ShareChat
click to see wallet page
search
#పూరి జగన్నాథ రథ యాత్ర 2025 🛕🙏 #ఆధ్యాత్మికం - ఆనందం 🚩 డైలీ విష్ 🚩 #పూరిధామ్ - శ్రీక్షేత్రం - పూరి జగన్నాథ్ స్వామి దివ్యధామ్ #పూరి జగన్నాథ్ స్వామి వైభవం 🛕పూరి జగన్నాథ్ ఆలయంలో జరుగు ఉత్సవాలు / PURI UTSAVALU 🕉️🙏🙏🙏 #🛕జగన్నాథుని రథయాత్ర🛕 *దేవదేవుని రథయాత్ర* *పురీ జగన్నాథ రథయాత్రకి ప్రపంచ ప్రసిద్ధి ఉంది.* 'పురుషోత్తమ క్షేత్రం'గా పురాణాలలో వర్ణింపబడే ఈ పావనధామం అద్భుతాలకు ఆలవాలం. సృష్ట్యాదినుండే ఈ క్షేత్రాన నీలాచలమనే దివ్యపర్వతం ఉండేదనీ, ఇక్కడ ఇంద్రనీల మణితో చేసిన విష్ణువిగ్రహం దేవతలచేత ఆరాధించబడేదనీ పురాణాలు చెబుతున్నాయి. *సాగరస్యోత్తరే తీరే మహానద్యాస్తు దక్షిణే ।* *సప్రదేశః పృథివ్యాం హి సర్వతీర్థ ఫలప్రదః ||* "సముద్రానికి ఉత్తరతీరాన, మహానదికి దక్షిణాన అన్నితీర్థాల ఫలాన్నిచ్చే ప్రదేశమది." అని స్కాందపురాణం చెబుతోంది. కాలక్రమంగా ఆ క్షేత్రాన రత్నవిగ్రహం అదృశ్యమయింది. అవంతీ దేశాధి పుడైన ఇంద్రద్యుమ్న చక్రవర్తికి స్వప్నంలో శ్రీ మహావిష్ణువు గోచరించి, ప్రేరేపించగా అతడీ క్షేత్రానికి చేరుకున్నాడు. సముద్రతీరంలో ఒక దివ్యయాగాన్ని నిర్వహించాడు. ఆ యజ్ఞం పరి సమాప్తివేళ, యజ్ఞఫలంగా సముద్ర జలాల నుండి ఒక గొప్ప వృక్షరాజం తేలివచ్చింది. అది విష్ణు మయమైన వృక్షం, నారాయణుని ఆజ్ఞప్రకారంగా విశ్వకర్మ (దేవశిల్పి) ఆ వృక్షాన్ని నాలుగు విగ్రహాలుగా తయారు చేశాడు. అవి జగన్నాథ, బలభద్ర, సుభద్ర, సుదర్శన దేవతా స్వరూపాలు *ఏకదారు సముత్పన్నాశ్చతుర్ధా సంభవిష్యతి।* ఒకే దారువు (కర్ర) నాలుగు విగ్రహాలుగా అయినదని పురాణోక్తి. కృతయుగంలోనే ఈ దేవతలు ఆవిర్భవించారని స్కాందం చెబుతోంది. మహాలక్ష్మీ దేవియే సుభద్రా స్వరూపమనీ, ద్వాపరయుగంలో లక్ష్మీ అంశ కృష్ణ సోదరిగా రోహిణి పుత్రికగా జన్మించిందని పురాణ కథనం. ఈ క్షేత్రానికి శివుడే క్షేత్రపాలకుడు, ఎనిమిది లింగమూర్తులుగా వివిధ దిశలలో నెలకొన్నాడు. ఎనిమిది దిక్కుల శక్తి పలురూపాలలో వెలసింది. ఈమె క్షేత్రరక్షాశక్తి, *తస్మాద్దారుమయం బ్రహ్మ వేదాంతేషు ప్రగీయతే॥ (స్కందపురాణం)* 'ఇది దారురూపంలో ఉన్న బ్రహ్మమ్'- అని వేదాంతాలలో కీర్తించబడింది. ఈ విగ్రహాలను బ్రహ్మదేవుడే స్వయంగా ప్రతిష్ఠించాడని శాస్త్రాలు వచిస్తున్నాయి. ఈ నాలుగు ఆకృతులను బృహస్పతితో కలిసి, దేవతల సమక్షంలో బ్రహ్మదేవుడు శ్రీసూక్త, పురుష సూక్తాలతో అభిమంత్రించి ప్రతిష్ఠించాడు. *వైశాఖస్యామలే పక్షే అష్టమ్యాం పుష్యయోగతః|* *కృతాప్రతిష్ఠా భోవిప్రాః శోభనే గురువాసరే॥* ( పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్యం) వైశాఖ శుక్ల అష్టమీ- గురువారం- పుష్యమీ నక్షత్రం ఉన్న పుణ్య సమయంలో ప్రతిష్ఠ జరిగింది. శ్రీ నృసింహ యంత్రంతో, మంత్రంతో చతుర్ముఖుడు ఈ ప్రతిష్ఠా మహోత్సవం జరిపినట్లు పురాణం వర్ణిస్తోంది. అందుకే ఇది ప్రధానంగా నృసింహక్షేత్రం. ఇక్కడి మహా వట వృక్షం, తీర్థం అత్యంత పురాణ ప్రసిద్ధి చెందినది. జ్యేష్ఠపూర్ణిమ నాటి నుండి జ్యేష్ఠావ్రతాన్ని ఆచరించి, ఆషాఢశుద్ధ విదియ నాడు ఆ దివ్యమూర్తులకు రథ యాత్రను మొదట బ్రహ్మదేవుడే జరిపించాడని పురాణోక్తి. అప్పటి నుండి పరంపరగా ఈ రథయాత్ర ఏటా జరుగుతోంది. ఇప్పటికీ పన్నెండేళ్లకోసారి (అధికాషాఢం వచ్చిన ఏడాది) విష్ణులాంఛనాలతో ఉన్న దివ్యవృక్షాలను, కొన్ని సంకేతాల ద్వారా, ఆచార్యులు తెలుసుకొని, వివిధ ఉత్సవాలలో ఆ వృక్షాలను తరలించి, పద్దతి ప్రకారంగా విగ్రహాలను చెక్కిస్తారు. పాత విగ్రహాలలోని కళలను ఈ నూతనాకృతులలో పునఃప్రతిష్ఠించి, పాతవాటిని సంప్రదాయబద్ధంగా ఖననం చేస్తారు. ఇది కేవలం ఈ క్షేత్రానికి మాత్రమే ప్రత్యేకం. ప్రతిఏడూ మూలవిరాట్టులే సాక్షాత్తుగా కదలివచ్చే రథయాత్ర తొమ్మిది రోజుల పర్వం. దీనికి *'మహావేదీ మహోత్సవం'* అని పేరుకూడా పురాణాల్లో కనిపిస్తోంది. ప్రధానాలయం నుండి, ఒక్క రోజులో సకల భక్తజనులు భక్తి మయ హృదయాలతో స్వామివారిని గుండిచా మందిరానికి తరలిస్తారు. అక్కడ కొన్ని రోజులపాటు ఆరాధింపబడి. ఆ వేళలో క్షేత్రానికీ, జగతికీ సకల శుభాలను అనుగ్రహించి, తిరిగి తొమ్మిదవ రోజున తన నిజమందిరానికి స్వామి సపరివారంగా చేరుకుంటాడు. *రథస్థితం వ్రజంతం తం మహావేదీ మహోత్సవే ।* *యేపశ్యంతి ముదాభక్త్యా వాసస్తేషాం హరేః పదే ॥* “మహావేదీ మహోత్సవానికై రథంలో యాత్రచేసే స్వామిని సంతోషంతో భక్తితో చూసేవారికి విష్ణుపదంలో నిత్యవాసం కలుగుతుంది.” ఆ వేళ స్వామిని తాకి వచ్చేగాలి ఒంటికి తగిలితే చాలు పాపాలు, అమంగళాలు నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. *యధారథ విహారోయం మహావేదీ మహోత్సవః |* *యత్రాగత్యదివో దేవాః స్వర్గం యాంత్యధికారిణః ॥* ఈ రథయాత్రకు దేవతలందరూ స్వర్గం నుండి దిగివచ్చి, ఉత్సవం తరువాత తిరిగి వెళతారని “పురుషోత్తమ క్షేత్ర మాహాత్మ్యం" చెబుతోంది. కొన్నిలక్షల మంది దర్శించి, తరించే ఈ పావన రథయాత్ర ఒక మహాద్భుతం. భారతీయ సంస్కృతిలో భవ్యచైతన్య ముద్ర ఈ క్షేత్రానికి ఉంది. *🚩 ┈┉┅━❀꧁ॐ డైలీ విష్ ॐ꧂❀━┅┉┈ 🚩*
పూరి జగన్నాథ రథ యాత్ర 2025 🛕🙏 - App g ఖురీజగన్నుథరథయంత్ర శుభాకంక్షలు PSVAPPARAO App g ఖురీజగన్నుథరథయంత్ర శుభాకంక్షలు PSVAPPARAO - ShareChat