ShareChat
click to see wallet page
search
#సప్తగిరి ల పై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి నమో నమః #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #📙ఆధ్యాత్మిక మాటలు #🙏శనివారం భక్తి స్పెషల్ 💐 #శనివారం శుభోదయం 🕉️ గోవిందా! అఖండమైన నీ తత్వంలో అణువంత తెలిసినా అంతులేని అనందం పొందగల జీవులం మేము. 🕉️అయినా ఆ అణువంత జ్ఞానాన్ని కూడా పొందనీయక ఆకాశమంత మాయ మమ్మల్ని ఆవరించి అయోమయంలోనూ అంధకారంలోను అజ్ఞానంలోనూ ముంచేస్తున్నది.. 🕉️అశాశ్వతమైన వాటికి వగచుచు శాశ్వతమైన నిన్ను చేరాలని పొందాలని తెలియాలని అన్న ఆలోచనలకు దూరమై మరింత దుఃఖానికి లోనవుతున్నాము. 🕉️మార్గము ఆగమ్యగోచరముగా ఉన్నది తండ్రీ...బిడ్డలు తప్పిపోతే ఆందోళనతో వారు దొరికేదాకా వెదికి వెదికి అక్కునచేర్చుకొనే వాత్సల్యం నీది కదా ? 🕉️మార్గం మరచిపోతే చేయిపట్టి నడిపించే బాధ్యతగల ప్రేమ నీది కదా ?? 🕉️బిడ్డల చిన్న చిన్న పొరపాట్లకు మందలించి మురిసిపోయి అక్కునచేర్చుకొనే ఆదరణ నీది కాదా! 🕉️మనుజ జాతిలో మేమే జన్మనిచ్చిన బిడ్డల బాగోగులకై ప్రతి క్షణము పరితపిస్తామే అలాంటిది సృష్టికర్తవైన నీకు మా బాగోగులు చూడాలని నేను తెలుపవలెనా ??
సప్తగిరి ల పై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి నమో నమః - ShareChat
00:22