హైదరాబాద్: నగరంలో భారీ వర్షానికి రోడ్లపై నీరు చేరడంతో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. బేగంపేట ప్రధాన రహదారిపై ట్రాఫిక్ స్తంభించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సికింద్రాబాద్ సమీపంలోని పైగా కాలనీ నీట మునిగింది. పలు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్, హైడ్రా, అగ్నిమాపక, ట్రాఫిక్ సిబ్బంది బోట్ల సాయంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు కొండాపూర్ పరిధిలోని ఖానామెట్‌లోనూ పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌జామ్ కావడంతో రద్దీని క్లియర్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు. #🔴జూలై 19th అప్‌డేట్స్📢 #🔴దంచికొట్టిన వర్షం..నీట మునిగిన నగరం #📽ట్రెండింగ్ వీడియోస్📱
00:35

