ShareChat
click to see wallet page
search
*అలసిన వానిని ఊరడించు మాటలు* 🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞 *సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన* *అనుదిన ధ్యానములు* 🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇 *🌷🌷అక్టోబర్ 1🌷🌷* *" నాశనకరమైన గుంటలో నుండియు జిగటగల దొంగ ఊబి నుండియు ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను" ( కీర్తన 40:2)* సంఘము లేక ఎక్లీసియా, అనగా 'బయటకి లాగుబడుట' యని అర్థము. ఒకవేళ బంగారము. వెండి, ఇనుము, ఇత్తడి, ప్రశస్తమైన వజ్రములు, ముత్యములతో చేయబడిన వివిధ రకములైన వస్తువులు గల పెద్ద కుప్ప సమీపమున ఒక అయస్కాంతమును ఉంచిరనుకొనుము. కేవలము తుప్పుబట్టిన, మురికి మేకు మాత్రమే అయస్కాంతము ద్వారా బయటకు లాగబడును గాని ప్రియమైన, విలువైన వస్తువులు విడచి పెట్టబడును. అదే రీతిగా క్రీస్తు దరిద్రులు, తప్పిపోయిన, పశ్చాత్తాప పడిన, అపవిత్రులైన పాపులనే ఆకర్షించును గాని, లోకములో అహంకారులు, సంపన్నులైన వారు ఏ మాత్రము ఆయన యొద్దకు రాలేరు (లాగబడరు). ఎక్లీసియా అనగా “బయటికి లాగబడుట”. ఇది క్రీస్తు ద్వారా లోకములో నుండి బయటికి లాగబడిన వారిని గురించి మాట్లాడుచున్నది. వారు పామరులైనను, లోకములో అత్యున్నతమైన ఏ అర్హత లేని వారైనను వారు దేవుని దృష్టిలో చాలా ప్రశస్తమైన వారగుదురు. అట్టి ప్రజలను గురించి మన ప్రభువు, “నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని” (యోహాను 15: 19) అని చెప్పుచున్నాడు. ఈ లాంటి సంఘమునకు నీవు చెందియున్నావా? యేసు ప్రభువు లోకము నుండి నిన్ను బయటికి లాగెనని నిజముగా చెప్పగలవా? *నీవు క్రైస్తవ పేరుకలిగి యున్నందున లేక చాల బైబిలు జ్ఞానము కలిగి యున్నందున ప్రభువునకు చెందియున్నానని తలంచకుము*. నీ హృదయములో, నీ జీవితములో మార్పు ఉండవలెను. నీవు దేవుని బలమైన హస్తముచే బయటికి లాగబడినప్పుడు, లోక సుఖములు నిన్ను ఆకర్షించ లేవు (అవి వాటి ఆకర్షణ శక్తిని నీ యెడల పోగొట్టుకొనును). క్రీస్తు నీ హృదయములోనికి వచ్చెను, చీకటి మాయమయ్యెను. నీవు పాపము యొక్క బలము నుండి విడిపించ బడితివి గనుక నీవు ఏ మాత్రము పెనుగులాడి, పోరాడనవసరము లేదు. ఈ కార్యము నీలో జరిగితేనే తప్ప, నీవు సంఘమునకు చెంది యున్నానని చెప్పలేవు. అనేక మంది నామకార్ద క్రైస్తవులు లోక సంబంధమైన విషయముల కొరకు ఆశకలిగి యుందురు. వారు అప్పుడప్పుడు లోక సుఖములయందు నిమగ్నులై యున్న యెడల ఏ మాత్రము హాని యుండదని తలంచుదురు. వారు సినిమాకు, సంవత్సరమునకు రెండు లేక మూడు సార్లు, “మంచి సినిమాలకు” మాత్రమే వెళ్ళుటకు ఇష్టపడుదురు. సీసా నిండా విషము లేక దానిలో ఒక చుక్క విషమైనను మరణకరమైనదని వారు గ్రహించలేరు. చిన్న టి.బి. క్రిములు నీ శరీరమంతటిని చంపగలవు. కంటిలోని ఒక మచ్చ గ్రుడ్డితనమును తీసికొని రాగలదు. ప్రభువు నిన్ను ప్రతివిధమైన లోక సంబంధమైన సుఖము నుండి విడిపించి తన నిజసంఘములో సభ్యునిగా చేసెనని నిశ్చయ పరచుకొనును. Please share 🙏🏼Praise the LORD.🙏🏼 #📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝