*"నేను" (అహం) – రమణుల దృష్టి*
రమణ మహర్షి చెప్పింది ఏమిటంటే "నేను" అనే భావం (అహం-వృత్తి) అన్ని ఆలోచనలకు మూలం.
ప్రతి ఆలోచనకూ ఒక “నేను” అనేది ఆధారం ఉంటుంది. కాబట్టి మనసుని మూలానికే వెళ్ళి “ఈ నేను ఎవరు?” అని విచారించమని బోధించారు.
అందువల్ల ఆయన దృష్టిలో "నేను" అనే మంత్రం అనేది శబ్ద మంత్రం కంటే ఎక్కువగా సాక్షాత్కారానికి నేరుగా దారి తీసే బాణంలాంటిది.
#ఓం నమో భగవతే శ్రీ రమణాయ
రమణుల మాటల్లో: “ఓంకారం కంటే కూడా ‘నేను’ అనుభవమే ప్రాధాన్యమైనది. ఎందుకంటే అది నేరుగా ఆత్మను సూచిస్తుంది.”


