ShareChat
click to see wallet page
search
#శివ - ఎందుకు శివుడు సర్వోన్నత దేవుడు? why shiva is the supreme god ? #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🙏ఓం నమః శివాయ🙏ૐ #ఓం శివోహం... సర్వం శివమయం #శివారాధన 🔱 శివ పూజ విధి విధానాలు 🕉️🙏 *తండ్రీ పరమేశ్వరా!* నా దగ్గర ఎటువంటి యుక్తి లేదు. శక్తి అసలే లేదు, నీపై భక్తి తప్ప. నాకు ఎటువంటి జపము రాదు, తపము లేదు నీ స్మరణ తప్ప. నాకు అంగ బలము లేదు. ఆర్ధిక బలము లేదు, నా మదిలో నీ ఆర్తి తప్ప. తండ్రీ ఉమామహేశ్వరా! నీ మెడలో వేయడానికి ఒక దివ్యమైన ఆభరణం లేదు. కనీసం పుష్ప మాల కూడా లేదు. కావలసిన నైవేద్యాలు లేవు. ఇష్టమైన దళాలు లేవు. పంచామృత స్నానాలు లేవు. పంచభక్ష్య పరమాన్నాలు లేవు. తలచినంతనే తలపులలో జనించిన శుభములు తీర్చే భోళా శంకరుడవు నీవు. భక్తితో నీకు నమస్కరించి, ఆర్తితో కనులు చెమరించి నిన్ను కోరుకొనే కింకరుడను నేను. ఇది చాలదా నీ కరుణను తెలుపుటకు, నీ దయను చూపుటకు, నీ వాత్సల్యం పొందుటకు. కరుణించవయ్యా. #namashivaya777
శివ - ఎందుకు శివుడు సర్వోన్నత దేవుడు?
why shiva is the supreme god ? - ShareChat
01:02