*బతుకమ్మ పండగ ప్రారంభం సందర్భంగా అందరికి ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు 💐💐💐*
ఒప్పుకున్న ఒప్పుకోక పోయినా బతుకమ్మ అనగానే గుర్తుకు వచ్చేది ఎవరు ? ముమ్మాటికీ *తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కవితమ్మ గారే !* తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మకు విశేషమైన ప్రాచుర్యాన్ని తెచ్చిండ్రు ! తెలంగాణ ఓ చారిత్రక నేపద్యాన్ని ఒక్క సారి గుర్తు చేసుకుందాం.. ! శాతవాహనుల తొలి రాజధాని కరీంనగర్ జిల్లా లోని కోటిలింగాల బదులుగా గుంటూరు జిల్లాలోని ఓ ప్రాంతంగా విధ్యార్థులు పుస్తకాల్లో చదివే వాళ్ళు ! పోతన ఎక్కడి వాడంటే వరంగల్ ప్రాంతం కాదు కడప ప్రాంతం అని చెప్పబడేది ! ప్రపంచం లో 150 కోటలతో ఘన చరిత్ర కలిగిన తెలంగాణ పదమే నిషిద్దం అయ్యింది ! తెలుగు సాహిత్యం లో జినవల్లభుడు రాసిన తొలి కంద పద్యం వెలసిన బొమ్మలమ్మ గుట్ట ఊసే లేకుండా పోయింది ! విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని నినదించినంత బలంగా రామగుండం ఎరువు తెలంగాణ పరువు అనే నినాదం అక్షర రూపం దాల్చలేకపోయింది ! రెండు జిల్లాల్లో జరుపుకొనే అట్లతద్దె గురించి అచ్చు వేసిండ్రు కాని ప్రపంచం లోనే మహిళలు అతి పెద్దగా జరుపుకొనే బతుకమ్మ గురించి పట్టించుకోలేదు ! అగో సరిగ్గ ఆ బతుకమ్మ అంశాన్నే ఆలంబనగా చేసుకున్న నాయకురాలు కవితమ్మ గారు బయలుదేరింది ! బతుకమ్మకు ప్రాచూర్యాన్ని కలిపించాలని సకల్పించింది ! అందరి సంస్కృతి ఎలుగెత్తబడ్డప్పుడు తన సంస్కృతి ఎందుకు విశ్వ వ్యాప్తం కాకూడదు అనుకొంది ! కొద్ది మంది మహిళలను పోగు చేసి బతుకమ్మ ఆడింది ! పది , ఇరవై , వంద అలా అలా వేలాది మహిళలు ఒక్క చోట చేరిన పూల జాతరను ప్రపంచం వీక్షించింది ! కాదు అలా వీక్షించేలా చేసింది ! తన ప్రాంతం సాంస్కృతికోద్యమ సారధిగా ముందు నడచింది ! అనుకూలం , వ్యతిరేఖం ఏది అయితేనేమి అందరి నోట బతుకమ్మ అనిపింపించింది ! ఇక బతుకమ్మను అచ్చువేయక పేపర్లకు తప్పేది కాదు ! తొమ్మిది రోజుల పాటు టివిలు చర్చకు పెట్టే అనివార్య పరిస్థితులు కల్పించబడ్డాయి ! ఎవరెన్ని విమర్శలు చేసినా తన కృషి మూలంగా బతుకమ్మ పాఠ్య పుస్తకం లో ఓ పాఠ్యాంశం అయ్యింది ! మరుగున పడ్డ కళలు సాంకృతిక అంశాలు అక్షర రూపం దాల్చాయి ! ఎట్టకేలకు కోట్లాది గిరిజనుల పండుగ అయిన సమ్మక్క సారక్క చరిత్ర పుస్తకం లో అచ్చయ్యింది ! బౌద్దం అంటే అమరావతి అనుకొనే పరిస్థితి నుండి వెయ్యేండ్ల చరిత్ర గలిగిన దూళికట్ట వెలుగులోకి వచ్చింది ! తెలుగుకు ప్రాచీన హోదాకు కావలసిన ఆధారాల కొరకు ఆంధ్రాలో వెతికే ఆర్కియాలజీ శాఖ తెలంగాణ గడ్డను తవ్వింది ! మన గడ్డలోనే అసలైన మూలాలు ఉన్నయని కేంద్రమూ అంగీకరించింది ! తన కార్యదక్షత తో తెలంగాణ చారిత్రక , సాంకృతికాంశాల కు ప్రత్యక్షంగా , పరోక్షంగా పునరుజ్జీవం పోసిండ్రు కవితమ్మ గారు!
తమ విశ్వసనీయ
*కప్పాటి పాండురంగా రెడ్డి*
రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్
#కప్పాటి పాండురంగా రెడ్డి (Kappati Panduranga Reddy) #తెలంగాణజాగృతి
#బతుకమ్మ శుభాకాంక్షలు