ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు ఎప్పటికప్పుడు మొంథా తుపాను ప్రభావంపై తన కార్యాలయ అధికారుల ద్వారా క్షేత్ర స్థాయి నుంచి సమాచారం తీసుకొంటున్నారు. డా.బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్ల నుంచి పేషీ అధికారులు క్షేత్ర స్థాయి సమాచారం తీసుకొన్నారు. అర్థరాత్రి తుపాను తీరం దాటిన క్రమంలో తీవ్రమైన ఈదురు గాలులు, భారీ వర్షాల మూలంగా కలిగిన నష్టంపై వివరాలు తెలుసుకున్నారు.
•పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడటంతో విద్యుత్ తీగలు పడటం, అదే విధంగా విద్యుత్ స్తంభాలు నేలకొరిగిన క్రమంలో వాటి పునరుద్ధరణను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
•తుపాను బలహీనపడ్డా భారీ వర్షాలు ఉన్నందున ప్రజలను సురక్షిత ప్రదేశాల్లోనే ఉంచాలన్నారు.
•పునరావాస కేంద్రాల్లో ఉన్నవారిని ఈ రోజు కూడా అక్కడే ఉంచి ఆహార, వసతి కల్పించాలని స్పష్టం చేశారు.
# #🟥జనసేన #✡జనసేనాని పవన్ కళ్యాణ్ #🗞️అక్టోబర్ 29th అప్‌డేట్స్💬 #🌧వర్షాకాలం స్టేటస్🤗 #⛈రుతుపవనాలు అప్‌డేట్స్


