ShareChat
click to see wallet page
search
ఒకసారి సింహము, గాడిద, నక్క ఒక అవగాహన కు వచ్చి వేటకు వెల్లాయి. చాలా సేపు వేటాడిన తర్వాత సింహము గాడిదను ఆ సంపాదించిన ఆహారాన్ని పంచ మనగా గాడిద వాటిని మూడు సమభాగాలు చేసి సింహాన్ని తన భాగం కోరుకొమ్మంది. సింహానికి కోపం వచ్చి గాడిద పై పడగా అది పారిపోయింది. సింహం తర్వాత నక్కను పంచమంది. నక్క ఒక పెద్ద భాగం రెండవది చిన్న భాగం చేసి సింహాన్ని తన భాగం కోరుకొమ్మంది. అప్పుడు సింహం అంది. "చాలా సంతోషం. ఇంత చక్కగా వాటాలు పంచావు. నీకెవరు నేర్పారు" అనగా నక్క : "నేను దీన్ని గాడిద దురదృష్టం నుండి నేర్చుకున్నాను" అని అంది. నీతి ÷ ఇతరుల దురదృష్టం నుండి మనం పాఠాలు నేర్చుకోవాలి. #😇My Status #📝జీవిత గుణపాఠాలు😊 #😃మంచి మాటలు #🙏Thank you😊 #😴శుభరాత్రి