ఫ్రెండ్షిప్ డే చరిత్ర:
స్నేహ బంధానికి గుర్తుగా మనం ఫ్రెండ్షిప్ డే జరుపుకొంటున్నాం. 1930లో ఓ గ్రీటింగ్ కార్డుల వ్యవస్థాపకుడు తన వాణిజ్య అవసరాల కోసం ఈ దినోత్సవాన్ని ప్రచారం చేశారు. అప్పుడు చాలామంది ఆ గ్రీటింగ్ కార్డులు కొనుగోలు చేసి, ఫ్రెండ్షిప్ డేను నిర్వహించారు. అయితే కొన్నేళ్లు గడిచాక ఆ ట్రెండ్ ఆగిపోయింది. మళ్లీ 1958లో వివిధ సంస్కృతుల మధ్య సంబంధాలను పెంపొందించడానికి వరల్డ్ ఫ్రెండ్షిప్ క్రూసేడ్ అనే సంస్థ జులై 30న ఫ్రెండ్షిప్ డే నిర్వహించాలని ప్రతిపాదించింది. దీంతో ఐక్యరాజ్యసమితి 2011లో జులై 30ని అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. కానీ ఇండియా, యూఎస్ వంటి మరికొన్ని దేశాలు అంతకుముందు నుంచే ఆగష్టు మొదటి ఆదివారాన్ని ఫ్రెండ్షిప్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయి.
.......
#HistoryOfFriendShipDay #friendShipDay #manavoiceSpecialStory #FriendshipDaySpecial #manavoice #manavoiceFamily #friendship day #హ్యాపీ ఫ్రెండ్షిప్ డే #national friendship day on 30-07-2020 #friendship day #friendship


