నాలుక కత్తిరించి.. రోకలిబండతో కొట్టి భార్య హత్య
TG: భార్యపై అనుమానంతో భర్త దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన కామారెడ్డి(D) పెద్దకొడప్లల్(M) విఠల్వాడీతండాలో గురువారం రాత్రి జరిగింది. తండాకు చెందిన పవార్ కిషన్, సవిత(42) భార్యభర్తలు కాగా HYD లింగంపల్లి ప్రాంతంలో టీకొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. తండాలో గుడి పండగ ఉండటంతో ఐదు రోజుల క్రితం గ్రామానికి వచ్చారు. కొద్దిరోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్న కిషన్ గురువారం రాత్రి ఆమెతో గొడవపడి కత్తెరతో నాలుక కత్తిరించాడు. అనంతరం రోకలిబండతో తలపై కొట్టాడు. స్థానికులు సవితను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఆమె మృతి చెందారు. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 25th అప్‌డేట్స్💬
చిల్లర నాణేలతో కూతురికి స్కూటర్ కొన్న రైతు.. వీడియో
ఛత్తీస్గఢ్లోని జాష్పూర్ జిల్లాకు చెందిన రైతు బజరంగ్ రామ్ భగత్ తన కూతురికి దీపావళి కానుకగా లక్ష రూపాయల విలువైన స్కూటర్ను కొనిచ్చారు. ఈ కలను నెరవేర్చుకోవడానికి ఆయన గత 6 నెలలుగా కష్టపడి డబ్బు ఆదా చేశారు. షోరూమ్కు వెళ్లి దాదాపు 40,000 రూపాయలను నాణేల రూపంలో చెల్లించడంతో అక్కడి సిబ్బంది ఆశ్చర్యపోయారు. షోరూమ్ యజమాని, సిబ్బంది ఓపికగా నాణేలను లెక్కించి, రైతుకు స్కూటర్ను అందజేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. #🗞️అక్టోబర్ 25th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
మెహసానాలో ఆకట్టుకున్న వైమానిక విన్యాసాలు (వీడియో)
గుజరాత్లోని మెహసానాలో భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఎయిరోబాటిక్ టీమ్ (SKAT) నిర్వహించిన గగనతల విన్యాసాలు వేలాది మందిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. తొమ్మిది హాక్ ఎంకే 132 జెట్లు చేసిన సాహసోపేతమైన విన్యాసాలు, సమన్వయంతో అతి దగ్గరగా దూసుకెళ్తూ ఆకాశంలో రింగులు తిరగడం, త్రివర్ణ పొగలు వదలడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో గుజరాత్ మంత్రి రుషికేశ్ పటేల్, పార్లమెంట్ సభ్యుడు హరి పటేల్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 25th అప్‌డేట్స్💬
మహబూబ్ నగర్ జిల్లాకు ఎల్లో అలర్ట్.. భారీ వర్షాల హెచ్చరిక!
తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం, రేపు కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం ఉదయం 8.30 గంటల లోపు వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపింది. మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున, ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. #🗞️అక్టోబర్ 25th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
ఒక్క 2025 సంవత్సరంలోనే బంగారం ధరలు సుమారు 67 శాతానికి పైగా పెరిగాయి. ప్రస్తుతం అక్టోబర్ 21 నాటికి బంగారం ధర ఆల్ టై హయ్యెస్ట్ కు చేరుకుంది. 10 గ్రాముల బంగారం ధర రూ.1,32,850 ఉంది. బంగారం ధరల్లో ఈ పెరుగుదల స్టాక్ మార్కెట్లను కూడా అధిగమించింది. ఈ పెరుగుదలను బట్టి చూస్తుంటే 2030 నాటికి బంగారం ధరలు 10 గ్రాములకు రూ.3 లక్షలకు చేరుకుంటుందా అన్న అనుమానం కలుగుతోంది. #🆕Current అప్‌డేట్స్📢 #🗞️అక్టోబర్ 25th అప్‌డేట్స్💬
బాలికపై సామూహిక అత్యాచారం
కర్ణాటకలోని హనగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఉదయ్ కరియన్నవర, తన స్నేహితులు కిషన్ వడ్డర్, ఆకాష్ మంతగి, చంద్రు గొల్లర కలిసి బాలికపై అత్యాచారం చేసినట్లు తెలిసింది. మార్చిలో ఉదయ్ బాలికను ప్రలోభపెట్టి లైంగిక వేధింపులకు గురి చేసి ఏప్రిల్లో స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భవతి కావడంతో విషయం బయటపడింది. #🗞️అక్టోబర్ 25th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢
నాగుల చవితి.. పెళ్లి కానివారు ఇలా చేస్తే!
ఈ ఏడాది నాగుల చవితి అక్టోబర్ 25 (శనివారం)న వచ్చింది. పెళ్లికాని యువతీయువకులకు నాగుల చవితి వివాహ యోగం కల్పిస్తుందని పండితులు సూచిస్తున్నారు. ఈ శుభ దినాన నాగ దేవతను ఆరాధించి, పుట్టలో పాలు పోయాలని చెబుతున్నారు. దీని ద్వారా జాతకంలోని రాహుకేతువుల దుష్ప్రభావాలు తగ్గుతాయని అంటున్నారు. అలాగే వివాహ జీవితానికి ఆటంకం కలిగించే కుజ, కాల సర్ప దోషాలు తొలగి.. నాగ దేవత ఆశీర్వాదంతో మీకు తగిన జీవిత భాగస్వామి లైఫ్లో వస్తుందని పేర్కొంటున్నారు. #🗞️అక్టోబర్ 24th అప్‌డేట్స్💬 #🆕Current అప్‌డేట్స్📢










