క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా శ్రీ మహాశక్తి దేవాలయంలో తులసి దామోదర కళ్యాణం ఘనంగా నిర్వహించారు .
శ్రీ మహాశక్తి దేవాలయంలో అంగరంగ వైభవంగా తులసీ దామోదర కళ్యాణం.
పవిత్ర కార్తీక మాసం క్షీరాబ్ది ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నేడు సాయంత్రం
శ్రీ మహాశక్తి దేవాలయంలో శ్రీ తులసి దామోదర కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది.
శ్రీశ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విద్యారణ్య భారతి స్వామి వారి దివ్య ఆశీస్సులతో ఆలయ వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో తులసి దామోదర కళ్యాణ మహోత్సవం నిర్వహించగా, కన్నుల పండుగగా సాగింది.
సుహాసినులు తులసి, ఉసిరి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేపట్టి, దీపాలు వెలిగించారు. కార్తీక మాసంలోని క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహాశక్తి దేవాలయంలో నిర్వహించే తులసి దామోదర కళ్యాణం సంతానాభివృద్ది, ప్రశాంతమైన కుటుంబ జీవితాన్ని ప్రసాదిస్తుందని ఇక్కడి వచ్చే మహిళా భక్తుల విశ్వాసం.
కళ్యాణం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆలయ అర్చకులు భక్తులకు ఆశీర్వచనం అందించి, స్వామి అమ్మవారి వారి కల్యాణ తలంబ్రాలను తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు.
#✌️నేటి నా స్టేటస్ #😇My Status #⛳భారతీయ సంస్కృతి #🎶భక్తి పాటలు🔱 #🙆 Feel Good Status
00:31

