Amma❤️ #😇My Status
ఆకాశాన్ని అడిగితే చెప్పింది
అమ్మ ప్రేమ తనకంటే విశాలమని…
సాగరాన్ని అడిగితే చెప్పింది
అమ్మ మనసు తనకంటే లోతని…
తేనెను అడిగితే చెప్పింది
అమ్మ మమత తనకంటే తియ్యనిదని…
కోయిలను అడిగితే చెప్పింది
అమ్మ పిలుపు తన పాటకంటే మధురమని…
కొవ్వొత్తిని అడిగితే చెప్పింది
అమ్మ వెలుగు తన కరిగిపోవడానికన్నా గొప్పదని…
నేలతల్లిని అడిగితే చెప్పింది
అమ్మ త్యాగం తనకంటే కోటిరెట్లు ఎక్కవని…
అంతటితో కాదు,
ప్రపంచమంతా ఒక మాటే చెప్పింది—
అమ్మ అంటేనే ఓర్పు…
అమ్మ అంటేనే జీవితం 🙏🙏🙏