#ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #దీప పూజ మంగళప్రదం 🪔🙏 #ఆషాఢ అమావాస్య..పితృ అనుగ్రహానికి ఈ రోజు👈 #ఆషాడ మాసం - ఆధ్యాత్మికతకు అనువైన మాసం #ఆషాఢ అమావాస్య వైశిష్ట్యం 🌑🌒
*దీపపూజ మంగళప్రదం*
ఆషాఢ బహుళ అమావాస్యనాడు కొన్ని ప్రాంతాలలో దీప పూజ చేయడం కూడా కనిపిస్తుంది. పవిత్ర శ్రావణ మాసాన్ని స్వాగతించడానికి ఆషాఢ మాసం చివరి రోజైన అమావాస్యనాడు దీపపూజ జరుపుకుంటారు. ఆషాఢమాసంతో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రివేళలు పెరుగుతాయి, చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞావానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. వాటిని పారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా కూడా దీపపూజని చేస్తారు. దీపపూజ జ్ఞానం ప్రసాదిస్తుంది, అష్టలక్ష్ముల ఆశీర్వాదాలు పొందడానికి తోడ్పడుతుందని శాస్త్ర వచనం. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలని శుభ్రంగా అలికి, వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీపస్తంభాలు లేదా కుందులను ఉంచుతారు. ఆ దీపాలకు పసుపుకుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. కొందరు దీపాలను నదిలో వదులుతారు. పెద్దలు చెప్పిన ఈ సంప్రదాయాన్ని ఆచరించడం మంగళప్రదం.
*🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*


