ఒక గురువు తరగతి గదిలోకి ప్రవేశించాడు. ఆయన కూర్చోవాల్సిన కుర్చీ పైకప్పుకి తగిలించబడి ఉంది.
విద్యార్థులవైపు చూసి చిరునవ్వు నవ్వాడు.
ఏమీ మాట్లాడకుండా బ్లాక్‌బోర్డ్ దగ్గరికి వెళ్లి ఇలా వ్రాశాడు:
పరీక్ష – 15 నిమిషాలు, 30 మార్కులు
ప్రశ్న 1: కుర్చీ నేల నుండి ఎన్ని సెంటీమీటర్ల ఎత్తులో ఉందో లెక్కించండి. (1 మార్కు)
ప్రశ్న 2: కుర్చీ పైకప్పుకు ఏ కోణంలో వంగి ఉందో లెక్కించి చూపించండి. (1 మార్కు)
ప్రశ్న 3: ఈ కుర్చీని పైకప్పుకు కట్టిన విద్యార్థి పేరు రాయండి, (8 మార్కులు)
ప్రశ్న 4 : అలాగే అతనికి సహాయం చేసిన మిత్రుల పేర్లు వ్రాయండి. (20 మార్కులు)
🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
గురువు కుర్చీని పైకప్పుకు కట్టిన విద్యార్థి ని పట్టేశాడు. ✅ #💗నా మనస్సు లోని మాట #😂ఎగ్జాం జోక్స్