ShareChat
click to see wallet page
search
ఆ పరమాత్ముడుని విశ్వసిద్దాం నిశ్చింతగా ఉందాం True hope is swift, and flies with swallow's wings. స్వాలో అనే చిన్ని పక్షులు- సంతాన వృద్ధి కోసం అర్జెంటీనాలో బయల్దేరి 8300 కి.మీ. పైచిలుకు దూరంలో ఉన్న కాలిఫోర్నియా చేరుకుంటాయి. ఇందులో వింత ఏముంది అంటారేమో .. కానీ అవి దాదాపుగా 16,600 km ప్రయాణం చేస్తాయి. అవి ప్రయాణం చేస్తున్న మార్గంలో ఎక్కడ కూడా ఒక్క అడుగు భూమి కనిపించదు. ప్రయాణం అంత సముద్రమార్గమే. అందుకే అవి అర్జెంటీనాలో బయల్దేరే ముందు , ఒక చిన్న పుల్లను వాటి సహాయార్థం తీసుకుంటాయి. అవి అలసిపోయినప్పుడు , ఆకలివేసినప్పుడు , ఆ పుల్లను నీటిపైన వేసుకుని సేద తీరుతుంది. అలాగే దొరికిన ఆహారంతో ఆకలి తీర్చుకుని మళ్ళీ ప్రయాణం మొదలెడుతుంది.అక్కడో సురక్షిత ప్రదేశాన్ని ఎన్నుకుని గుడ్లు పెట్టి, పొదుగుతాయి. సుమారు ఏడు నెలల తర్వాత పిల్లలతో స్వస్థలం చేరుకుంటాయి. ఆ పరమాత్ముడు గుప్పెడంత (20 గ్రాములు) ఉండే పక్షుల బాగోగుల గురించే ఇంత శ్రద్ధ వహిస్తున్నాడంటే.. తన ఊపిరితో తన లాంటి స్వరూపంతో సృష్టించిన మనపై ఇంకెంత శ్రద్ధ వహిస్తాడో కదా! కానీ, ఆయన వాత్సల్యాన్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం కాబోలు! లేకుంటే.. సుఖసౌఖ్యాలూ, భోగభాగ్యాలూ అంటు ఎందుకు వ్యాకులపడుతున్నాం ? ఆయన చేసిన మేలు ఎలా మర్చిపోతున్నాం ? ఒక చిన్న స్వాలో పక్షిని సైతం విస్మరించని సర్వోన్నతుడైన సృష్టికర్త.. మనల్ని పోషించలేడా ? ఆ సర్వేశ్వరుని విశ్వసిద్దాం, నిశ్చింతగా ఉందాం. సేకరణ: నాగు ముదిగొండ #⛳భారతీయ సంస్కృతి