ShareChat
click to see wallet page
search
#సంకటహర చతుర్థి వ్రత విధానం, ఓం విఘ్నేశ్వరాయ నమః 🙏🙏🙏 #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత: సంకటహర చతుర్థి / సంకష్టహర చతుర్ధి #అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా #అంగారక సంకటహర చతుర్థి #ఈరోజు ఆధ్యాత్మిక విశిష్టత #ఈరోజు 'సంకష్టహర చతుర్థి' శుభదినం వినాయకుడికి గరికతో పూజా శుభప్రదం 🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🙏 *శ్రీ సంకష్ట హర చతుర్థీ వ్రతము* *శ్రావణమాస మాహాత్మ్యం వ్రత కథ* *ఆగస్టు 12 అంగారక సంకష్టహర చతుర్థి సందర్భంగా...* ఈ వ్రతము శ్రావణముతో ప్రారంభమగును గనుక, శ్రావణముతో ప్రారంభించి ఆషాడముతో పూర్తి చేయవలెను. కథను ప్రారంభించునపుడు, ముందుగా పఠించవలసిన శ్లోకములు... పరిష్కర్త. కథా ప్రారంభమున చదువలసిన శ్లోకములు... _శ్రీ గణపతి_ శ్లో॥ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ దక్షిణామూర్తి శ్లో॥ ఈశ్వరో గురు రాత్మేతి మూర్తిభేదవిభాగినే ! వ్యోమన ద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తియే నమ: శ్రీ గౌరిదేవి శ్లో॥ సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థసాధికే ! శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే శ్రీ లక్ష్మీదేవి శ్లో॥ క్షీరోదార్ణవసంభూతే కమలే కమలాలయే ! సుస్థిరా భవ మే గేహే సురాసురనమస్కృతే... శ్రీ సరస్వతీ దేవి శ్లో॥ సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసదా... చతుర్మఖ ముఖాంభోజ వనహంసవధూ ర్మమ, మనసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతీ... శ్రీరస్తు శ్రావణమాస కథ _శ్రీ మహాగణాధిపతయే నమ:_ మహర్షు లెల్లరు కుమారస్వామిని " దేవా ! దారిద్ర్యము, దుఃఖము, శత్రుబాధ మున్నగునవి తొలగి, సమస్తు మంగళములు సిద్ధించి, మానవులు సుఖశాంతులతో నుండుటకై ఆచరింపదగిన ఉత్తమ వ్రతమును ఉపదేశింపుడు" అని ప్రార్థింపగా, కుమారస్వామి వారితో “ మునులారా ! సర్వార్థసాధకము, సకల కష్టనివారకము, మంగళప్రదము” శీఘ్రసిద్ధికరము అగు ఒక్క పుణ్యవ్రతము గలదు. అది “సంకష్టహర చతుర్థీ వ్రతము " ఇది గణపతికి సంబంధించినది. ఈ వ్రతముకు శ్రావణ బహుళ చతుర్థీ నాటి రాత్రి, చంద్రోదయ కాలమున ఆచరింపవలెను. ఈ వ్రతమును శ్రావణ బహుళ చతర్థీ నాటి రాత్రి, చంద్రోదయ కాలమున ఆచరింపవలెను. పిదప ప్రతి మాసమునను కల్పోక్తముగ పూజించవలెను. మునుపు ధర్మరాజు శ్రీ కృష్ణుని వలన ఈ వ్రతమును తెలిసికొని, ఆచరించి, సర్వశుభములను పొంది సుఖించెను. ఆ ఉపదేశమునే మీకును తెల్పెదను వినుడు. మునులారా ! హిమంతుని పుత్రిక పార్వతీదేవి వరమశివుని వివాహమాడగోరి, తీవ్రముగ తపస్సు చేయసాగెను. మొదట గణపతిని స్మరించి, పిదప పంచాక్షరీ మంత్రమును జపించుచుండెను. ఇట్లుండ గణపతి ప్రత్యక్షమై " అమ్మా ! నీ మనోరథమేమి ? నీవుకోరివరమిత్తును కోరుము." అనగా, పార్వతీ " గణపతి ! నేను శివుని పెండ్లిచేసికొనదలచితిని, కనుక నా కోరిక శీఘ్రముగ నెరవేరుటకై ఏదైన మంచి వ్రతమును ఉపదేశింపుము." అని అర్థించెను. అంతట మహాగణపతి పార్వతితో అమ్మా ! వ్రతములలో నెల్ల ఉత్తమమైన సంకష్టహర చతుర్థీ వ్రతము అనునది గలదు. దీనిని శ్రావణ బహుళ చతుర్థి (చవితి)నాడు (2 సంవత్సరములు) చేయవలెను. వ్రతము చేయునాడు శిరస్స్నానము చేసి ఉపవాసముండవలెను. నిర్మలమైన మనస్సుతో నన్ను ధ్యానించి, పంచామృతములతో అభిషేకించి కల్పోక్తముగ పూజించి నాకు ఇష్టములైన భక్ష్యభోజ్యములను నివేదించి, నాకును, చంద్రునికిని అర్ఘ్యప్రదానము గావింపవలెను. 1008 లేక 108 సమిధలతో నున్ను గూర్చి హెూమము చేయవలెను. పిదప బంధువులతో గూడి, భుజింపవలెను. ఈ వ్రతమును దంపతులుగనే ఆచరించవలెను. కార్యార్థులైనవారు, బ్రహ్మచారి, కన్య, విద్యార్థి విడిగానైనను పూజించి కార్యసిద్ధి నొందవచ్చును. ఇట్లు నన్ను భక్తిశ్రద్ధలతో కల్పోక్తప్రకారముగ పూజించిన వారికి అన్ని కోరికలను తప్పక నెరవేర్తును. కనుక అమ్మా ! నీవును ఈ వ్రతమును ఆచరించి, మనోరథసిద్వి నొందుము అని వివరించెను. ఇట్లు గణపతిచే ఉపదేశమునొందిన పార్వతీదేవి, ఈ సంకష్టహర చతుర్థీ వ్రతమును ఆచరించి, పరమశివుని పెండ్లాడి, సర్వమంగళయై, సుఖించెను. అహల్య ఈ వ్రతమును యథాశాస్త్రముగ ఆచరించి తన మనోరథసిద్ధి పొందెను. కావున ఓ ధర్మరాజా ! నీవును ఈ వ్రతమాచరించి వనవాసాది కష్టమునుండి గట్టెక్కి రాజ్యమునొంది సుఖింపుము " అని శ్రీకృష్ణుడు ఉపదేశింపగా - ధర్మరాజు అట్లే ఆచరించి, రాజ్యాదిలాభము లొంది, తమ్ములతో, భార్యలతో గూడి, సుఖించెను. ఇట్లు శ్రీకృష్ణధర్మరాజు సంవాదాత్మకమగు శ్రావణమాస సంకష్టహర చతుర్థీవ్రత కథ సమాప్తం. శ్రీ మహాగణపతి ప్రసాదసిద్ది రస్తు ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః "సర్వేజనా స్సుఖినో భవంతు" #namashivaya777
సంకటహర చతుర్థి వ్రత విధానం, ఓం విఘ్నేశ్వరాయ నమః 🙏🙏🙏 - ShareChat