ShareChat
click to see wallet page
search
#ఈరోజు ఆధ్యాత్మిక విశిష్ఠత శ్రావణ పుత్రాద ఏకాదశి / పవిత్రోపన ఏకాదశి #పుత్రాద ఏకాదశి / పవిత్రోపన ఏకాదశి #ఏకాదశి *పుత్రదా ఏకాదశి* *పుత్ర సంతానాన్నిచ్చే ఏకాదశి* *ఆగస్టు 05 మంగళవారం పుత్రదా ఏకాదశి సందర్భంగా...* ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసంలో ఎన్నో పూజలు వ్రతాలు చేస్తుంటారు. ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతూ శోభాయమానంగా కనిపిస్తాయి. ఈ మాసంలో వచ్చే మంగళ, శుక్రవారాలు మంగళ గౌరీ వ్రతం, వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తూ ఉంటారు. ఈ మాసంలో వచ్చే ఏకాదశి కూడా ఎంతో పవిత్రమైనదని పురాణాలు చెబుతున్నాయి. ఒక నెలలో శుక్లపక్షం, కృష్ణపక్షం ఉంటాయి. ఈ పక్షంలో వచ్చే పదకొండవ రోజును ఏకాదశి అంటారు. నెలకు రెండు ఏకాదశుల చొప్పున సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశిని శ్రావణ పుత్రాద ఏకాదశి అని అంటారు. ఏకాదశి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైనది. శ్రావణ మాసంలో శుక్ల ఏకాదశి రోజు ఉపవాసం ఉండి ప్రత్యేక వ్రతం ఆచరించడం వల్ల వారికి సంతానం కలుగుతుందని శాస్త్ర వచనం. పుత్ర ఏకాదశి గురించి భవిష్య పురాణం ఎంతో అద్భుతంగా వివరించింది. భవిష్య పురాణం ప్రకారం మహిజిత్తు అనే రాజు తన రాజ్యంలోని ప్రజలందరూ సిరిసంపదలతో ఆనందంగా ఉండాలని భావించాడు. ప్రజలకు ఏ కష్టాలు లేకుండా పరిపాలన కొనసాగించాడు. ఆ రాజుకు సంతానం లేకపోవడం వలన చింతించసాగాడు. ప్రజలు కూడా తమ రాజుకు సంతానం కలగాలని పూజలు చేసేవారు. సంతానం కోసం రాజు చేయని పూజ లేదు. హోమం లేదు. తమ రాజ్యానికి సమీపంలోనే లోమశుడనే మహర్షి ఉన్నడని తెలుసుకున్న అక్కడి ప్రజలు కొందరు ఏ వ్రతం చేస్తే తమ రాజుకు సంతానం కలుగుతుందో చెప్పమని వేడుకుమారు శ్రావణ మాసంలోని మొదటి ఏకాదశిని నిష్టగా ఆచరిస్తే వారికి సంతానం కలుగుతుందని ఆ మహర్షి చెప్పాడు. ఆ మహర్షి చెప్పిన ప్రకారం రాజ దంపతులతో పాటు కొంతమంది ప్రజలు కూడా ఎంతో నిష్టగా ఏకాదశి వ్రతం ఆచరించారు. మహర్షి చెప్పినట్టుగా ఆ రాజుకు పుత్రసంతానం కలిగింది. అప్పటినుంచి ఈ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని పిలుస్తున్నారు. ఈ వ్రతం ఆచరించేవారు దశమి రోజు రాత్రి నుంచి ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేసి వైష్ణవాలయాన్ని దర్శించి సూర్యాస్తమయానికి ఉపవాసం విడిచి భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వల్ల సంతానయోగం కలుగుతుందని భవిష్యపురాణం చెబుతోంది. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
ఈరోజు ఆధ్యాత్మిక విశిష్ఠత శ్రావణ పుత్రాద ఏకాదశి / పవిత్రోపన ఏకాదశి - ఆధ్యాత్యిక ఆనిందం ஒத 85@3 SE03 &5068 Ioo Daily Wish Telugu +91 9700722711 ఆధ్యాత్యిక ఆనిందం ஒத 85@3 SE03 &5068 Ioo Daily Wish Telugu +91 9700722711 - ShareChat