ShareChat
click to see wallet page
search
#😭ఘోర ప్రమాదం దగ్ధమైన బస్సు..పలువురు ప్రయాణికులు మృతి #📰జాతీయం/అంతర్జాతీయం #🌅శుభోదయం #ap కర్నూలు: కర్నూలు జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. శుక్రవారం వేకువజామున 3.30 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తొలుత బస్సు ముందు భాగంలో మంటలు అంటుకున్నాయి. ఆతర్వాత క్రమంగా బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగడంతో 12 మంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. బస్సు బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. పూర్తిగా దగ్ధమైన బస్సు కింద ఆసుపత్రిలో చేరిన 11 మంది లిస్ట్ ఉంది ఆ పేరు కలవారు ఆ బస్సులో ప్రయాణిస్తూ ఉంటే మీకు ఎవరైనా తెలిసే ఉంటే మీరు డైరెక్ట్ గా ఆందోళన పడకుండా ఆసుపత్రికి వెళ్లి కర్నూలు ఆసుపత్రిలో సంప్రదించండి
😭ఘోర ప్రమాదం దగ్ధమైన బస్సు..పలువురు ప్రయాణికులు మృతి - ShareChat
00:15