దేవి నవరాత్రులలో 8వ రోజు ఈ రోజు శ్రీ సరస్వతీ దేవి
ఆశ్వయుజ శుద్ద పాడ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రులలో రోజుకొక దుర్గా రూపమును ఉపాశించ వలెను.
నవదుర్గలు :
ప్రథమా శైలపుత్రీచ| ద్వితీయా బ్రహ్మచారిణీ|తృతీయా చంద్రఘంటేతి| కూష్మాండేతి చతుర్థికీ|పంచమా స్కందమాతేతి| షష్ఠా కాత్యాయనేతిచ|సప్తమా కాళరాత్రీచ| అష్టమాచేతి భైరవీ|నవమా సర్వసిద్ధిశ్చాత్| నవదుర్గా ప్రకీర్తితా||
నవరాత్రులలో ఈ తొమ్మిది రూపాలలో అమ్మవారిని పూజించాలి.
దుర్గా ధ్యాన శ్లోకము :
శ్లో|| ఓం హ్రీం కాలాభ్రాభాం కటాక్షైరరికులభయదాం మౌలిబద్ధేందురేఖాంశంఖం చక్రం కృపాణం త్రిశిఖమపి కరైరుద్వహంతీం త్రినేత్రామ్ |సింహస్కంధాధిరూఢాం త్రిభువనమఖిలం తేజసా పూరయంతీంధ్యాయేద్ దుర్గాం జయాఖ్యాం త్రిదశపరివృతాం సేవితాం సిద్ధికామైః ॥
శ్లో|| శ్వేతే వృషే సమారూడా స్వేతాంబరధరా శుచిః| మహాగౌరీ శుభం దద్యాత్, మహాదేవ ప్రమోదదా ||
నైవేద్యం : చక్కెర పొంగలి , బెల్లం అటుకులు ,దద్ధోజనం
!! కావలసినవి !!
బియ్యం రెండు కప్పులు
పెసరపప్పు ఒక కప్పు
బెల్లం ఒక కప్పు
పంచదార ఒక కప్పు
జీడిపప్పు, బాదం ,ద్రాక్ష ,కిస్మిస్ ( డ్రైప్రూట్స్)
కొబ్బరి ముక్కలు కొద్దిగా
యాలకులు 5
నెయ్యి 1/2 కప్పు
ముందుగా డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం ద్రాక్ష కిస్మిస్ కొబ్బరి ముక్కలు నేతిలో వేయించుకోవాలి.
పెసరపప్పును దోరగా వేయించుకొని నీరు పోసి కడిగి పక్కన ఉంచుకోవాలి.
రెండు కప్పుల బియ్యం వేయించిన పెసరపప్పు ఒక కప్పు కలిపి ఐదు కప్పుల నీళ్ళు పోసి ఉడికించుకోవాలి.
పాకం : ఒక కప్పు నీటిలో ఒక కప్పు బెల్లం ఒక కప్పు పంచదార కలిపి తీగపాకం వచ్చేవరకు ఉడకబెట్టాలి.
ఉడికిన అన్నంలో ఈ తీగ పాకం పోసి గట్టి పడే ఉడికించాలి తర్వాత నెయ్యి ,యాలకుల పొడి వేసి తర్వాత నేతిలో వేయించిన డ్రైఫ్రూట్స్ వేసి కలిపి దించండి వేడి వేడిగా సరస్వతీ దేవి కి నైవేద్యం పెట్టి ఆ తల్లి దీవెనలు పొందండి. #🙏🏻అమ్మ భవాని #🙏హ్యాపీ నవరాత్రి🌸 #📿నవరాత్రి పూజ విధానం🪔