#తిరుమల తిరుపతి దేవాలయ భక్తి సమాచారం🙏 #తిరుమల ఆధ్యాత్మిక సమాచారం - TTD NEWS #తిరుమల వైభవం #తిరుమల వేంకటేశుని వైభవం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
👆 టిటిడి అనుబంధ ఆలయాలలో ఘనంగా సౌభాగ్యం
తిరుపతి, 2025 ఆగస్టు 08: టిటిడి మరియు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఆగష్టు 8వ తేదీ వరలక్ష్మీ వ్రతం సందర్భంగా 52 టిటిడి అనుబంధ ఆలయాలలో సౌభాగ్యం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సౌభాగ్యవతులకు గాజులు, పసుపు, కుంకుమ, అక్షింతలు, పుస్తక ప్రసాదాలు అందించారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలోని టీటీడీకి ఆలయాలలో సౌభాగ్యవతులకు గాజులు, కుంకుమ ప్యాకెట్లు, కంకణాలు, పసుపు దారాలు, శ్రీ పద్మావతీ అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పుస్తక ప్రసాదాలను అందించారు. తిరుచానూరు, నారాయణవనం , శ్రీకాకుళం, కార్వేటినగరం, దేవుని కడప, ఒంటిమిట్ట, హైదరాబాద్, సీతంపేట, పిఠాపురం, కీలపట్ల, అనంతవరం, రాజాం, సరిమల్లె, అమరావతి, విజయవాడ తదితర 52 ఆలయాల్లో సౌభాగ్యం కార్యక్రమం కింద సౌభాగ్యవతులకు గాజులు, కుంకుమ, పసుపు దారాలు, కంఃణాలను స్థానిక అధికారులు, శ్రీవారి సేవకులు పంపిణీ చేశారు.
దాతల సహకారంతో 8 లక్షల గాజులు, 1.60 లక్షల కంకణాలు, 1.60 లక్షల పసుపు దారాలు, 1.60 లక్షల అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు, అమ్మవారి లక్ష్మీ అష్టోత్తర శత నామావళి పుస్తక ప్రసాదాలను అందించారు. ఆయా ఆలయాలకు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టిటిడి ప్రధాన ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.