నీ మోమును తాకి వెళ్ళే కిరణాలను అడుగు
నిన్ను చూసిన నా కళ్ళకి ఎంత వెలుగో
ప్రతిబింబించే సురీడుని అడుగు
నీ చూపు తాకిన నేను ఎంత ప్రకాశిస్తానో
నీ జ్ఞాపకాలను అడుగు
వాటిని తలుచుకుని నేనెంత ఆనందపడతానో
ఉదయించి,అస్తమించే రోజును అడుగు
నిన్ను తలవని రోజేదైనా ఉందేమో
వచ్చిపోయే వెలుగు, చీకట్లను అడుగు
నువ్వులేని నా మనసు ఎంత అంధకారమో
గడిచే సమయాన్ని అడుగు
నా గడియ ఎక్కడ ఆగి ఉన్నదో
కల్లోలమైన నా మనసును అడుగు
నువ్వే నా హృదయంలో
ఎగిసిపడే అలకి ఆనకట్టవని
కారే కన్నీరును అడుగు
ఎన్నెన్ని జ్ఞాపకాలను తలచుకొంటూ రాలుతాయో
బంధించే కౌగిలి కోసం వేచే
నా వలపు వాకిలి
మరలిరావా నేస్తం ....
నీ ప్రేమ కోసం
#❤️ లవ్❤️ #😇My Status #💘ప్రేమ కవితలు 💟 #💌 ఫీల్ మై లవ్