ShareChat
click to see wallet page
search
#mother's day May 11 "వేసా మొదటి అడుగు అమ్మ వేలే ఊతగా నేర్చా మొదటి పలుకు అమ్మ పేరే ఆదిగా నాలో అణువు అణువు ఆలయంగా మారగా నిత్యం కొలుచుకొన అమ్మ రుణమే తీరగా తోడుండగా నను ప్రేమించే అమ్మ ప్రేమ కీడన్నదే కనిపించేనా ఎన్నడైనా. అమ్మ అంటేనే ప్రేమ, అమ్మ అంటేనే త్యాగం, అమ్మ అంటేనే దయ, అమ్మ అంటేనే నిలువెత్తు మంచితనం.. అమ్మ అంటేనే మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునే సైనికురాలు. మనం ఎక్కడ ఉన్నా ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ అమ్మ మన గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటుంది.. అలాంటి అమ్మకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం. ఆమె కడుపులో పుట్టినందుకు తనకు మంచి పేరు తీసుకువచ్చేలా నిజాయతీగా బతకడం తప్ప. ఏం చేసినా అమ్మ మనపై చూపిన ప్రేమకు సరితూగలేం. అందుకే అమ్మ దైవం కంటే ఎక్కువ. అమ్మ వున్నంత వరకూ మనం అమ్మతోనే వుంటాం. కానీ మనం వున్నంత వరకూ అమ్మ మనతో ఉండదు. అందుకే వున్నంత కాలం అమ్మను ప్రేమగా చూసుకుందాం. మనకు ఎప్పుడూ గుర్తుండిపోయే తియ్యని జ్ఞాపకం అమ్మ. *తమ పిల్లల భవిష్యత్ లోనే తమ ఆనందాన్ని అనుభవిస్తూ... వారి బంగారు భవిష్యత్ కోసం తమ జీవితాలను అంకితం చేస్తున్న మాతృముర్తులు అందరికీ...* 🌹 *హృదయపూర్వక మాతృ దినోత్సవ శుభాకాంక్షలు*🌹