#భగవద్గీత
#🌸ఓం శ్రీ గురుభ్యోనమః 🌸
🌸ఓం వ్యాసదేవాయ నమః 🌸
#🙏 గురుమహిమ
#గురుభ్యోనమః 🙏 గురువును మించిన దైవం లేదు...
#జై గురుదేవ్ जय गुरुदेवू Jai Gurudev
*🌸ఓం వ్యాసదేవాయ నమః🌸*
*🌹శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి*🌹
*21. ఓం పరమ పవిత్రాయై నమః*
లోకంలో జ్ఞానంతో సమానంగా పవిత్రమైనది మరి లేదు. ‘న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే’. జ్ఞానం మనలోని అజ్ఞానరూపమైన మాలిన్యాన్ని పోగొట్టి, ఆత్మానురూపమైన అనుభూతి కలిగిస్తుంది. అయితే ఏది పవిత్రజ్ఞానం?
రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమమ్ । 9.2
విద్యలలోకెల్లా తలమానికం అయిన రాజవిద్య బ్రహ్మజ్ఞానం. అది రాజగుహ్యం, అనగా రహస్యాలలోకెల్లా రహస్యమైనది. పవిత్రమైనది.
యజ్ఞ, దాన, తపః కర్మలు బుద్ధిమంతులను పవిత్రుల్ని చేస్తాయి అని భగవద్గీత తెలియజేస్తుంది. ద్రవ్యంతో చేసే యజ్ఞం కన్నా జ్ఞానంతో చేసే యజ్ఞం ఎంతో శ్రేష్ఠమైనది. పరమ పవిత్రమైన, శ్రేష్ఠమైన ఈ జ్ఞానయజ్ఞం ఎలా చేయాలి? గీతలోని పవిత్ర సంవాదాన్ని ఆరాధనాపూర్వకంగా పఠిస్తూ, అర్థం చేసుకొని, ఆచరించేవారు జ్ఞాన యజ్ఞంతో నన్ను ఆరాధించినట్లే అని ఆ తండ్రి తెలియజేశారు.
భగవద్గీత భగవంతుని వాక్కు కనక మిక్కిలి పవిత్రం అయినది. అది జ్ఞానగంగ. పవిత్ర గంగానది తన యందు మునిగిన మానవుల పాపాలను ప్రక్షాళన చేస్తున్నట్లే గీతాగంగ తన బోధలో మునిగిన వారిని పవిత్రులుగా చేస్తుంది.
అట్టి పరమ పవిత్ర స్వరూపిణి అయిన శ్రీమద్భగవద్గీతామాతకు పూజ్యభావంతో ప్రణమిల్లుతున్నాను.
జై గురుదేవ్ 🙏