Satya Vadapalli
ShareChat
click to see wallet page
@13077355
13077355
Satya Vadapalli
@13077355
🌹💖I sustain myself with the love of family 🌹💝
#👋విషెస్ స్టేటస్ #🌅శుభోదయం #ఓం శ్రీ మాత్రే నమః #మహాలక్ష్మి అమ్మవారు #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్
👋విషెస్ స్టేటస్ - త్రేనమః శ్రీమా &0 % శుభోదయం శుభ శుక్రవారం త్రేనమః శ్రీమా &0 % శుభోదయం శుభ శుక్రవారం - ShareChat
#🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #మహాలక్ష్మి అమ్మవారు #ఓం శ్రీ మాత్రే నమః #🌅శుభోదయం #👋విషెస్ స్టేటస్
🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ - మహాలక్ష్మి దీవెనలతో శుభ శుక్రవారం ఉషోదయ శుభాకాంక్షలు మహాలక్ష్మి దీవెనలతో శుభ శుక్రవారం ఉషోదయ శుభాకాంక్షలు - ShareChat
#🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #ఓం శ్రీ మాత్రే నమః #🌅శుభోదయం #🙏🏻అమ్మ భవాని #కనకదుర్గ అమ్మవారు#
🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ - శుభోదయం {ನುಕಕ್ರರಿ" (రాజ్యం ద్రేహిశ్రియంద్రేహి బలం దేహి ಏಟ್ಯಂ క్ీర్తి దేహి ధనం ద్రేహి యశో చద్రేహి వై శుభోదయం {ನುಕಕ್ರರಿ" (రాజ్యం ద్రేహిశ్రియంద్రేహి బలం దేహి ಏಟ್ಯಂ క్ీర్తి దేహి ధనం ద్రేహి యశో చద్రేహి వై - ShareChat
శ్రీ_మహాలక్ష్మీ_కటాక్షం మహాలక్ష్మి కృపవల్ల ఇల్లు సంపన్మయంగా ఉండాలని వేదకాంక్ష.... అభూతి, అసమృద్ధి -ఈరెండూ అలక్ష్మీ స్వరూపాలు. ఐశ్వర్యము లేకపోవుట, ఉన్నది తగినంతగా చాలకపోవుట, ఇవే అభూతి, అసమృద్ధి. ఈ అలక్ష్మీభావాలు ఉండరాదు. లక్ష్మి ఇంట్లోనూ, ఒంట్లోనూ కూడా ప్రవేశించాలి. ఉత్సాహమూ, ఉల్లాసమూ, చైతన్యమూ, ఔదార్యమూ ఇవన్నీ మానసిక లక్ష్మీ గుణాలు. చిరునవ్వు, ఆరోగ్యం, సోమరితనం లేకపోవుట ఇవి దైహికంగా లక్ష్మీప్రసాదాలు. ఇంట్లో కలహాలు లేకపోవుట. పరివారంలో ప్రేమపూర్వక అనుబంధం, సంపదకు కొదవలేకపోవడం, విజయం, సంతృప్తి ఇవి లక్ష్మీ అనుగ్రహ స్వరూపాలు. వీటికి విరుద్ధమైనవి అలక్ష్మీ(జ్యేష్ఠా)స్వరూపాలుగా చెప్తారు. నిజానికి ’సంస్కారపులేమి’నే ’అలక్ష్మి’ అనాలి. మనిషికి ముందు ఉండేది సంస్కారరాహిత్యం. అదే జ్యేష్ఠం. (ఈపదం అర్థం నక్షత్రాదులకు వర్తించదు) అంటే ’ముందు ఉండేది’, ’పెద్దది’ అని అర్థం. ముందు ఉండేది అజ్ఞానమూ, సంస్కారరాహిత్యము. అదే నిజమైన అలక్ష్మి. దానిని మనం సంస్కారం ద్వారా, వివేకంద్వారా, సత్ప్రవర్తన ద్వారా సవరించుకుంటాం. అప్పుడు లభించేదే లక్ష్మి. అందుకే లక్ష్మి ’తరువాతది’ అని చెప్పబడుతోంది. సంస్కారం వల్ల ఉత్పన్నమయ్యే పవిత్రత లక్ష్మి సంస్కార పూర్వముండే అవకారాలు, వికారాలు అనైశ్వర్యమూ, అసమృద్ధి. ’గృహం’ అంటే మనముండే ఇల్లు. అయితే శరీరం మన ఆత్మకి ఇల్లు. ఇంటివలే ఒంటినీ ఐశ్వర్యమయం చేసుకోవాలి. అంటే నగానట్రాతో అలంకరించుకోవడం కాదు. సంస్కరించుకోవడం. ఇంటిని సంస్కరించుకొనే విధానాలు మన శాస్త్రంలో చెప్పబడాయి. సత్యం, శీలం. అహింస, నిత్యానుష్ఠానం, శుచి - అనేవే వ్యక్తి సంస్కారాలు. ఇంటిని, పరిసరాలనీ శుభ్రంగా ఉంచుకోవడం, దేవీపూజ, దీపారాధన, అన్నశుద్ధి, పాక(వండడంలో) శుద్ధి, ఆచారశుద్ధి - ఇవన్నీ గృహ సంస్కారాలు. ఈరెండు సంస్కారాల వల్ల గలిగే శోభ, సౌందర్యం "లక్ష్మీదేవత" గా అభివర్ణింపబడ్డాయి. మన ఆచార సంప్రదాయాలన్నీ మనలనీ, మన గృహాలనీ లక్ష్మీ నివాసంగా మలచడానికి నిర్దేశింపబడినవే. వాటిని మనం కోల్పోయి అలక్ష్మిని ఆవహింపజేసుకుంటున్నాం. అనాచారము, అశౌచము, గృహాన్ని అలక్ష్మీనిలయంగా మార్చుతాయి. ఉదయాన్నే శుభ్రంచేయనిదీ, ముంగిట ముగ్గులేనిదీ, దీపం వెలగనిదీ,శుచియైన పాకం లేనిదీ- అయిన ఇంటిని అలక్ష్మి తన పీఠంగా చేసుకుంటుందని పెద్దలు చెప్తారు. అలక్ష్మి కి మరొక పెద్ద ఆహ్వానం - కలహం. "అలక్ష్మీ కలహాధారా" అన్నారు. ’కలహం" అంటే ఒకరిట్ల ఒకరికి ద్వేషభావం ఏర్పడడం. ద్వేషం ఉన్నచోట శోభ ఉండదు. ఐశ్వర్యమూ నిలువదు. కనుక ఇంటిలో కలహానికి ఆస్కారం లేకుండా జాగ్రత్తపడాలి. *సత్యేన శౌచసత్యాభ్యాం తథాశీలాదిభిర్గుణైః!* *త్యజ్యంతే యే నరాః సద్యః సంత్యక్తా యే త్వయామలే!!* సత్యమూ, శౌచమూ, శీలమూ మొదలైన గుణాలను విడిచిపెట్టిన వారిని లక్ష్మి వెంటనే విడిచిపెడుతుందని విష్ణుపురాణ వచనం. #🌅శుభోదయం #🙏🏻భక్తి సమాచారం😲 #ఓం శ్రీ మాత్రే నమః #🙏🏻శుక్రవారం భక్తి స్పెషల్ #మహాలక్ష్మి అమ్మవారు
🌅శుభోదయం - ShareChat
#🌅శుభోదయం #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🕉️ ఓం శ్రీ సాయిరాం 🙏 #ఓం సాయిరాం #🙏🏻షిరిడి సాయిబాబా
🌅శుభోదయం - శ్రీహైమ 3 ఆశీస్సులు మీపై & 9 2020 @00 శ్రీహైమ కుటుంబం పై ఎల్లప్పుడు ఉందాలని ತಿ3ನ శీహిమ మనసారా కోరుకుంటూ గురువొరం శుధోదయ నమస్సుమాంజలి శ్రీహైమ 3 ఆశీస్సులు మీపై & 9 2020 @00 శ్రీహైమ కుటుంబం పై ఎల్లప్పుడు ఉందాలని ತಿ3ನ శీహిమ మనసారా కోరుకుంటూ గురువొరం శుధోదయ నమస్సుమాంజలి - ShareChat
#🙏🏻షిరిడి సాయిబాబా #ఓం సాయిరాం #🕉️ ఓం శ్రీ సాయిరాం 🙏 #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🌅శుభోదయం
🙏🏻షిరిడి సాయిబాబా - శ్రీసీాయినాధాయనమః [ఆశీస్సులు సదా మీపై ఉండి బాబా 83|7 : మీకు అంతా మంచే జరగాలని ೧೦jo cred కోరుకుంటూమ ஐஜி கபபீபடு శుభిగులివారి శ్రీసీాయినాధాయనమః [ఆశీస్సులు సదా మీపై ఉండి బాబా 83|7 : మీకు అంతా మంచే జరగాలని ೧೦jo cred కోరుకుంటూమ ஐஜி கபபீபடு శుభిగులివారి - ShareChat
#🌅శుభోదయం #🙏🏻గురువారం భక్తి స్పెషల్ #🕉️ ఓం శ్రీ సాయిరాం 🙏 #ఓం సాయిరాం #🙏🏻షిరిడి సాయిబాబా
🌅శుభోదయం - న్వ్ {96 ఉన్న సంపూర్ణముగా భూమండలమంతా వ్యాప్తమై 83 భగవంతుడిని ఏపదము దర్ింప జేస్తుందో: வ అటువంటి తత్వాన్ని బోధించు చున్న గురువులకు నమస్కారములతో శుభాక్ష్ాంక్షలు న్వ్ {96 ఉన్న సంపూర్ణముగా భూమండలమంతా వ్యాప్తమై 83 భగవంతుడిని ఏపదము దర్ింప జేస్తుందో: வ అటువంటి తత్వాన్ని బోధించు చున్న గురువులకు నమస్కారములతో శుభాక్ష్ాంక్షలు - ShareChat
సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఎవరైతే స్కందోత్పత్తి చదువుతారో వారి పిల్లలు ఆపదల నుంచి రక్షింపబడతారు.... రామాయణాంతర్గత స్కందోత్పత్తి పరమేశ్వరుడు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు ఋషులతో గూడి, సేనాపతిని కోరుకొనుచు బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి. ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకొని, బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, ఆయనతో ఇట్లు విన్నవించుకొనిరి. “ఓదేవా! పూర్వము మీరు పరమేశ్వరుని మాకు సేనాపతిగా నియమించియుంటిరి. ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో గూడి హిమవత్పర్వతమున తపమొనరించుచున్నాడు. కర్తవ్య విధానము నెరిగిన ఓ బ్రహ్మదేవా! ఈ (సెనాపతి) విషయమున లోకహితమును గోరి అనంతర కార్యమును గూర్చి ఆలోచిమ్పుడు. ఇప్పుడు మాకు మీరే దిక్కు”. దేవతల ప్రార్థనను ఆలకించి, సరలోక సృష్టికర్తయైన బ్రహ్మదేవుడు మృదుమధుర వచనములతో వారిని ఓదార్చుచు ఇట్లు పలికెను. “పార్వతీదేవి శాప కారణముగా మీకు మీ పత్నులయందు సంతానము కలుగు అవకాశము లేదు. ఆమె వచనము తిరుగులేనిది. ఇది ముమ్మాటికిని సత్యము. ఇందు సందేహము లేదు. ఆకాశమున ప్రవహించు ఈ గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు. అతడు దేవసేనాపతియై, శత్రు సంహారకుడు కాగలడు. హిమవంతుని పెద్ద కూతురైన గంగ ఆ అగ్నిసుతుని (శివ తేజః ప్రభావమున అగ్నివలన తనయందు జనించిన సుతుని) ఆదరింప గలదు. అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతిపాత్రుడగును. ఇందు సంశయము లేదు”. ఓ రఘునందనా! బ్రహ్మదేవుడు పలికిన ఆ మాటలకు దేవతలందరును సంతసించి, తాము కృతార్థులైనట్లు భావించిరి. అనంతరము వారు బ్రహ్మదేవునకు ప్రణమిల్లి, పూజించిరి. అంతట ఆ దేవతలందరునూ గైరికాదిధాతువులతో విలసిల్లుచున్న కైలాసపర్వతమునకు చేరి, పుత్రోత్పత్తికై అగ్నిదేవుని నియమించిరి. శివతెజమును భరించిన ఓ అగ్నిదేవా! ఈ దేవకార్యమును నెరవేర్పుము. శైలపుత్రికయైన గంగయందు ఆ శివ తేజస్సును ఉంచుము’ అని దేవతలు పలికిరి. అగ్నిదేవుడు దేవతలతో ‘అట్లే’అని పలికి, గంగాదేవి కడకు వెళ్ళి “ఓ దేవీ! గర్భమును ధరింపుము. ఇది దేవతలకు హితమొనర్చు కార్యము” అని నుడివెను. అప్పుడు గంగ ఆయన మాటలను విని దివ్యమైన స్త్రీ రూపమును ధరించెను. అగ్ని ఆమె సౌందర్యాతిశయమును జూచి, శివతేజమును ఆమెయందంతటను వ్యాపింపజేసెను. ఓ రఘునందనా! అగ్ని ఆమెపై వ్యాపింపజేసిన శివతేజముతో గంగా ప్రవాహములన్నియును నిండిపోయెను. ఆ అగ్ని తేజస్సుయొక్క తాపమునకు తట్టుకొనలేక గంగాదేవి సర్వ దేవతలకును పురోహితుడైన అగ్నిదేవునితో “క్షణక్షణమునాకును బలీయమగుచున్న నీ తేజస్సును ధరింపలేకయున్నాను” అని పలికెను. సర్వదేవతల కొరకై సమర్పించెడి ఆహుతులను స్వీకరించునట్టి అగ్నిదేవుడు గంగతో “ఓ దేవీ! ఈ శ్వేత పర్వతప్రదేశమున నీ గర్భమును ఉంచుము’ అని యనెను. మహా తేజస్వివైన ఓ పుణ్యపురుషా! రామా! గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి, మిక్కిలి తేజోరాశియైన ఆ గర్భమును తన ప్రవాహములనుండి అచట వదలెను. గంగానది గర్భమునుండి వెడలిన తేజస్సు మేలిమి బంగారము వలె కాంతిమంతమై యుండెను. కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు, అచటి వస్తువులన్నియును సువర్ణమయములాయెను. ఆ పరిసరములన్నియును రజిత మయములై నిరుపమానమైన కాంతితో వెలుగొందెను. ఆ తేజస్సు యొక్క తీక్ష్ణత్వము వలన రాగి ఇనుము పుట్టెను. ఆ రేతస్సు యొక్క మలము తగరము, సీసము ఆయెను. ఈవిధంగా ఆ తేజస్సు భూమిని జేరి, వివిధ ధాతువులుగా రూపొందెను. ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజః ప్రభావముచే ఆశ్వేతపర్వతమూ, అందలి శరవణమూ(రెల్లుగడ్డి) సువర్ణమయములై తేజరిల్లసాగెను. పురుష శ్రేష్ఠుడైన ఓ రాఘవా! అగ్నితో సమానమైన కాంతి గల ఆ బంగారము అప్పటినుండియు ‘జాతరూపము’ అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. అచటి తృణములు, వృక్షములు, లతలు, పొదలు మొదలగునవి అన్నియును స్వర్ణమయములాయెను. తదనంతరము అచట జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై, ఇంద్రుడు, మరుద్గణములు మొదలగు దేవతలు ఆరుమంది కృత్తికలను నియోగించిరి. “ఈబాలుడు మా అందరి యొక్క పుత్రుడగును” అని ఆ కృత్తికలు దేవతలతో ఒప్పందము చేసుకొనిరి. పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువునకు పాలియ్యసాగిరి. అంత దేవతలందరును “ఈ బాలకుడు కార్తికేయుడు అను పేరుతో ముల్లోకముల యందును ఖ్యాతికెక్కును. ఇందు సంశయము లేదు” అని పలికిరి. గంగాద్వారా అచటికి చేరిన శివతేజస్సు యొక్క ప్రభావమున పుట్టిన ఆ బాలుడు అగ్నివలె వెలుగొందుచుండెను. దేవతలా మాటలను విని, వారి ఆదేశమును అనుసరించి, కృత్తికలు ఆ బాలకునకు స్నానము చేయించిరి. ఓ కాకుత్స్థా! గంగాదేవి గర్భమునుండి స్ఖలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై, కారణజన్ముడైన ఆ మహానుభావుని ‘స్కందుడు’ అని పిలువసాగిరి. కృత్తికల పోషణ వలన అతనికి ‘కార్తికేయుడు’ అనియు పేరు ఏర్పడెను. అప్పుడు ఆ ఆరుగురు కృత్తికల స్తనములలో సమృద్ధిగా పాలు ఏర్పడెను. ఆరు ముఖములు గలవాడై ఆ బాలుడు ఆ ఆరుగురి నుండి స్తన్యములను గ్రోలెను. సుకుమార శరీరుడైనను ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారినుండి పాలుద్రాగి, మహిమాన్వితుడై అతడు తన పరాక్రమము చేత రాక్షస సైన్యములను జయించెను. దేవతలు అగ్నిదేవుని నాయకత్వమున సాటిలేని తేజస్వియైన ఆ బాలుని కడకు చేరి, అతనిని ‘దేవసేనాపతి’గా అభిషేకించిరి. పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు. కుమారస్వామి పై భక్తిగల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పుత్రపౌత్రులతో వర్ధిల్లును. తుదకు స్కంద సాలోక్య ఫలమును గూడ పొందును. #🙏🏻భక్తి సమాచారం😲 #🙏సుబ్రహ్మణ్య స్వామి #🕉️ ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి 🔯 #🙏🔱సుబ్రహ్మణ్య షష్టి శుభాకాంక్షలు #శ్రీ సుబ్రహ్మణ్య షష్టి శుభాకాంక్షలు 🙏#
🙏🏻భక్తి సమాచారం😲 - ShareChat
#🌅శుభోదయం #అట్లతద్ది శుభాకాంక్షలు #👋విషెస్ స్టేటస్ #అట్లతద్ది
🌅శుభోదయం - మీకు మీకుటుంబ సభ్యులకు గౌరిమాత అట్లతద్డి ఆశిస్సులతో శుభొకాంక్షలు మీకు మీకుటుంబ సభ్యులకు గౌరిమాత అట్లతద్డి ఆశిస్సులతో శుభొకాంక్షలు - ShareChat
శివాష్టోత్తర శతనామము అభివృద్ధి లోనికి వచ్చేఏ కోరిక అయినా, ధర్మబద్ధము అయి చాలా తొందరగా తీరాలి అనుకొంటే ఒకసారి శివాష్టోత్తరము చదువుకొని బయలు దేరాలి అని పెద్దలు చెపుతారు. శివాష్టోత్తర శతనామము చదివేటప్పుడు ముందుగా ధ్యానశ్లోకమును ధ్యానము చేయాలి. ధ్యానమ్ ధవళ వపుష మిందోర్మండలేసన్నివిష్ఠం భుజగవలయహారం, భస్మదిగ్ధాంగమీశం I మృగయపరశుపాణిం, చారుచంద్రార్ధ మౌళిం హృదయకమలమధ్యే, సంతతం చింతయామి II శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః || ౧ || శంకరశ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః శిపివిష్టోంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః || ౨ || భవశ్శర్వస్త్రిలోకేశశ్శితికంఠశ్శివప్రియః ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః || ౩ || గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః || ౪ || కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహః || ౫ || సామప్రియస్స్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరః సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః || ౬ || హవిర్యజ్ఞమయస్సోమః పంచవక్త్రస్సదాశివః విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః || ౭ || హిరణ్యరేతః దుర్ధర్షః గిరీశో గిరిశోనఘః భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః || ౮ || కృత్తివాసః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః మృత్యుంజయస్సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః || ౯ || వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః రుద్రో భూతపతిః స్థాణురహిర్భుధ్నో దిగంబరః || ౧౦ || అష్టమూర్తిరనేకాత్మా సాత్త్వికశ్శుద్ధవిగ్రహః శాశ్వతః ఖండపరశురజః పాశవిమోచకః || ౧౧ || మృడః పశుపతిర్దేవో మహాదేవోzవ్యయో హరిః భగనేత్రభిదవ్యక్తో దక్షాధ్వరహరో హరః || ౧౨ || పూషదంతభిదవ్యగ్రో సహస్రాక్షస్సహస్రపాత్ అపవర్గప్రదోzనంతస్తారకః పరమేశ్వరః || ౧౩ || ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరంశతమ్ || ఇతి శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రమ్ #🌅శుభోదయం #🙏🏻భక్తి సమాచారం😲 #😇శివ లీలలు✨ #🙏🏻సోమవారం భక్తి స్పెషల్ #🙏ఓం నమః శివాయ🙏ૐ
🌅శుభోదయం - ShareChat