ShareChat
click to see wallet page
search
నేడు షిరిడీలో ద్వారకామాయిలో ధుని ఎదురుగా దర్శనమిస్తున్న బాబా ఆసీనుడైయున్న చిత్రపటం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొన్నది. ప్రతీ సాయిభక్తుల గృహాలలోను కొన్ని సాయిమందిరాలలోను ఈ చిత్రపటం దర్శనమిస్తుంది ఈ పటాన్ని రూపుదిద్దినవాడు ఆ రోజులలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన చిత్రకారుడు అయిన శ్యామరావు జయకర్ . సుమారు 1916 సం ప్రాంతంలో జయకర్ తన భార్యా ,పిల్లతో సహా సాయి దర్శనానికి షిర్డీ వచ్చాడు జయకర్ బాబా చిత్రాన్ని గీయటానికి అనుమతించమని బాబాను ప్రార్దించాడు . అది విన్న బాబా.. "అరే ! పిచ్చి బిచ్చగాడిని నా చిత్రం గీసుకొని ఏమి చేసుకొంటావు?" అన్నారు చివరికి బాబా తన చిత్రపటం గీయడానికి ఒప్పుకొన్నారు . సాయి ప్రేరణతో జయకర్ గీసిన చిత్రం ద్వారకమాయిలో ఇప్పటికీ షిరిడీలో కొలువై ఉంది. జయకర్ గీసిన చిత్రం సాయిసచ్చరిత్ర తోనూ బాలాజీ వసంత్ తాలిమ్ మలచిన సమాధిమందిరంలో ఉన్న సాయిబాబా విగ్రహమూర్తితో పోల్చవచ్చును. సాయిసన్నిధిలో ఉండే భక్తులకు కూడా, కష్టాలు తప్పవు. జయకర్ షిరిడీలో సాయిసన్నిధిలో ఉండే సమయములో , మసూచి వ్యాధితో జయకర్ పెద్ద కుమారుడైన రఘునందన్ మరణించాడు . శ్యామరావు జయకర్ భార్యా ఎంతో దుఃఖంతో , బాబా ముందు తన బాధను వినిపించింది. బాబా ఆమెను ఓదారుస్తూ విధి బలీయమని చెప్పగానే ఆమె కొంత శాంతించింది .కానీ బాబా భక్తుల దుఃఖాన్ని చూస్తూ ఉరుకోలేడు గదా! ఆమె దుఃఖం బాబాను చలింపచేసింది .బాబా జయకర్ భార్యతో "దిగులు చెందకు !నీ చనిపోయిన బిడ్డ మరల నీ కడుపున పుడతాడు. బాబా వాక్కు బ్రహ్మ వాక్కు .అది కేవలం ఊరడింపు. మాట కాదు అది సత్యమే అయి తీరుతుంది. విధిని కూడా ఎదిరించగల శక్తి బాబాకు వుంది. బాబా అన్నట్లుగానే జయకర్ దంపతులకు బాబా మహా సమాధి అనంతరం 1920 సం లో ఒక బిడ్డ జన్మించాడు . ఆ బిడ్డకు ఆ దంపతులు " రామ్ " అని పేరు పెట్టారు . సాయిబాబా మన కర్మానుసారం తీసివేసినా.. మరొక చేతితో ఇవ్వగల సమర్థ సద్గురువు. దానికి ఆయనయందు మనకు అచంచల విశ్వాసం ఓర్పు ఎంతో అవసరం. #🙏🏼షిరిడి సాయి బాబా #🕉 ఓం సాయిరామ్😇 #🌅శుభోదయం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🎶భక్తి పాటలు🔱
🙏🏼షిరిడి సాయి బాబా - 97 /4 ٤٩٤ 170r 97 /4 ٤٩٤ 170r - ShareChat