Parimal Nathwani : వైసీపీ ఎంపీ కొడుకు పెళ్లికి హాజరైన అతిరధ మహారథులు ..ముకేశ్ అంబానీ దంపతులు!
వైసీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ కుమారుడు కరణ్ నత్వానీ వివాహానికి.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన సతీమణి నీతా అంబానీ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి ఐసీసీ చైర్మన్ జై షాతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా విచ్చేశారు. పరిమళ్ నత్వానీ.. ముకేశ్ అంబానీకి సన్నిహితుడిగా చెబుతుంటారు. అప్పటికే రెండు సార్లు రాజ్యసభ ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన పరిమళ్ నత్వానీని.. 2020లో వైసీపీ మరోసారి పెద్దల సభకు పంపించింది. […]