నేడు జనవరి 12 ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి తల్లి... రాజమాత జిజియాబాయి గారి జయంతి...❤
భారతదేశం వీరమాతలకు పేరెన్నికగన్నది. అటువంటివారిలో ఛత్రపతి శివాజీ మాతృమూర్తి , వీరమాత జిజియాబాయి అగ్రగణ్యులు. మరాఠా యోధుల కుటుంబంలో జన్మించిన ఆమె హిందూ ధర్మ పరిరక్షణకు , హిందు స్వరాజ్య స్థాపనకు యువ శివాజీని ప్రోత్సహించి, ఆ విధంగా 200 సంవత్సరాలపాటు వెలుగొందిన మరాఠా సామ్రాజ్యానికి రాజమాత అయ్యారు.
జిజియాబాయి 1598వ సంవత్సరం, జనవరి 12 నేటి మహారాష్ట్రలోని బుల్ధాన జిల్లాలోని సింద్ ఖేడ్ ప్రాంతంలో జన్మించారు. #🇮🇳 మన దేశ సంస్కృతి #⛳భారతీయ సంస్కృతి