Sekhar Reddy Sudha
ShareChat
click to see wallet page
@130664665
130664665
Sekhar Reddy Sudha
@130664665
ఓం సాయిరాం🙏
మీరు నేలలో ఏమి విత్తుతారో, మీకు లభించేది మొక్క. అదే విధంగా, మీరు మీ హృదయంలో ఏమి విత్తుతారో అదే మీరు వాస్తవంలో పొందుతారు. అందుకే నేను మిమ్మల్ని ఎప్పుడూ దృఢంగా మరియు సానుకూలంగా ఉండాలని పట్టుబట్టాను. -సాయిబాబా💞 #🎶భక్తి పాటలు🔱 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🌅శుభోదయం #🙏🏼షిరిడి సాయి బాబా #🕉 ఓం సాయిరామ్😇
🎶భక్తి పాటలు🔱 - ShareChat
నన్ను ప్రాణ సమానంగా ప్రేమించే వారు నాకు కరువు. ఇట్టి వారు నాకు ఒక్కటి ఇస్తే, నేను వారికి నూరింతలు ఇస్తాను శిరిడీ సాయి బాబా బాబావారి అవతారం ప్రేమావతారం. ఇలాంటి సుందర మధుర మనోహర అవతారం ఇంతవరకూ రాలేదు, ఇక రాబోదు. సఛ్ఛరిత్ర మొత్తం అధ్యయనం చేస్తే 2,700 కు పైగా ప్రేమ అనే పదాన్ని హేమాద్రిపంత్ ప్రయోగించారు. సాయి అడుగుతున్నది, మన నుంచి కోరుతున్నది ప్రేమనే, మనం ఇవ్వలేనిది అదే. బాబా రూపం చూడండి, అతి సామాన్యంగా ఉంటుంది. చినిగిన వస్త్రాలు, తలకు ఓ రుమాలు, చేతిలో సటకా, ఓ బిక్షపాత్ర. మరి అలాంటి ఆయన దగ్గర మనం ఎంత భిక్ష మెత్తుతున్నామో కదా! ఆలోచిస్తే పొంతన కుదరదు. బాబా వేపచెట్టు క్రింద మనకోసం వెలసివ వేద వేద్యుడు. తలపైన పాగాలో అష్టసిధ్ధులు, భుజానికున్న జోలెలో అష్ట లక్ష్ములు. ఆయన మన ఆది భవ వ్యాధులను నిరంతరం ద్వారకామాయి ధునిలో వేసి నశింపచేస్తూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఒకరికి ఒకరు తోడున్నారు. నాకు అల్లాయే అల్లాహ్ అంటుంటారు. అంటే మనమంతా ఆయనపై తండ్రి వాత్సల్యం చూపిస్తారేమోననే చిన్న ఆశతో ఆయన ఎదురు చూస్తున్నారు. ఓం సాయిరాం #🎶భక్తి పాటలు🔱 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🌅శుభోదయం #🙏🏼షిరిడి సాయి బాబా #🕉 ఓం సాయిరామ్😇
🎶భక్తి పాటలు🔱 - 11 सबुरी 4C34 M 10 ` 11 सबुरी 4C34 M 10 ` - ShareChat
నమ్మిన వారిని నట్టేటముంచేవాడు కాదు ఈసాయి అని సాయి తరచుగా తన భక్తులతో అంటుండేవారు. తనను పరిపూర్ణ విశ్వాసంతో త్రికరణ శుద్ధిగా నమ్మి కొలిచిన వారిని సప్తసముద్రాల ఆవల వున్నా రక్షించే వారు శ్రీసాయి. అందుకే ఆయన సద్గురు శ్రేష్టుడు. భక్తుల పాలిటి ఆశ్రిత కల్పవృక్షం. ఒకరోజు మధ్యాహ్నం శ్రీ సాయి మశీదులో కూర్చోని భక్తులతో సద్గోష్టి చేస్తున్నారు. ఇంతలో “అబ్బా!” అని పెద్దగా కేక పెట్టారు. వెంటనే ఆయన దుస్తులన్నీ తడిసి పోయి నీరు ధారపాతంగా కారడం ప్రారంభించింది. ఇది చూస్తున్న భక్తులు ఆశ్చర్యపోయారు. అప్పుడు వర్షం కూడా లేదు, సాయి ఆ విధంగా ఎలా తడిసిపోయారో ఎవరికీ అర్ధం కాలేదు. కొద్ది సేపటికి తర్వాత శ్రీసాయి సంతృప్తిగా “హమ్మయ్య, భావూకు ఇక ఏ ప్రమాదం లేదు” అని అన్నారు. రెండు రోజుల తర్వాత తన ప్రార్ధనను విని తనను ప్రాణాలతో రక్షించి నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ టెలిగ్రాం పంపాడు జహంగిర్ అనే భక్తుడు. అప్పుడు అసలు సంగతి శ్రీ సాయి భక్తులకు చెప్పారు. రష్యా – జపాన్ యుద్ధంలో అతను ఒక యుద్ధ నౌకకు కెప్టెన్. యుద్ధంలో పాల్గొన్న మూడు నౌకలను శత్రువులు ముంచివేసారు. అతని నౌకపై కూడా శత్రువులు దాడి చేసారు. ఏ క్షణంలోనైనా ఆ నౌక కుడా మునిగి పోయేలా వుంది. నౌకాశ్రయం నుండి ఏ విధమైన సహాయం అందడం లేదు. అప్పుడు సాయి భక్తుడైన జహంగిర్ తన కేబిన్ లో తన నౌకను కాపాడమని కన్నీరు మున్నీరుగా ప్రార్ధించాడు. కరుణా సముద్రుడు, దయాళువు అయిన శ్రీ సాయి ఒక అద్భుత మైన లీలను ప్రదర్శించి అసామాన్యమైన రీతిలో ఆ నౌకను మునిగి పోకుండా కాపాడారు. ఆ నౌక కొద్ది రోజుల తర్వాత సురక్షితంగా పోర్టుకు చేరింది. తనతో పాటు వందలాది మంది ప్రాణాలను నడిసముద్రంలో కాపాడిన సమర్ధ సద్గురువు శ్రీసాయినాధులకు టెలిగ్రాం ద్వారా తమ కృతజ్ఞతలను తెలియజేసుకున్నాడు జహంగిర్. ఆర్తితో ప్రార్ధిస్తే తక్షణమే రక్షించి కాపాడే దయా సముద్రుడైన శ్రీ సాయినాధులు తన సమాధి అనంతరం నడి సముద్రంలో చేసిన మరొక అద్భుత, అపూర్వ, అసామాన్యమైన లీలను ఇప్పుడు స్మరించుకుందాం. ! 1972 వ సంవత్సరంలో మిత్రుల ప్రోద్భలంతో శిరిడీ వెళ్ళి సాయిని ప్రార్ధించాడు ప్యారేకిషన్. ఆ తర్వాత అతనికి ఎన్నో ఉద్యోగాలు వచ్చాయి. ఎందులో చేరాలో తేల్చుకోలేక సతమతమయ్యి సాయిబాబా చిత్రపటం ముందు చీట్లు వేయగా ఎం.వి. ధనలక్ష్మి అనే నౌకకు కెప్టెన్ గా చేరమని సందేశం వచ్చింది. ఆ ప్రకారంగానే ఆ ఉద్యోగంలో చేరిన ప్యారే కిషన్ నిత్యం తన నౌకను కాపాడుతుండమని బాబాను ప్రార్ధిస్తుండేవాడు. ఒకసారి ఆ నౌక కలకత్తా నుండి అండమాన్ కు బయలుదేరింది. నడి సముద్రంలో పెద్దతుఫాన్ సంభవించి నౌక నీటిలోనికి ఒరగనారంభించిం ది. ఇంజన్లు పని చెయ్యడం మానేసాయి. ఇంజనీర్లు ఎంత ప్రయత్నించినా రిపేరు చెయ్య లేకపోయారు. నౌకాశ్రయం నుండి ఎంత యత్నించినా సహాయం అందలేదు. ఇక తమ ప్రాణాలను రక్షించుకోవాలని అందరూ లైఫ్ బోట్లను తీసుకొని నీటిలోనికి దూకేసారు. ప్యారే కిషన్ లైఫ్ బోటును కూడా తీసుకోలేక తన సద్గురువును తనను కాపాడమని ఎంతో ఆర్తితో ప్రార్ధించి సముద్రంలోనికి దూకేసాడు. తిండి, నీరు లేక తీవ్రమైన అలలపై భయంకరం గా కురుస్తున్న వర్షంలొ ముప్పైగంటల పాటు కొట్టుమిట్టాడాడు. అందరికీ మరణం తప్పదనిపించింది. ఇంతలో ఒక దుంగ ప్యారే కిషన్ కు దొరికింది. దానిపైచేరి వెంటనే మూర్చ పోయాడు. మరి కొందరు కూడా దానిపై చేరారు. పదిపన్నెండు గంటలపాటు దానిపై స్పృహ తప్పి పడివుండగా ఆపద్భాంధవుడిలా జల కేంద్ర అనే మరొక నౌక అటువైపుగా వచ్చి అందరినీ రక్షించింది. ప్యారే కిషన్ ను తాళ్ళతో పైకి లాగుతున్నప్పుడు అతను మూడుసార్లు ముప్ఫైఅడుగుల వరకు వచ్చి తిరిగి సముద్రం లో పడిపోయాడు. కాని స్పృహలో వున్నంత వరకు సాయి నామస్మరణ చేస్తునే వున్నాడు. తన సద్గురువు తనను తప్పక కాపాడుతా డన్న ధృఢమైన విశ్వాసం అతనిలో వుంది. ఆఖరుగా అతనిని నౌకలోనికి లాగి అత్యవసర వైద్యమందించారు. త్వరలోనే అతను కోలు కొని సకుటుంబ సపరివారసమేతంగా శిరిడీ వెళ్ళి సాయి నాధుని దర్శనం చేసుకొని నడి సముద్రంలో తనకు ప్రాణదానం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసు కున్నాడు. భక్తి శ్రద్ధలు, విశ్వాసం వుంటే శ్రీ సాయి ఎటువంటి తీవ్రమైన ప్రతికూల పరిస్థితులలో వున్నా తన భక్తులను రక్షిస్తారని పై లీలలు మరొక్కసారి రుజువు చేస్తున్నాయి. #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా #🌅శుభోదయం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🎶భక్తి పాటలు🔱
🕉 ఓం సాయిరామ్😇 - ShareChat
మీ కన్నీళ్లు ఇతరులకు కనిపించకపోవచ్చు, కానీ మీ బాధ నాకు స్పష్టంగా కనిపిస్తుంది మరియు మీరు దాని కంటే పైకి ఎదగడానికి నేను ఇక్కడ ఉన్నానని, దృఢంగా మరియు నిజమని మీరు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మీ బలం నాది, మేము దానిని కలిసి ఎదుర్కొంటాము. సాయి యొక్క అపరిమితమైన కనికరం మరియు శ్రద్ధ మీ జీవితంలో ఆవిష్కృతమవుతూనే ఉంటుంది, ప్రతి క్షణం మీరు నిద్రపోతున్నప్పుడు కూడా మీ మంచి కోసం పని చేస్తుంది. #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా #🌅శుభోదయం #🎶భక్తి పాటలు🔱 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి
🕉 ఓం సాయిరామ్😇 - ShareChat
నా భక్తులు ఏ తీవ్రతతో, అభిరుచితో మరియు భక్తితో నన్ను ప్రార్థిస్తారో , అదే తీవ్రతతో నేను ప్రతిస్పందిస్తాను మరియు ప్రతిస్పందిస్తాను. రోజులు గడిచేకొద్దీ, ప్రకాశవంతమైన రేపటి కోసం ఎదురుచూస్తోందని తెలుసుకోండి... ప్రతి ఉదయం, నా భక్తుడు ఈ రోజు చేసే ప్రయత్నాలు మెరుగైన జీవితాన్ని ఇస్తాయని ఆశాభావంతో కొత్తగా ప్రారంభిస్తాడు. రోజు ముగిసినప్పుడు మరియు సవాళ్లు మిగిలి ఉన్నప్పుడు, సహనం శక్తివంతమైన మిత్రుడు అని గుర్తుంచుకోండి. నా బిడ్డలు మీ కష్టాలన్నీ ఆగిపోయే ఉదయం వస్తుందని మరియు మీరు ఆనందంతో నిండిపోతారని నమ్మండి. మీ. సాయిబాబా 🙏❤️ #🙏🏼షిరిడి సాయి బాబా #🕉 ఓం సాయిరామ్😇
🙏🏼షిరిడి సాయి బాబా - ShareChat
బాబాతో అనుబంధం పెంచుకోవాలంటే ఆయన చేసిన పనులు తెలుసుకోవాలి. అవి ఆయన చరిత్ర చదివితే తెలుస్తాయి. ఆయన తత్వం అర్థం చేసుకోవడానికి, ఆయన ఎలాంటి వారు? మనను ఉద్ధరిస్తారా, లేదా అన్న పద్ధతిలో చరిత్రను విశ్లేషణాత్మకంగా చదవాలి. బాబాలో వ్యక్తమయ్యే తత్త్వం ఏమిటి? ఏం చెప్పారాయన ఒక లీల జరిగినపుడు ఆ భక్తుని స్థానంలో నేనుంటే ఎలా ఫీల్ అవుతాను? ఇలా ప్రతి విషయం గురించి తరచి చూసుకుంటూ, ఒక్క లీల చదివినా చాలు! నిజానికి ఆ యింట్రస్ట్ వుంటే ఒక్క లీలతో ఆపము. నవల చదివినట్లుగా బాబా చరిత్ర చదువుగల్గుతాము. అలా బాబా చరిత్ర అవగాహనతో చదవడం వలన ఆనందం, తృప్తి కలుగుతాయి #🙏🏼షిరిడి సాయి బాబా #🕉 ఓం సాయిరామ్😇
🙏🏼షిరిడి సాయి బాబా - Oqnr ouo 191 Oqnr ouo 191 - ShareChat
నా లీల అనుభవం చదవండి మీరు అన్ని సమస్యల నుండి విముక్తి పొందుతారు నా మాటలను నమ్మండి.చింతించకు. నేను ఎల్లప్పుడూ మీ కన్నీళ్ల గురించి తెలుసుకుంటారు, ఎల్లప్పుడూ మీ ప్రార్థనలకు శ్రద్ధ వహిస్తారు మరియు మీ బాధలకు ఎల్లప్పుడూ స్పందిస్తారు. నేను చూస్తాడు. నేను వింటాడు మరియు నేను మిమ్మల్ని రక్షిస్తాడు.మీ సాయిబాబా 🙏❤️ #🎶భక్తి పాటలు🔱 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🌅శుభోదయం #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా
🎶భక్తి పాటలు🔱 - @anchor_akshay_offidia 23ed @anchor_akshay_offidia 23ed - ShareChat
పిలిస్తే పలికే దైవం శ్రీ షిర్డీ సాయబాబా మీకున్న సిరిసంపదలు గానీ,భోగ భాగ్యాలు కానీ ఏవీ సాయినాధునికి సమర్పించనవసరం లేదు భక్తితో శ్రద్ద -సబూరి విశ్వాసంతో కూడిన ఓర్పు అను రెండు నియమాలు పాటించి బాబా పవిత్ర చరణాల వద్ద శరణాగతి చెందడమే సరైన మార్గం సాయి తత్వానికి మీ జీవితాలు పంచుకోండి మీ మనసు నిండా ,తనువు నిండా ,ఆణువణువూ సాయినామం జపం జరుగుచున్నప్పుడు ,మీకు ఏ సిరిసంపదలు ఇవ్వలేని ఆనందాన్ని ఏ బంధాలు ఇవ్వలేని అనుబంధాన్ని మనశాంతిని ఆ దేవదేవుఁడు మీకుమనకుఅనుగ్రహిస్తాడు దైవ భక్తిని ,పాప భీతిని అలవర్చుకోండి నిరంతరం భక్తితో సాయినామాన్నీ జపించండి #🎶భక్తి పాటలు🔱 #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🌅శుభోదయం #🕉 ఓం సాయిరామ్😇 #🙏🏼షిరిడి సాయి బాబా
🎶భక్తి పాటలు🔱 - ShareChat
నేను నా భక్తులకు సరైన మార్గాన్ని చూపించడానికి వచ్చాను మరియు ఆ మార్గంలో నడిచిన తర్వాత, నా భక్తులు అత్యున్నత స్థాయికి చేరుకుంటారు దృఢంగా ఉండండి .నేనే మీ బలం.మీరు ఏం చేస్తున్నావో నేను చూస్తున్నాను మరియు దాని ద్వారా నేను మిమ్మల్ని తీసుకువస్తాను.నన్ను నమ్మండి.నేను ఇంతకు ముందు మిమ్మల్ని విడిచిపెట్టలేదు మరియు ఇప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళను.మంచి రోజులు రానున్నాయి.మీ సాయిబాబా 🙏❤️ #🙏🏼షిరిడి సాయి బాబా #🕉 ఓం సాయిరామ్😇 #🌅శుభోదయం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🎶భక్తి పాటలు🔱
🙏🏼షిరిడి సాయి బాబా - ShareChat
నేడు షిరిడీలో ద్వారకామాయిలో ధుని ఎదురుగా దర్శనమిస్తున్న బాబా ఆసీనుడైయున్న చిత్రపటం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొన్నది. ప్రతీ సాయిభక్తుల గృహాలలోను కొన్ని సాయిమందిరాలలోను ఈ చిత్రపటం దర్శనమిస్తుంది ఈ పటాన్ని రూపుదిద్దినవాడు ఆ రోజులలో ఎంతో ప్రఖ్యాతిగాంచిన చిత్రకారుడు అయిన శ్యామరావు జయకర్ . సుమారు 1916 సం ప్రాంతంలో జయకర్ తన భార్యా ,పిల్లతో సహా సాయి దర్శనానికి షిర్డీ వచ్చాడు జయకర్ బాబా చిత్రాన్ని గీయటానికి అనుమతించమని బాబాను ప్రార్దించాడు . అది విన్న బాబా.. "అరే ! పిచ్చి బిచ్చగాడిని నా చిత్రం గీసుకొని ఏమి చేసుకొంటావు?" అన్నారు చివరికి బాబా తన చిత్రపటం గీయడానికి ఒప్పుకొన్నారు . సాయి ప్రేరణతో జయకర్ గీసిన చిత్రం ద్వారకమాయిలో ఇప్పటికీ షిరిడీలో కొలువై ఉంది. జయకర్ గీసిన చిత్రం సాయిసచ్చరిత్ర తోనూ బాలాజీ వసంత్ తాలిమ్ మలచిన సమాధిమందిరంలో ఉన్న సాయిబాబా విగ్రహమూర్తితో పోల్చవచ్చును. సాయిసన్నిధిలో ఉండే భక్తులకు కూడా, కష్టాలు తప్పవు. జయకర్ షిరిడీలో సాయిసన్నిధిలో ఉండే సమయములో , మసూచి వ్యాధితో జయకర్ పెద్ద కుమారుడైన రఘునందన్ మరణించాడు . శ్యామరావు జయకర్ భార్యా ఎంతో దుఃఖంతో , బాబా ముందు తన బాధను వినిపించింది. బాబా ఆమెను ఓదారుస్తూ విధి బలీయమని చెప్పగానే ఆమె కొంత శాంతించింది .కానీ బాబా భక్తుల దుఃఖాన్ని చూస్తూ ఉరుకోలేడు గదా! ఆమె దుఃఖం బాబాను చలింపచేసింది .బాబా జయకర్ భార్యతో "దిగులు చెందకు !నీ చనిపోయిన బిడ్డ మరల నీ కడుపున పుడతాడు. బాబా వాక్కు బ్రహ్మ వాక్కు .అది కేవలం ఊరడింపు. మాట కాదు అది సత్యమే అయి తీరుతుంది. విధిని కూడా ఎదిరించగల శక్తి బాబాకు వుంది. బాబా అన్నట్లుగానే జయకర్ దంపతులకు బాబా మహా సమాధి అనంతరం 1920 సం లో ఒక బిడ్డ జన్మించాడు . ఆ బిడ్డకు ఆ దంపతులు " రామ్ " అని పేరు పెట్టారు . సాయిబాబా మన కర్మానుసారం తీసివేసినా.. మరొక చేతితో ఇవ్వగల సమర్థ సద్గురువు. దానికి ఆయనయందు మనకు అచంచల విశ్వాసం ఓర్పు ఎంతో అవసరం. #🙏🏼షిరిడి సాయి బాబా #🕉 ఓం సాయిరామ్😇 #🌅శుభోదయం #🙏శ్రీ వెంకటేశ్వర స్వామి #🎶భక్తి పాటలు🔱
🙏🏼షిరిడి సాయి బాబా - 97 /4 ٤٩٤ 170r 97 /4 ٤٩٤ 170r - ShareChat