ShareChat
click to see wallet page
search
*శబరిమల ధర్మశాస్త్ర ఆలయానికి ఉన్న ద్వారపాలకులు..!!* *సామాన్యంగా మనం అన్ని ఆలయాలలో గర్భగుడికి ఇరువైపుల ద్వార పాలకులు ఉండడం గమనిస్తుంటాం. దుర్గా దేవికి చండి-ముండి, విష్ణుమూర్తికి జయ-విజయ అలాగే ధర్మ శాస్త దేవునికి కూడా విఘ్నహన్త్రి మరియు శతృహన్త్రి అను ద్వారపాలకులు ఉన్నారు. వీరినే మనం శబరిమల శ్రీధర్మశాస్త్ర ఆలయంలోని గర్భగుడికి ఇరువైపులా చూస్తుంటాం. వీరు శ్రీధర్మశాస్త్ర దేవునికి ఎంతో ప్రీతి పాత్రులు. వీరు కంబలాసురుడు అనే రాక్షసునికి కామవల్లి అనే రాకుమార్తె వలన కలిగారు.* *కామవల్లి శాస్త దేవునికి మహా భక్తురాలు. ఆవిడ గర్భమందు జన్మించిన వీరిద్దరూ ప్రహ్లాదుని వలే తండ్రికి భిన్నంగా శాస్తా దేవుణ్ణి ఉపాసిస్తూ ఉండేవాళ్ళు.చివరికి తండ్రిని ఎదిరించి రాచ వైభవాన్ని సైతం త్యజించి శాస్తా దేవుని కోసం ఉపాసన చేసి స్వామి వారి కృపతో ద్వారాపాలకులుగా అయ్యారు.* *ప్రస్తుత శబరిమల ఆలయంలో ఈ మూర్తులకు 2019లో బెంగళూరు వాసి అయిన వినీత్ జైన్ అనే వర్తకుడు స్వామి వారి స్వప్న సందేశం ప్రకారం బంగారు తాపడాలు వేయించారు. #goodnight friends #శుభరాత్రి #స్వామియే శరణం అయ్యప్ప ##ayyappa #ayyappan #sabarimala #sabarimalai #ayyappaswami #ayyappadevotional #kerala #ayyappaswamy# #sabarimala
goodnight friends - ShareChat