🔥నాగుల చవితికి పుట్టలో పాలు ఎందుకు పోయాలి🔥
మానవ దేహము లో తొమ్మిది రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండివున్న వెన్నెముకను ' వెన్నుబాము' అని అంటారు. అందు కుండలినీశక్తి మూలాధారచక్రంలో "పాము" ఆకారమువలెనే వుంటుందని "యోగశాస్త్రం" చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిదురిస్తున్నట్లు నటిస్తూ! కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే విషాల్ని గ్రక్కుతూ, మానవునిలో ' సత్వగుణ' సంపత్తిని హరించి వేస్తూ ఉంటుందని అందుకు ' నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పపుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది, అందరి హృదయాలలో నివశించే ' శ్రీమహావిష్ణువు"కు తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ... ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల అంతర్యమని చెప్తారు.
యీ 9 నాగుపాముల పేర్లూ చెప్పి పుట్టలో పాలు వేయాలి
👉ఓమ్ అనంత నాగాయ నమ
👉 ఓమ్ శేష నాగాయ నమః
👉ఓమ్ వాసుకి నాగాయ నమః
👉ఓమ్ తక్షక నాగాయ నమః
👉 ఓమ్ కులుకి నాగాయ నమః
👉ఓమ్ కర్కోటక నాగాయ నమః
👉 ఓమ్ శంఖ పాల నాగాయ నమః
👉 ఓమ్ పద్మనాభాయ నమః
👉ఓమ్ మహపద్మ నాబాయ నమః
పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహిమే శంకర ప్రియ!
#నాగుల చవితి శుభాకాంక్షలు #🙏🐉నాగుల చవితి విశిష్టత 🐉🐲🌺🌾 #🙏నాగుల చవితి విశిష్టత🐍