ShareChat
click to see wallet page
search
*అలసిన వానిని ఊరడించు మాటలు* 🍞🍞🍞🍞🍞🍞🍞🍞🍞 *సహోదరుడు భక్త సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన* *అనుదిన ధ్యానములు* 🍇🍇🍇🍇🍇🍇🍇🍇🍇 *🌷🌷అక్టోబర్ 4🌷🌷* *".. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము" (నెహెమ్యా 10:39)* మనము రక్షణ పొందక మునుపు స్వయం తృప్తి కలిగి, మనకై మనము సంతోషముగా జీవించితిమి. అయితే ఇప్పుడు ఈ వైఖరి మారిపోయినది. దేవుని ప్రజలతో ఉండి, వారితో సహవాసమును అనుభవించవలెనను కోరికను పొందితిమి. దేవుని కుటుంబము లోని సభ్యులముగా ఒకరితో ఒకరు సంతోషమును, దుఃఖములను పంచుకొనవలెనను కోరికను పొందుదుము. మనము కలసి ఉండవలెననియు, తన ప్రేమలో మనలను కలిపి బంధించిన ప్రభువును ఆరాధించవలెననియు కోరికను కలిగి యుందుము. అటువంటి సహవాసము ద్వారా మనము అంతకంతకు ఆత్మీయముగా బలపరచ బడుదుము. ఈ అనుభవంతో దావీదు, కీర్తనలు 122:1 లో "- యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని" అని చెప్పుచున్నాడు. మనము కూడా ఈ ఆత్మీయ జీవితములో ఒక అడుగు ముందుకు వేసినప్పుడు, మన సహవిశ్వాసులతో దేవుని మందిరములో ఆరాధన, ప్రార్ధనలో సాధ్యమైనంత ఎక్కువ సమయమును గడపవలెనను కోరికను కలిగియుందుము. *ఎవరైతే దేవుని ప్రజల యొక్క సహవాసమును తృణీకరించి, లోక సంబంధమైన కార్య కలాపములను ప్రేమించుచు, వాటిచే బంధించబడియుందురో వారు ఆత్మీయముగా పేదలుగా నుందురు*. వారు దేవుని మందిరములో బైబిలు పఠనము, ప్రార్థన, సహవాసము, సేవ కొరకు క్రమముగా కలిసికొనువారు పొందు బలమును, ప్రోత్సాహమును పోగొట్టుకొనెదరు. ఆరంభ సంఘము యొక్క ఎదుగుదల, బలమునకు అదే రహస్యము. అపొ.కా. 2:42 లో విశ్వాసులు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరచుట యందును, ప్రార్ధన చేయుట యందును ఎడతెగక యుండిరని చదువుదుము. దేవుని వాక్యమును ఘనపరచుట ద్వారా వారు శత్రువు యొక్క ఎదిరింపుల నుండి తమ్మును కాపాడుకొన గలిగిరి. ఈ చివరి దినములలో శత్రువు ఎంతో చురుకుగా ఉన్నాడని మనమెరుగుదుము. 2 తిమోతి 3: 1-13 లలో అంత్యదినములలో సాధారణముగా ఉండు వివిధ రకములైన పాపముల పట్టీ గలదు. మనము వీటిని జయించ వలెనని కోరుచున్న యెడల దేవునితోను, ఆయన ప్రజలతోను కలసి సన్నిహిత సహవాసమును కలిగి యుండవలెను. మనకై మనము ఏ పరిస్థితిని జయించలేము. మీరు ఇంటివద్ద మీ బైబిలుతో గంటల తరబడి సమయమును గడుపుచు ఉండవచ్చును. అది, విశ్వాసులతో సహవాసములో సమయము గడుపునంత బలముగా ఉండదు. ప్రాచీన కాలములో సన్యాసులు, సన్యాసినులు అడవులలోని ఏకాంత ప్రదేశములు వెళ్లి ధ్యానము, ప్రార్ధనలో సమయమును గడుపుట ద్వారా అంతమున శత్రువును సులభముగా జయించుటకు బలమును పొందుదుమని నిరీక్షించెడివారు. అయితే ఆ రీతిగా వారు చేయుట ద్వారా ఇంకా దౌర్భాగ్యులుగాను, బలహీనులుగాను అగుదురు. వారు దేవుని మందిరమునకు సహవాసమునకు వచ్చుటకు ఆటంకపరచు లోక సంబంధమైన కార్య కలాపములు, లోక స్నేహములను అనుమతించుదురు.. *మనము ఎంత ఎక్కువగా దేవుని మందిరములోని, విశ్వాసులతో సహవాసమును క్రమముగా కలిగియుండి, దేవుని మందిరములోని సేవలో మన భారమును ఎంత ఎక్కువగా తీసికొనెదమో అంత ఎక్కువగా మన ఆత్మీయ జీవితములో బలముగా నుందుమని మనము నేర్చుకొనవలసియున్నది.* Please share 🙏🏼Praise the LORD.🙏🏼 #📝అనుదిన వాక్యము #⛪దేవుని వాక్యము ✝