ShareChat
click to see wallet page
search
*మన దేవాలయాలు*_ 🪴🎪🎪🎪🎪🎪🎪🎪🎪🎪🎪🪴 *కర్నూలు జిల్లా : మంత్రాలయం* *శ్రీ రాఘవేంద్రస్వామి ఆలయం* భారతావని పుణ్యభూమి. ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు, గుడులు గోపురాలకు కొదువ లేదు. ఆరోజుల్లో అత్యధిక ధన, కనక సంపద ఆలయాల్లోనే ఉండేది. అందుచేతనే పరమతస్థులు తమ దండ యాత్రలో ముఖ్యంగా దేవాలయాలనే ఎంచుకొని కొల్లగొట్టారు. అలాంటి ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన ఆలయాల్లో శ్రీ రాఘవేంద్ర స్వామి ఆలయం ఒకటి. ఈ ఆలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు కర్నూలు నుండి 100కి.మీ దూరంలో తుంగభద్ర తీరంలో ఉంది. కలియుగంలో భూమిపై ధర్మాన్ని, నీతిని స్థాపించేందుకు దైవ సంకల్పంతో జన్మించిన కారణ జన్ముడు శ్రీ రాఘవేంద్ర స్వామి. శ్రీహరి భక్తుడు. ఈయన కొలువై ఉన్న ప్రాంతమే "మంత్రాలయం". మంత్రాలయం అసలు పేరు "మాంచాల". శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖ గురువు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తున్నారు. తమిళనాడులోని కుంభకోణం మధ్వమఠాన్ని 1624 నుండి 1636 వరకూమఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేసారు. ఇతను శ్రీమూల రాముడి, శ్రీ పంచముఖ ఆంజనేయస్వామికి పరమ భక్తులు. *చరిత్ర :* రాఘవేంద్రస్వామి వెంకణ్ణ భట్టుగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మన్నభట్టు, గోపికాంబ అనే దంపతులకు రెండవ సంతానంగా 1595లో జన్మించారు. రాఘవేంద్ర స్వామి (1595-1671). జన్మ సంవత్సరం 1598 లేదా 1601 కూడా కావచ్చు అనే వాదనలున్నాయి. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు ఈతణ్ణి చిన్నప్పుడు వేంకటనాథుడనీ, వేంకటాచార్య అని కూడా పిలిచేవారు. తన బావ లక్ష్మీనరసింహాచార్ వద్ద మధురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక, వేంకటనాథుడిని కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేరి, ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్యాసించారు. 1614లో మధురై నుండి తిరిగి వచ్చినపుడు సరస్వతీబాయితో వీరికి వివాహమైంది. వీరి కొడుకు లక్ష్మీనారాయణాచార్య అదే సంవత్సరంలో పుట్టాడు. శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్రతీర్థుల వద్ద అభ్యసించడం మొదలుపెట్టారు. అనతికాలంలో గొప్ప విద్యార్థిగా ఉద్భవించి, అన్ని వాదోపవాదాలలో తర్కాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు. సంస్కృత, వైదిక శాస్త్రాల్లో నిష్ణాతుడై ఇతరులకు బోధించడం మొదలుపెట్టారు. రాఘవేంద్రస్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే, ఆయన కాలంలో ఆయనో గొప్ప వైణికుడు కూడా. తరువాత సంసార బంధాలు వదిలించుకుని సన్యాసం స్వీకరించి ....మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణ భారత దేశమంతా తిరిగారు.. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్యబృందానికి చూపిస్తూ మధ్వప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేసారు. మధ్వమఠంలో సన్యాసం స్వీకరించిన రాఘవేంద్రస్వామి అక్కడున్న మూల రాములను పూజిస్తూ, బోధనలు చేస్తూ మంత్రాలయానికి వచ్చారు. స్వామి పూర్వ అవతారం శ్రీమహావిష్ణువు భక్తపరాయణుల్లో ఒకడైన ప్రహ్లాదుడు. అప్పుడు యజ్ఞాలు, యాగాలు చేసిన స్థలం మంత్రాలయమని గాథ. అందుకే పూర్వవతారంలో రాజుగా పాలించిన స్థలం కావడంతో ఇక్కడే తాను బృందావనస్థులు (జీవ సమాధి) కావాలని స్వామి తలచారు. ఆ సమయంలోనే ఆ గ్రామదేవత మంచాలమ్మ (రేణుకాంబ రూపిణి) రాఘవేంద్రస్వామిని ఇక్కడే ఉంచాలని ఆజ్ఞాపించిందట! దీంతో స్వామి ఇక్కడే ఉంటూ చివరకు ఇక్కడే బృందావనస్థులు అయ్యారు. అప్పటి నుంచి నిత్యం రాఘవేంద్రస్వామి మూల బృందావననానికి పండితులు మంత్రాలు వల్లిస్తూ ఉండటంతో ఈ మఠం కాలక్రమంలో మంత్రాలయంగా మారిందని చెబుతారు. ఇతను వైష్ణవాన్ని అనుసరించాడు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. 1671లో తన శిష్యబృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవసమాధి అయ్యారు. శ్రీ రాఘవేంద్రస్వామి వారు జీవ సమాధిలో వుండికూడ అనేక మహిమలు ప్రదర్శిస్తుంటారు. భక్తులు కోర్కెలు తీరుస్తుంటారు. ఆ స్వామి జీవ సమాధి అయిన తరువాత తనకు కనిపించి తనతో మాట్లాడినట్లుగా Thomas Manro అనే ఆంగ్లేయ అధికారి చెప్పినట్లు కర్నూలు జిల్లా Gajette Records లో ప్రస్తావించబడింది. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ ద్వితీయనాడు 'ఆరాధన' ఉత్సవం జరుపబడుతుంది. తనను దర్శించిన భక్తుల కోరికలను తీర్చటమే కాకుండా, వారికి మంచి ఆరోగ్నాన్ని, సిరిసంపదలను కలుగచేస్తున్న వర ప్రదాత మూగ, చెవిటి, గ్రుడ్డి వారందరికి స్వస్థత చేకూర్చే ఆరోగ్య ప్రధాత శ్రీ రాఘవేంద్ర స్వాములవారు. *మాంచాలమ్మ ఆలయం :* మంత్రాలయం గ్రామ దేవతగా మాంచాలమ్మని కొలుస్తారు. శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకునే ముందు భక్తులు మాంచాలమ్మ వారి ఆలయాన్ని దర్శించుకుంటారు. రాఘవేంద్ర స్వామి వారు ఈ మాంచాలమ్మ వారిని ప్రతి రోజు పూజించే వారని అంటారు. *పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం:* ఇక్కడే రాఘవేంద్రస్వామి 12 ఏళ్లపాటు తపస్సు చేశారట! నాటి పంచముఖ ఆంజనేయుడి ప్రతిరూపమే ఇక్కడ చూడొచ్చు. అయిదు ముఖాలతో ఇక్కడ కనిపించే ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేకమైనది. 🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔🔔 #☀️శుభ మధ్యాహ్నం #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🌷గురువారం స్పెషల్ విషెస్ #🛕రాఘవేంద్ర స్వామి🙏 #🛕మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి🕉️
☀️శుభ మధ్యాహ్నం - ShareChat
00:29