వాతావరణ అప్‌డేట్స్ "డిట్వా" తుఫాను నేరుగా చెన్నై వైపు దూసుకువస్తుండటంతో దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో వర్షాల ముప్పు పొంచి ఉంది. నవంబర్ 30వ తేదీ రాత్రి సమయానికి ఈ తుఫాను వాయుగుండం లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని బలమైన సంకేతాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇది వాయుగుండంగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశించి, డిసెంబర్ 2వ తేదీ వరకు (సుమారు 24 నుండి 30 గంటల పాటు) తిరుపతి మరియు నెల్లూరు జిల్లాల పరిసరాల్లోనే తిరుగుతూ అక్కడే స్థిరపడే అవకాశం ఉంది.
దీని ప్రభావం వల్ల నవంబర్ 30 మరియు డిసెంబర్ 1 తేదీల్లో నెల్లూరు జిల్లాలో, ముఖ్యంగా కావలి నుండి ఉత్తర నెల్లూరు ప్రాంతాల్లో గంటకు 70 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉంది. ఇదే సమయంలో తిరుపతి జిల్లాలో కూడా భారీ వర్షాలు మరియు ఈదురు గాలులు సంభవించవచ్చు. గత అప్‌డేట్‌లో తెలిపినట్లుగా, దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా కనిపించనుంది.


