v. v. guptha
ShareChat
click to see wallet page
@299580595
299580595
v. v. guptha
@299580595
ఐ లవ్ షేర్ చాట్
https://youtube.com/watch?v=qsaiX8iBEME&si=6AS7gPXrDclTe8O3 #📙ఆధ్యాత్మిక మాటలు
youtube-preview
https://youtube.com/watch?v=7MfVviaCjiY&si=1C8MsJTlXVyWqi9_ #📙ఆధ్యాత్మిక మాటలు
youtube-preview
https://youtube.com/watch?v=GOjGcMk8Jys&si=iyugGgaJ_gRXmUfT #📙ఆధ్యాత్మిక మాటలు
youtube-preview
#📙ఆధ్యాత్మిక మాటలు 02-12-2025 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - మీరు వచ్చినప్పుడు మేము మీపై బలిహారము అవుతాము అని మీరు ప్రతిజ్ఞ చేశారు, మీకు ఈ ప్రతిజ్ఞను గుర్తు చేయించేందుకు ఇప్పుడు తండ్రి వచ్చారు’’ ప్రశ్న:-ఏ ముఖ్యమైన విశేషత కారణముగా పూజ్యులు అని కేవలం దేవతలను మాత్రమే అనగలరు? జవాబు:-దేవతల విశేషతయే ఏమిటంటే - వారు ఎప్పుడూ ఎవ్వరినీ స్మృతి చేయరు. వారు తండ్రినీ స్మృతి చేయరు, అలాగే ఎవరి చిత్రాలనూ స్మృతి చేయరు, అందుకే వారిని పూజ్యులు అని అంటారు. అక్కడ సుఖమే సుఖముంటుంది, అందుకే ఎవ్వరినీ స్మృతి చేయవలసిన అవసరము ఉండదు. ఇప్పుడు మీరు ఒక్క తండ్రి స్మృతితో ఇటువంటి పూజ్యులుగా, పావనులుగా అవుతారు, అప్పుడిక స్మృతి చేయవలసిన అవసరమే ఉండదు. ఓంశాంతి. మధురాతి మధురమైన రుహాని పిల్లలు స్మృతి చేయరు... వాస్తవానికి రుహాని ఆత్మలు అని అనరు. రూహ్ అన్నా లేక ఆత్మ అన్నా విషయము ఒకటే. ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. పరమపిత పరమాత్మ ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఆత్మలకు జ్ఞానాన్ని ఇవ్వలేదు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, నేను ఒక్కసారి మాత్రమే కల్పము యొక్క పురుషోత్తమ సంగమయుగములో వస్తాను. మొత్తము కల్పములో సంగమయుగములో తప్ప స్వయము తండ్రి ఇంకెప్పుడూ రారు అని ఈ విధముగా ఇంకెవ్వరూ చెప్పలేరు. తండ్రి సంగమయుగములోనే వస్తారు, అప్పుడు భక్తి పూర్తవుతుంది మరియు తండ్రి కూర్చుని పిల్లలకు ఈ జ్ఞానాన్ని ఇస్తారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ఇది చాలామంది పిల్లలకు చాలా కష్టమనిపిస్తుంది. వాస్తవానికి ఇది చాలా సహజము కానీ బుద్ధిలో సరైన రీతిలో కూర్చోదు కావున పదే-పదే అర్థం చేయిస్తూ ఉంటారు. కానీ అర్థం చేయించినా కూడా అర్థం చేసుకోరు. స్కూల్లో టీచర్ 12 నెలలు చదివిస్తారు, అయినా కానీ కొంతమంది ఫెయిల్ అయిపోతారు. ఈ అనంతమైన తండ్రి కూడా పిల్లలకు ప్రతిరోజు చదివిస్తారు, అయినా కానీ కొంతమందికి ధారణ అవుతుంది, కొంతమంది మర్చిపోతారు. స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి - ఈ ముఖ్యమైన విషయాన్నే అర్థం చేయించడము జరుగుతుంది. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రియే చెప్తారు, ఇతర మనుష్యమాత్రులెవ్వరూ ఎప్పుడూ ఇలా చెప్పలేరు. తండ్రి అంటారు, నేను ఒక్కసారి మాత్రమే వస్తాను, కల్పము తర్వాత మళ్ళీ సంగమయుగములో ఒక్కసారి మాత్రమే పిల్లలైన మీకు మాత్రమే అర్థం చేయిస్తాను. మీరే ఈ జ్ఞానాన్ని ప్రాప్తి చేసుకుంటారు, ఇతరులెవ్వరూ ఈ జ్ఞానాన్ని తీసుకోనే తీసుకోరు. ప్రజాపిత బ్రహ్మా యొక్క ముఖవంశావళి బ్రాహ్మణులైన మీరు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. కల్పక్రితము కూడా తండ్రి ఈ సంగమయుగములో ఈ జ్ఞానాన్ని వినిపించారని మీకు తెలుసు. బ్రాహ్మణులైన మీకు మాత్రమే ఈ పాత్ర ఉంది, ఈ వర్ణాలలోకి కూడా తప్పకుండా రావలసిందే. ఇతర ధర్మాల వారు ఈ వర్ణాలలోకి రానే రారు, భారతవాసులే ఈ వర్ణాలలోకి వస్తారు. బ్రాహ్మణులుగా కూడా భారతవాసులే అవుతారు, అందుకే తండ్రి భారత్ లోనే రావలసి వస్తుంది. మీరు ప్రజాపిత బ్రహ్మా యొక్క ముఖవంశావళి బ్రాహ్మణులు. బ్రాహ్మణుల తర్వాత దేవతలు మరియు క్షత్రియులు ఉంటారు. వాస్తవానికి ఎవ్వరూ ప్రత్యేకముగా క్షత్రియులుగా అవ్వరు. మిమ్మల్ని బ్రాహ్మణులుగా తయారుచేస్తారు, ఆ తర్వాత మీరు దేవతలుగా అవుతారు, ఆ తర్వాత నెమ్మది-నెమ్మదిగా కళలు తగ్గిపోయినప్పుడు వారినే క్షత్రియులని అంటారు. క్షత్రియులుగా ఆటోమేటిక్ గా అవ్వడము జరుగుతుంది. తండ్రి అయితే వచ్చి బ్రాహ్మణులుగా తయారుచేస్తారు, ఆ తర్వాత బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు, మళ్ళీ వారే క్షత్రియులుగా అవుతారు. మూడు ధర్మాలను ఒక్క తండ్రియే ఇప్పుడు స్థాపన చేస్తారు. స్థాపన చేయడము కోసమని తండ్రి మళ్ళీ సత్య, త్రేతాయుగాలలోకి వస్తారని కాదు. అర్థం చేసుకోని కారణముగా మనుష్యులు తండ్రి సత్య, త్రేతాయుగాలలో కూడా వస్తారని అంటారు. తండ్రి అంటారు, నేను ప్రతి యుగములోనూ రాను, నేను ఒక్కసారి మాత్రమే వస్తాను, కల్పము యొక్క సంగమయుగములో వస్తాను. మిమ్మల్ని నేనే బ్రాహ్మణులుగా తయారుచేస్తాను, ప్రజాపిత బ్రహ్మా ద్వారా. నేనైతే పరంధామము నుండి వస్తాను. అచ్ఛా, బ్రహ్మా ఎక్కడ నుండి వస్తారు? బ్రహ్మా అయితే 84 జన్మలు తీసుకుంటారు, నేను తీసుకోను. బ్రహ్మా-సరస్వతులే విష్ణువు యొక్క రెండు రూపాలైన లక్ష్మీ-నారాయణులుగా అవుతారు, వారే 84 జన్మలు తీసుకుంటారు, మళ్ళీ వారి అనేక జన్మల అంతిమములో ప్రవేశించి వారిని బ్రహ్మాగా చేస్తాను. వారికి బ్రహ్మా అని నేను పేరు పెడతాను. ఇదేమీ వారి సొంత పేరు కాదు. పిల్లలు జన్మించినప్పుడు ఆరవ రోజు పండుగను జరుపుతారు, జన్మ దినాన్ని జరుపుతారు, వారి జన్మపత్రికలోని పేరు అయితే లేఖ్ రాజ్. అది బాల్యములోని పేరు. సంగమయుగములో ఎప్పుడైతే తండ్రి ప్రవేశించారో, అప్పుడు పేరు మారింది, అది కూడా వీరు వానప్రస్థ అవస్థలో ఉన్నప్పుడు పేరు మారుతుంది. ఆ సన్యాసులైతే ఇళ్ళు-వాకిళ్ళను వదలి వెళ్ళినప్పుడు పేరు మారుతుంది. వీరైతే ఇంటిలోనే ఉంటారు, వీరికి బ్రహ్మా అన్న పేరు పెట్టారు, ఎందుకంటే బ్రాహ్మణులు కావాలి కదా. మిమ్మల్ని తమవారిగా చేసుకుని పవిత్ర బ్రాహ్మణులుగా తయారుచేస్తారు. పవిత్రముగా తయారుచేయడము జరుగుతుంది, అంతేకానీ మీరు జన్మించడముతోనే పవిత్రముగా ఉన్నారని కాదు. మీకు పవిత్రముగా తయారయ్యేందుకు శిక్షణ లభిస్తుంది. పవిత్రముగా ఎలా అవ్వాలి? ఇదే ముఖ్యమైన విషయము. భక్తి మార్గములో పూజ్యులు ఒక్కరు కూడా ఉండరని మీకు తెలుసు. గురువులు మొదలైనవారికి మనుష్యులు తల వంచి నమస్కరిస్తారు ఎందుకంటే వారు ఇళ్ళు-వాకిళ్ళను వదిలి పవిత్రముగా అవుతారు, అంతేకానీ వారిని పూజ్యులని అనరు. ఎవరైతే ఎవ్వరినీ స్మృతి చెయ్యరో, వారే పూజ్యులు. సన్యాసులు బ్రహ్మతత్వాన్ని స్మృతి చేస్తారు కదా, ప్రార్థన చేస్తారు. సత్యయుగములో ఎవ్వరినీ స్మృతి చేయరు. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు ఒక్కరినే స్మృతి చేయాలి. అదంతా భక్తి. మీ ఆత్మ కూడా గుప్తముగా ఉంది. ఆత్మ గురించి యథార్థ రీతిగా ఎవ్వరికీ తెలియదు. సత్య, త్రేతాయుగాలలో కూడా శరీరధారులు తమ పేర్లతోనే పాత్రను అభినయిస్తారు. పాత్రధారులు అన్న తర్వాత పేరు లేకుండానైతే ఉండలేరు. ఎక్కడున్నా సరే శరీరానికి తప్పకుండా పేరు ఉంటుంది. పేరు లేకుండా పాత్రనెలా అభినయిస్తారు. తండ్రి అర్థం చేయించారు - మీరు వచ్చినట్లయితే మేము మిమ్మల్నే మా వారిగా చేసుకుంటాము, ఇతరులెవ్వరినీ కాదు అని భక్తి మార్గములో పాడుతారు. మేము మీకు చెందినవారిగానే అవుతాము అని ఆత్మ అంటుంది. భక్తి మార్గములో ఏయే దేహధారులైతే ఉన్నారో, ఎవరికైతే పేర్లు పెట్టడము జరుగుతుందో, వారిని మేము పూజించము, ఎప్పుడైతే మీరు వస్తారో, అప్పుడు మీపైనే బలిహారమవుతాము. ఎప్పుడు వస్తారు, ఇది కూడా తెలియదు. అనేక దేహధారులను, నామధారులను పూజిస్తూ ఉంటారు. అర్ధకల్పము భక్తి పూర్తయినప్పుడు తండ్రి వస్తారు. వారు అంటున్నారు, మేము మిమ్మల్ని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయము, మా దేహాన్ని కూడా స్మృతి చేయము అని మీరు జన్మ జన్మాంతరాలుగా అంటూ వచ్చారు. కానీ నా గురించి తెలియనే తెలియకపోతే మరి ఎలా స్మృతి చేస్తారు. ఇప్పుడు తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని స్మృతి చేయండి. తండ్రియే పతిత-పావనుడు, వారిని స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా, సతోప్రధానముగా అయిపోతారు. సత్య, త్రేతాయుగాలలో భక్తి ఉండదు. మీరు ఎవ్వరినీ స్మృతి చేయరు. తండ్రినీ స్మృతి చేయరు, అలాగే చిత్రాలనూ స్మృతి చేయరు. అక్కడైతే సుఖమే సుఖముంటుంది. తండ్రి అర్థం చేయించారు - ఎంతగా మీరు సమీపముగా వస్తూ ఉంటారో, అంతగా కర్మాతీత అవస్థ తయారవుతూ ఉంటుంది. సత్యయుగములో కొత్త ప్రపంచములో, కొత్త ఇంటిలో సంతోషము కూడా చాలా ఉంటుంది, ఆ తర్వాత 25 శాతము పాతదిగా అయినప్పుడు స్వర్గాన్నే మర్చిపోయినట్లవుతుంది. తండ్రి అంటారు - మీ వారిగానే అవుతాము, మీ నుండే వింటాము అని మీరు పాడేవారు. తప్పకుండా మీరు పరమాత్మతోనే ఇలా అనేవారు కదా. ఆత్మ తన తండ్రి అయిన పరమాత్మతో ఇలా అంటుంది. ఆత్మ సూక్ష్మమైన బిందువు, దానిని చూడటానికి దివ్యదృష్టి కావాలి. ఆత్మపై ధ్యానము చేయలేరు. ఆత్మనైన నేను ఇంత చిన్న బిందువును అని ఈ విధముగా భావిస్తూ స్మృతి చేయడమనేది శ్రమతో కూడుకున్నది. ఆత్మ సాక్షాత్కారము కోసం ప్రయత్నించరు, పరమాత్మ కోసం ప్రయత్నిస్తారు, వారు వేయి సూర్యుల కన్నా తేజోమయుడు అని వారి గురించి విన్నారు. ఎవరికైనా సాక్షాత్కారమైతే, వారు చాలా తేజోమయముగా ఉన్నారని అంటారు ఎందుకంటే అదే విని ఉన్నారు. ఎవరికైతే నవ విధ భక్తి చేస్తారో, సాక్షాత్కారము కూడా వారిదే చూస్తారు. లేకపోతే విశ్వాసమే కూర్చోదు. తండ్రి అంటారు, ఆత్మనే చూడకపోతే ఇక పరమాత్మను ఎలా చూస్తారు. ఆత్మను అసలు ఎలా చూడగలరు, మిగిలినవారందరికీ అయితే శారీరక చిత్రాలు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి, కానీ ఆత్మ ఒక బిందువు, చాలా చిన్ననిది, దానిని ఎలా చూడగలరు. చాలా ప్రయత్నిస్తారు కానీ ఈ కళ్ళతో చూడలేరు. ఆత్మకు జ్ఞానము యొక్క అవ్యక్త నేత్రాలు లభిస్తాయి. ఆత్మలమైన మనము ఎంత చిన్నగా ఉంటాము అనేది ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మనైన నాలో 84 జన్మల పాత్ర నిండి ఉంది, దానిని నేను రిపీట్ చేయాలి. శ్రేష్ఠముగా తయారుచేసేందుకని తండ్రి శ్రీమతము లభిస్తుంది కావున దానిపై నడవాలి. మీరు దైవీ గుణాలను ధారణ చేయాలి. అన్నపానాదులు కూడా రాయల్ గా ఉండాలి, నడవడిక చాలా రాయల్ గా ఉండాలి. మీరు దేవతలుగా అవుతారు. దేవతలు స్వయం పూజ్యులు, వారెప్పుడూ ఎవరి పూజను చేయరు. వారు డబుల్ కిరీటధారులు కదా. వారు ఎప్పుడూ ఎవరినీ పూజించరు కావున వారు పూజ్యులు కదా. సత్యయుగములో ఎవ్వరినీ పూజించే అవసరమే ఉండదు. కానీ ఒకరికొకరు గౌరవాన్ని తప్పకుండా ఇచ్చుకుంటారు. ఈ విధముగా నమస్కరించడాన్ని గౌరవము అని అంటారు. అలాగని మనసులో వారిని స్మృతి చేయాలని కాదు. గౌరవమైతే ఇవ్వాల్సిందే. ఉదాహరణకు ప్రెసిడెంట్ ఉన్నారు, అందరూ వారిని గౌరవిస్తారు. వీరు పెద్ద పదవి కలవారు అని తెలుసు. వారికి నమస్కరించవలసిన అవసరము లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ జ్ఞాన మార్గము పూర్తిగా వేరు, ఇందులో కేవలం స్వయాన్ని ఆత్మగా భావించాలి, దీనిని మీరు మర్చిపోయారు. శరీరము యొక్క పేర్లను తలచుకుంటూ వచ్చారు. పనులైతే తప్పకుండా పేర్లతోనే చేయాలి. పేరు లేకుండా ఎవరినైనా ఎలా పిలుస్తారు. మీరు శరీరధారులై పాత్రను అభినయిస్తున్నారు కానీ బుద్ధితో శివబాబాను స్మృతి చేయాలి. శ్రీకృష్ణుని భక్తులు - తాము శ్రీకృష్ణుడినే స్మృతి చేయాలని భావిస్తారు. ఎక్కడ చూసినా, కృష్ణుడే కృష్ణుడు, నేనూ కృష్ణుడినే, నీవూ కృష్ణుడివే అని అంటారు. అరే, నీ పేరు వేరు, అతని పేరు వేరు... అందరూ కృష్ణులే కృష్ణులుగా ఎలా అవ్వగలరు. అందరికీ కృష్ణుడు అన్న పేరు ఉండదు, ఏది అనిపిస్తే అది అంటూ ఉంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, భక్తి మార్గపు చిత్రాలు మొదలైనవాటినన్నింటినీ మరచి ఒక్క తండ్రినే స్మృతి చేయండి. చిత్రాలనైతే మీరు పతిత-పావన అని అనరు, హనుమంతుడు మొదలైనవారు పతిత-పావనులు కారు. అనేక చిత్రాలు ఉన్నాయి. ఎవ్వరూ పతిత-పావనులు కారు. శరీరమున్న దేవీలు మొదలైనవారినెవ్వరినీ పతిత-పావనులు అని అనరు. 6-8 భుజాల కల దేవీలు మొదలైనవారిని తయారుచేస్తారు, అంతా తమ బుద్ధితోనే తయారుచేస్తారు. వారెవరు అన్నది తెలియదు. ఈ పతిత-పావనుడైన తండ్రి యొక్క పిల్లలు సహాయకులని ఎవ్వరికీ తెలియదు. మీ రూపమైతే ఈ విధముగా సాధారణముగానే ఉంటుంది. ఈ శరీరాలైతే వినాశనమైపోతాయి. మీ చిత్రాలు మొదలైనవి ఉంటాయని కాదు. ఇవన్నీ సమాప్తమైపోతాయి. వాస్తవానికి దేవీలు మీరే. సీతా దేవి, ఫలానా దేవి అని పేర్లు కూడా తీసుకోవడము జరుగుతుంది. రామ దేవత అని అనరు. ఫలానా దేవీ లేక శ్రీమతి అని అంటూ ఉంటారు, అది కూడా తప్పే అవుతుంది. ఇప్పుడు పావనముగా అయ్యేందుకు పురుషార్థము చేయాలి. పతితము నుండి పావనముగా చేయండి అని మీరంటారు కూడా. అంతేకానీ లక్ష్మీ-నారాయణులుగా చేయండి అని అనరు. పతితము నుండి పావనముగా కూడా తండ్రియే తయారుచేస్తారు. నరుని నుండి నారాయణునిగా కూడా వారే తయారుచేస్తారు. వారు పతిత-పావన అని నిరాకారుడిని అంటారు. సత్యనారాయణుని కథను వినిపించేవారిని వేరే చూపించారు. బాబా, మీరు సత్యనారాయణ కథను వినిపించి అమరులుగా చేయండి, నరుని నుండి నారాయణునిగా తయారుచేయండి అని అయితే అనరు. కేవలం - మీరు వచ్చి పావనముగా చేయండి అని మాత్రమే అంటారు. బాబాయే సత్యనారాయణుని కథను వినిపించి పావనముగా తయారుచేస్తారు. మీరు మళ్ళీ ఇతరులకు సత్య కథను వినిపిస్తారు. దీనిని ఇంకెవ్వరూ తెలుసుకోలేరు. మీరు మాత్రమే తెలుసుకుంటారు. మీ ఇంటిలో మిత్ర-సంబంధీకులు, సోదరులు మొదలైనవారు ఉన్నా కానీ వారు కూడా అర్థం చేసుకోరు. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. స్వయాన్ని శ్రేష్ఠముగా తయారుచేసుకునేందుకు తండ్రి యొక్క శ్రీమతమేదైతే లభిస్తుందో, దానిపై నడవాలి, దైవీ గుణాలను ధారణ చేయాలి. అన్నపానాదులు, నడవడిక అన్నీ రాయల్ గా ఉంచుకోవాలి. 2. ఒకరినొకరు స్మృతి చేయకూడదు కానీ గౌరవాన్ని తప్పకుండా ఇవ్వాలి. పావనముగా అయ్యే పురుషార్థాన్ని చేయాలి మరియు చేయించాలి. వరదానము:-నీరస వాతావరణములో సంతోషపు మెరుపును అనుభవము చేయించే ఎవర్ హ్యాపీ భవ ఎవర్ హ్యాపీగా అనగా సదా సంతోషముగా ఉండే వరదానము ఏ పిల్లలకైతే ప్రాప్తించిందో, వారు దుఃఖపు అలను ఉత్పన్నము చేసే వాతావరణములో, నీరస వాతావరణములో, అప్రాప్తిని అనుభవం చేయించే వాతావరణములో సదా సంతోషముగా ఉంటారు మరియు తమ సంతోషపు మెరుపుతో దుఃఖము మరియు ఉదాసీనతతో కూడిన వాతావరణాన్ని ఏ విధముగా పరివర్తన చేస్తారంటే, సూర్యుడు అంధకారాన్ని పరివర్తన చేసినట్లుగా చేస్తారు. అంధకారము మధ్యన ప్రకాశాన్ని తీసుకురావడము, అశాంతిలో శాంతిని తీసుకురావడము, నీరస వాతావరణములో సంతోషపు మెరుపును తీసుకురావడము, దీనినే ఎవర్ హ్యాపీ అని అంటారు. వర్తమాన సమయములో ఈ సేవ యొక్క అవసరమే ఉంది. స్లోగన్:-అశరీరి ఎవరంటే - ఎవరినైతే శరీరము యొక్క ఏ ఆకర్షణ తనవైపుకు ఆకర్షించదో వారు.   అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలనే ధ్యాసలోనే ఉండండి కర్మాతీతము అంటే కర్మల నుండి అతీతమైపోవటము అని అర్థము కాదు. కర్మ నుండి అతీతమవ్వటము కాదు, కర్మ యొక్క బంధనములో చిక్కుకోవటము నుండి అతీతమవ్వటము - దీనినే కర్మాతీతము అని అంటారు. కర్మయోగ స్థితి కర్మాతీత స్థితిని అనుభవము చేయిస్తుంది. ఈ కర్మయోగ స్థితి అతి ప్రియమైన మరియు అతీతమైన స్థితి. ఈ స్థితి ద్వారా ఎంత పెద్ద కార్యమైనా, శ్రమతో కూడిన కార్యమైనా కానీ, అది ఎలా అనిపిస్తుందంటే పని చెయ్యటము లేదు కానీ ఆడుకుంటున్నాము అన్నట్లు ఉంటుంది. "
https://youtube.com/watch?v=pA5rQ2CoitE&si=WCoxjA2yEJVUskJK #📙ఆధ్యాత్మిక మాటలు
youtube-preview
#📙ఆధ్యాత్మిక మాటలు 01-12-2025 ప్రాత:మురళిఓంశాంతి"బాప్ దాదా" మధువనం ‘‘మధురమైన పిల్లలూ - రోజూ విచార సాగర మంథనము చేసినట్లయితే సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కుతుంది, నడుస్తూ-తిరుగుతూ మేము స్వదర్శన చక్రధారులమని గుర్తు ఉండాలి’’ ప్రశ్న:-మీ ఉన్నతి చేసుకునేందుకు సహజ సాధనమేమిటి? జవాబు:-మీ ఉన్నతి కోసం రోజూ లెక్కాపత్రాన్ని పెట్టుకోండి. చెక్ చేసుకోండి - ఈ రోజంతటిలో ఆసురీ కర్మలేవీ చేయలేదు కదా? ఏ విధముగానైతే విద్యార్థులు తమ రిజిస్టర్ ను పెట్టుకుంటారో, అదే విధముగా పిల్లలైన మీరు కూడా దైవీ గుణాల రిజిస్టర్ ను పెట్టుకున్నట్లయితే ఉన్నతి జరుగుతూ ఉంటుంది. పాట:-దూరదేశ నివాసి... ఓంశాంతి. దూరదేశమని దేనినంటారు అనేది పిల్లలకు తెలుసు. దీని గురించి ప్రపంచములోని మనుష్యుల్లో ఒక్కరికి కూడా తెలియదు. ఎంత గొప్ప విద్వాంసులైనా, పండితులైనా కాని దీని అర్థం తెలియదు. పిల్లలైన మీరు ఇది అర్థం చేసుకుంటారు. ఏ తండ్రినైతే మనుష్యమాత్రులందరూ - ఓ భగవంతుడా... అని గుర్తు చేసుకుంటారో, వారు తప్పకుండా పైన మూలవతనములో ఉన్నారు, ఇతరులెవ్వరికీ ఇది తెలియదు. ఈ డ్రామా రహస్యాన్ని కూడా ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. ప్రారంభము నుండి మొదలుకొని ఇప్పటివరకు ఏదైతే జరిగిందో, ఏదైతే జరగనున్నదో, అదంతా బుద్ధిలో ఉంది. ఈ సృష్టి చక్రమెలా తిరుగుతుంది అనేది బుద్ధిలో ఉండాలి కదా. పిల్లలైన మీలో కూడా నంబరువారుగా అర్థం చేసుకుంటారు. విచార సాగర మంథనము చెయ్యరు, అందుకే సంతోషపు పాదరసము కూడా పైకి ఎక్కదు. కూర్చుంటూ, లేస్తూ - మేము స్వదర్శన చక్రధారులమని బుద్ధిలో ఉండాలి. ఆత్మనైన నాకు ఆది నుండి అంతిమము వరకు మొత్తం సృష్టి చక్రము గురించి తెలుసు. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నా, బుద్ధిలో మూలవతనము గుర్తుకొస్తుంది. అది స్వీట్ సైలెన్స్ హోమ్, నిర్వాణధామము, సైలెన్స్ ధామము, అక్కడ ఆత్మలు ఉంటారు. ఈ విషయాలు పిల్లలైన మీ బుద్ధిలోకి వెంటనే వచ్చేస్తాయి, ఇతరులెవ్వరికీ వీటి గురించి తెలియదు. శాస్త్రాలు మొదలైనవి ఎన్ని చదువుతూ, వింటూ ఉన్నా కానీ లాభమేమీ లేదు. వారందరూ దిగే కళలో ఉన్నారు. మీరు ఇప్పుడు ఎక్కుతున్నారు. తిరిగి వెళ్ళేందుకు మీరు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ పాత వస్త్రాన్ని వదిలి మనము ఇంటికి వెళ్ళాలి. సంతోషము ఉంటుంది కదా! ఇంటికి వెళ్ళేందుకని అర్ధకల్పము భక్తి చేశాము, మెట్లు కిందికి దిగుతూనే వచ్చాము. ఇప్పుడు బాబా మనకు సహజముగా అర్థం చేయిస్తున్నారు. పిల్లలైన మీకు సంతోషముండాలి. భగవంతుడైన బాబా మనల్ని చదివిస్తున్నారు - ఈ సంతోషము చాలా ఉండాలి. తండ్రి సమ్ముఖముగా చదివిస్తున్నారు. బాబా అందరికీ తండ్రి, వారు మనల్ని మళ్ళీ చదివిస్తున్నారు. వారు అనేక సార్లు చదివించారు. మీరు చక్రములో తిరిగి పూర్తి చేసినప్పుడు తండ్రి మళ్ళీ వస్తారు. ఈ సమయములో మీరు స్వదర్శన చక్రధారులు. మీరు విష్ణుపురి యొక్క దేవతలుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. ప్రపంచములో ఇతరులెవ్వరూ ఈ జ్ఞానాన్ని ఇవ్వలేరు. శివబాబా మనల్ని చదివిస్తున్నారు, ఈ సంతోషము ఎంతగా ఉండాలి. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవని, ఇవి సద్గతి కోసము కాదని పిల్లలకు తెలుసు. భక్తి మార్గపు సామాగ్రి కూడా కావాలి కదా. ఎంతో సామాగ్రి ఉంది. తండ్రి అంటారు, దీనితో మీరు పడిపోతూనే వచ్చారు. ప్రతి ముంగిట ఎంతగా భ్రమించారు. ఇప్పుడు మీరు శాంతిగా అయి కూర్చున్నారు. మీరు ఎదురుదెబ్బలు తినడము మొదలైనదంతా ఇప్పుడు సమాప్తమైపోయింది. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉందని మీకు తెలుసు, ఆత్మను పవిత్రముగా తయారుచేయడానికి తండ్రి ఇదే మార్గాన్ని తెలియజేస్తున్నారు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయిపోతారు, ఆ తర్వాత సతోప్రధాన ప్రపంచములోకి వచ్చి రాజ్యము చేస్తారు. ఈ మార్గాన్ని కల్ప-కల్పము అనేక సార్లు తండ్రి తెలియజేశారు. తమ అవస్థను కూడా చూసుకోవాలి, విద్యార్థులు పురుషార్థము చేసి తమను తాము తెలివైనవారిగా చేసుకుంటారు కదా. చదువు యొక్క రిజిస్టర్ కూడా ఉంటుంది మరియు నడవడిక యొక్క రిజిస్టర్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు కూడా దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. ఈ రోజంతా ఎటువంటి ఆసురీ కర్మలు చేయలేదు కదా అని ప్రతిరోజూ మీ లెక్కాపత్రాన్ని పెట్టుకున్నట్లయితే చాలా ఉన్నతి జరుగుతుంది. మనమైతే దేవతలుగా అవ్వాలి. లక్ష్మీ-నారాయణుల చిత్రము ఎదురుగా పెట్టారు. ఇది ఎంత సింపుల్ చిత్రము. పైన శివబాబా ఉన్నారు. ప్రజాపిత బ్రహ్మా ద్వారా ఈ వారసత్వాన్ని ఇస్తున్నారంటే తప్పకుండా సంగమయుగములో బ్రాహ్మణ, బ్రాహ్మణీలు ఉంటారు కదా. దేవతలు సత్యయుగములో ఉంటారు. బ్రాహ్మణులు సంగమయుగములో ఉన్నారు. కలియుగములో శూద్ర వర్ణము వారు ఉన్నారు. విరాట రూపాన్ని కూడా బుద్ధిలో ధారణ చెయ్యండి. మనము ఇప్పుడు బ్రాహ్మణులము, పిలక స్థానములోని వారము, ఆ తర్వాత దేవతలుగా అవుతాము. తండ్రి బ్రాహ్మణులను చదివిస్తున్నారు, దేవతలుగా తయారుచేయడానికి చదివిస్తున్నారు, కావున దైవీ గుణాలు కూడా ధారణ చెయ్యాలి, అంత మధురముగా తయారవ్వాలి. ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. ఏ విధముగానైతే శరీర నిర్వహణ కోసం ఏదో ఒక పని చేయడము జరుగుతుందో, అలాగే ఇక్కడ కూడా యజ్ఞ సేవను చెయ్యాలి. ఎవరైనా అనారోగ్యముగా ఉంటే, సేవ చేయలేకపోతే, వారి సేవ కూడా చేయవలసి ఉంటుంది. ఎవరైనా అనారోగ్యము చెంది శరీరాన్ని వదిలేస్తే మీరు దుఃఖపడవలసిన లేక ఏడవవలసిన విషయము లేదు. మీరైతే పూర్తిగా శాంతిగా బాబా స్మృతిలో ఉండాలి. ఎటువంటి శబ్దము ఉండకూడదు. వారైతే శ్మశానానికి తీసుకువెళ్ళినప్పుడు రామ నామము కలవారు తోడుగా ఉన్నారు అని పలుకుతూ వెళ్తారు. మీరైతే ఏమీ పలకవలసిన అవసరము లేదు. మీరు సైలెన్స్ ద్వారా విశ్వముపై విజయము పొందుతారు. వారిది సైన్స్, మీది సైలెన్స్. పిల్లలైన మీకు జ్ఞానము మరియు విజ్ఞానము యొక్క యథార్థమైన అర్థము కూడా తెలుసు. జ్ఞానమంటే వివేకము మరియు విజ్ఞానమంటే అంతా మర్చిపోవడము, అది జ్ఞానము కన్నా అతీతమైనది. కావున జ్ఞానము కూడా ఉంది, విజ్ఞానము కూడా ఉంది. నేను శాంతిధామ నివాసిని అని ఆత్మకు తెలుసు. ఇంకా జ్ఞానము కూడా ఉంది. రూప్ మరియు బసంత్ (యోగ స్వరూపులు మరియు జ్ఞాన స్వరూపులు). బాబా కూడా రూప్-బసంత్ కదా. వారు రూప్ కూడా మరియు వారిలో మొత్తం సృష్టి చక్రము యొక్క జ్ఞానము కూడా ఉంది. వాళ్ళు విజ్ఞాన భవనమని పేరు పెట్టారు కానీ దాని అర్థాన్ని ఏమీ అర్థం చేసుకోరు. ఈ సమయములో సైన్స్ వలన దుఃఖము కూడా ఉంది మరియు సుఖము కూడా ఉందని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. అక్కడ సుఖమే సుఖముంటుంది. ఇక్కడ అల్పకాలికమైన సుఖము ఉంటుంది, మిగిలినదంతా దుఃఖమే దుఃఖము. ఇంట్లో మనుష్యులు ఎంత దుఃఖితులుగా ఉంటారు. దీని కంటే చనిపోతే ఈ దుఃఖపు ప్రపంచము నుండి విముక్తులమైపోతాము కదా అని భావిస్తారు. బాబా మనల్ని స్వర్గవాసులుగా చేయడానికి వచ్చి ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు. మరి ఎంతగా ఆనందముతో పులకరింపు కలగాలి. కల్ప-కల్పమూ బాబా మనల్ని స్వర్గవాసులుగా చేయడానికి వస్తారు, మరి ఇటువంటి తండ్రి మతముపై నడవాలి కదా. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, ఎప్పుడూ ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకండి. గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రముగా అవ్వండి. మనము సోదరీ-సోదరులము, ఇది ప్రేమ యొక్క సంబంధము. వేరే ఏ దృష్టి కలగడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరి రోగము ఎవరిది వారిదే, దాని అనుసారముగా సలహా కూడా ఇస్తూ ఉంటారు. బాబా, ఇలాంటి, ఇలాంటి పరిస్థితి వస్తూ ఉంటుంది, ఈ పరిస్థితిలో ఏమి చేయాలి అని అడుగుతుంటారు. బాబా అర్థం చేయిస్తారు, సోదరీ-సోదరుల దృష్టి అశుద్ధముగా ఉండకూడదు. ఎటువంటి గొడవలు ఉండకూడదు. నేను ఆత్మలైన మీకు తండ్రిని కదా. శివబాబా బ్రహ్మా తనువు ద్వారా మాట్లాడుతున్నారు. ప్రజాపిత బ్రహ్మా శివబాబాకు కుమారుడు, వారు సాధారణ తనువులోనే వస్తారు కదా. విష్ణువైతే సత్యయుగానికి చెందినవారు. తండ్రి అంటారు, నేను వీరిలో ప్రవేశించి కొత్త ప్రపంచాన్ని రచించడానికి వచ్చాను. బాబా అడుగుతుంటారు - మీరు విశ్వ మహారాజా, మహారాణిగా అవుతారా? అవును బాబా, ఎందుకు అవ్వము అని అంటారు. అయితే, ఇందులో పవిత్రముగా ఉండవలసి ఉంటుంది. ఇది కష్టము. అరే, మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తాను, మీరు పవిత్రముగా ఉండలేరా? సిగ్గుగా అనిపించడము లేదా? లౌకిక తండ్రి కూడా - అశుద్ధమైన పనులు చేయవద్దని అర్థం చేయిస్తుంటారు కదా. ఈ వికారాల విషయము వలనే విఘ్నాలు కలుగుతాయి. ప్రారంభము నుండి మొదలుకొని ఈ విషయములో గొడవలు జరుగుతూ వచ్చాయి. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, దీనిపై విజయము పొందాలి. నేను పవిత్రముగా తయారుచేయడానికి వచ్చాను. పిల్లలైన మీకు రైట్-రాంగ్, మంచి-చెడుల గురించి ఆలోచించే బుద్ధి లభించింది. ఈ లక్ష్మీ-నారాయణులు మీ లక్ష్యము-ఉద్దేశ్యము. స్వర్గవాసులలో దైవీ గుణాలు ఉన్నాయి, నరకవాసులలో అవగుణాలు ఉన్నాయి. ఇప్పుడు ఇది రావణ రాజ్యము, ఇది కూడా ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. రావణుడిని ప్రతి సంవత్సరము కాలుస్తుంటారు. అతను శత్రువు కదా. కాలుస్తూనే వస్తారు కానీ అతడెవరు అన్నది అర్థం చేసుకోరు. మనమంతా రావణ రాజ్యానికి చెందినవారము కదా కావున తప్పకుండా మనము అసురులుగా ఉన్నాము. కానీ స్వయాన్ని ఎవ్వరూ అసురులుగా భావించరు. ఇది రాక్షస రాజ్యమని చాలామంది అంటుంటారు కూడా. యథా రాజా రాణి తథా ప్రజ. కానీ ఈ మాత్రము కూడా వివేకము లేదు. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - రామ రాజ్యము వేరుగా ఉంటుంది, రావణ రాజ్యము వేరుగా ఉంటుంది. ఇప్పుడు మీరు సర్వగుణ సంపన్నులుగా అవుతున్నారు. తండ్రి అంటారు, మందిరాలకు వెళ్ళి దేవతలను పూజించే నా భక్తులకు జ్ఞానము వినిపించండి. అంతేకానీ, రకరకాల వ్యక్తుల వెనుక తల బాదుకోకండి. మందిరాలలో మీకు చాలామంది భక్తులు లభిస్తారు. నాడి కూడా చూడవలసి ఉంటుంది. డాక్టర్లు చూడగానే ఫలానావారికి ఏం రోగము ఉంది అన్నది చెప్పేస్తారు. ఢిల్లీలో అజ్మల్ ఖాన్ అనే ఒక ప్రసిద్ధమైన వైద్యుడు ఉండేవారు. తండ్రి అయితే మిమ్మల్ని 21 జన్మల కోసం సదా ఆరోగ్యవంతులుగా, ధనవంతులుగా తయారుచేస్తారు. ఇక్కడైతే అందరూ రోగులుగా, అనారోగ్యులుగా ఉన్నారు. అక్కడైతే ఎప్పుడూ రోగాలు ఉండవు. మీరు సదా ఆరోగ్యవంతులుగా, సదా ధనవంతులుగా అవుతారు. మీరు మీ యోగబలముతో కర్మేంద్రియాలపై విజయము పొందుతారు. మిమ్మల్ని ఈ కర్మేంద్రియాలు ఎప్పుడూ మోసము చేయలేవు. బాబా అర్థం చేయించారు, మంచి రీతిలో స్మృతిలో ఉన్నట్లయితే, దేహీ-అభిమానులుగా ఉన్నట్లయితే కర్మేంద్రియాలు మోసము చెయ్యవు. ఇక్కడే మీరు వికారాలపై విజయము పొందుతారు. అక్కడ చెడు దృష్టి ఉండదు, అసలు రావణ రాజ్యమే ఉండదు. అది ఉన్నదే అహింసాయుతమైన దేవీ-దేవతా ధర్మము. యుద్ధము మొదలైనవాటి విషయమేమీ ఉండదు. ఈ యుద్ధము కూడా అంతిమములో జరగవలసి ఉంది. దీని ద్వారా స్వర్గ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ఇక ఆ తర్వాత ఎప్పుడూ యుద్ధాలు జరగనే జరగవు. యజ్ఞము కూడా ఇదే చివరిది. ఆ తర్వాత అర్ధకల్పము ఎటువంటి యజ్ఞము ఉండదు. ఇందులో మొత్తము చెత్త అంతా స్వాహా అయిపోతుంది. ఈ యజ్ఞము ద్వారానే వినాశ జ్వాల వెలువడింది, మొత్తం శుభ్రమైపోతుంది. పిల్లలైన మీకు సాక్షాత్కారాలు కూడా చేయించడము జరిగింది, అక్కడి శూబీరసము మొదలైనవి కూడా చాలా రుచికరముగా, ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. ఆ రాజ్యాన్ని ఇప్పుడు మీరు స్థాపన చేస్తున్నారంటే ఎంత సంతోషముండాలి. మీ పేరే శివశక్తి భారతమాతలు. కేవలం స్మృతి ద్వారానే శివుడి నుండి మీరు శక్తిని తీసుకుంటారు. ఇందులో ఎదురుదెబ్బలు తినే విషయమేమీ లేదు. ఎవరైతే భక్తి చెయ్యరో, వారు నాస్తికులని అక్కడ భావిస్తారు. మీరు అంటారు, ఎవరికైతే తండ్రి గురించి మరియు రచన గురించి తెలియదో, వారు నాస్తికులు. మీరు ఇప్పుడు ఆస్తికులుగా అయ్యారు. త్రికాలదర్శులుగా కూడా అయ్యారు. మూడు లోకాల గురించి, మూడు కాలాల గురించి తెలుసుకున్నారు. ఈ లక్ష్మీ-నారాయణులకు తండ్రి నుండి ఈ వారసత్వము లభించింది. ఇప్పుడు మీరు అలా తయారవుతారు. ఈ విషయాలన్నింటినీ తండ్రియే అర్థం చేయిస్తారు. శివబాబా స్వయముగా అంటారు - నేను వీరిలో ప్రవేశించి అర్థం చేయిస్తాను, లేకపోతే నిరాకారుడినైన నేను ఎలా అర్థం చేయించగలను. ప్రేరణ ద్వారా చదువు సాధ్యమవుతుందా? చదివించేందుకైతే నోరు కావాలి కదా. గోముఖము వీరు కదా. వీరు పెద్ద తల్లి కదా, వీరు హ్యూమన్ మాత (మానవ తల్లి). తండ్రి అంటారు, నేను వీరి ద్వారా పిల్లలైన మీకు సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తాను, యుక్తులు తెలియజేస్తాను. ఇందులో ఆశీర్వాదాల విషయమేమీ లేదు. డైరెక్షన్లపై నడుచుకోవాలి. శ్రీమతము లభిస్తుంది. కృప యొక్క విషయము కాదు. బాబా, పదే-పదే మర్చిపోతున్నాము, కృప చూపించండి అని అంటారు. అరే, స్మృతి చేయడమనేది మీ పని, నేనేమీ కృప చూపిస్తాను. నాకైతే అందరూ పిల్లలే. కృప చూపిస్తే అందరూ సింహాసనముపై కూర్చుంటారు. పదవిని చదువు అనుసారముగానే పొందుతారు. చదవాల్సింది మీరే కదా. పురుషార్థము చేస్తూ ఉండండి. అతి ప్రియమైన తండ్రిని స్మృతి చేయాలి. పతితాత్మలు తిరిగి వెళ్ళలేరు. తండ్రి అంటారు, ఎంతగా మీరు స్మృతి చేస్తారో, అంతగా స్మృతి చేస్తూ-చేస్తూ పావనముగా అయిపోతారు. పావనాత్మలు ఇక్కడ ఉండలేరు. పవిత్రముగా అయినట్లయితే శరీరము కొత్తది కావాలి. పవిత్రాత్మకు అపవిత్ర శరీరము లభించడమనేది నియమము కాదు. సన్యాసులు కూడా వికారాలతోనే జన్మ తీసుకుంటారు కదా. ఈ దేవతలు వికారాల ద్వారా జన్మ తీసుకోరు కావున వీరు మళ్ళీ సన్యాసము చేయవలసిన అవసరము ఉండదు. వీరు ఉన్నతమైనవారు కదా. సదా సంపూర్ణ నిర్వికారులుగా ఉండే వీరే సత్యాతి-సత్యమైన మహాత్ములు. అక్కడ రావణ రాజ్యము ఉండదు. అది ఉన్నదే సతోప్రధాన రామ రాజ్యము. వాస్తవానికి రామ అని కూడా అనకూడదు. వారు శివబాబా కదా. దీనిని రాజస్వ అశ్వమేధ అవినాశీ రుద్ర జ్ఞాన యజ్ఞమని అంటారు. రుద్రుడు అన్నా లేక శివుడు అన్నా ఒక్కరే. శ్రీకృష్ణుడి పేరు లేదు. శివబాబా వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు, వారు మళ్ళీ రుద్ర యజ్ఞాన్ని రచించినప్పుడు మట్టి లింగాన్ని మరియు సాలిగ్రామాలను తయారుచేస్తారు. వాటిని పూజించి మళ్ళీ పగలగొట్టేస్తారు. బాబా దేవీల ఉదాహరణను ఇస్తారు కదా. ఎలాగైతే దేవీలను అలంకరించి, తినిపించి, తాగించి, పూజించి మళ్ళీ ముంచేస్తారో, అలాగే శివబాబాను మరియు సాలిగ్రామాలను చాలా ప్రేమతో మరియు శుద్ధితో పూజించి మళ్ళీ సమాప్తము చేసేస్తారు. ఇదంతా భక్తి యొక్క విస్తారము. ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఎంతగా తండ్రి స్మృతిలో ఉంటారో, అంతగా సంతోషముగా ఉంటారు. ప్రతిరోజు రాత్రి మీ లెక్కాపత్రాన్ని చూసుకోవాలి - ఏ తప్పు చేయలేదు కదా? బాబా, ఈ రోజు నా ద్వారా ఈ తప్పు జరిగింది, క్షమించండి అని మీ చెవులు పట్టుకోవాలి. బాబా అంటారు, సత్యము వ్రాసినట్లయితే సగము పాపం తొలగిపోతుంది. బాబా అయితే కూర్చుని ఉన్నారు కదా. మీ కళ్యాణము చేసుకోవాలనుకుంటే శ్రీమతముపై నడవండి. లెక్కాపత్రము పెట్టుకున్నట్లయితే చాలా ఉన్నతి జరుగుతుంది. ఇందులో ఖర్చు అయితే ఏమీ లేదు. ఉన్నత పదవిని పొందాలంటే మనసా-వాచా-కర్మణా ఎవ్వరికీ దుఃఖాన్ని ఇవ్వకూడదు. ఎవరైనా ఏమైనా అంటే వినీ విననట్లుగా ఉండాలి. ఈ కృషి చేయాలి. పిల్లలైన మీ దుఃఖాలను దూరము చేసి సదా కొరకు సుఖాన్ని ఇచ్చేందుకే తండ్రి వస్తారు కావున పిల్లలు కూడా అలా తయారవ్వాలి. మందిరాలలో అన్నింటికన్నా మంచి సేవ జరుగుతుంది. అక్కడ ధార్మిక మనస్కులు మీకు చాలామంది కలుస్తారు. ప్రదర్శనీలలో చాలామంది వస్తారు. ప్రొజెక్టర్ కంటే కూడా ప్రదర్శనీలలో, మేళాలలో సేవ బాగా జరుగుతుంది. మేళాలలో ఖర్చవుతుంది అంటే మరి తప్పకుండా లాభము కూడా ఉంటుంది కదా. అచ్ఛా! మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము:- 1. తండ్రి రైట్-రాంగ్ ను (తప్పు-ఒప్పులను) అర్థం చేసుకునే బుద్ధిని ఇచ్చారు, ఆ బుద్ధి ఆధారముగానే దైవీ గుణాలను ధారణ చెయ్యాలి, ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు. పరస్పరములో సోదరీ-సోదరులము అనే సత్యమైన ప్రేమ ఉండాలి, ఎప్పుడూ చెడు దృష్టి కలగకూడదు. 2. తండ్రి యొక్క ప్రతి డైరెక్షన్ పై నడుచుకుని బాగా చదువుకుని మీపై మీరే కృప చూపించుకోవాలి. మీ ఉన్నతి కోసం లెక్కాపత్రము పెట్టుకోవాలి, ఎవరైనా దుఃఖాన్ని ఇచ్చే మాటలు మాట్లాడితే వినీ-విననట్లుగా ఉండాలి. వరదానము:-ఈశ్వరీయ రాయల్టీతో కూడిన సంస్కారాల ద్వారా ప్రతి ఒక్కరి విశేషతలను వర్ణన చేసే పుణ్య ఆత్మా భవ సదా స్వయాన్ని విశేష ఆత్మగా భావిస్తూ ప్రతి సంకల్పాన్ని మరియు కర్మను చేయడము మరియు ప్రతి ఒక్కరిలో విశేషతను చూడడము, వర్ణన చేయడము, సర్వుల పట్ల వారిని విశేషముగా తయారుచేయాలి అన్న శుభ కళ్యాణ కామనను ఉంచుకోవడము - ఇదే ఈశ్వరీయ రాయల్టీ. రాయల్ ఆత్మలు ఇతరుల ద్వారా వదిలివేయబడిన వస్తువులను స్వయములో ధారణ చేయలేరు, అందుకే సదా అటెన్షన్ ఉండాలి - ఎవరి బలహీనతలనైనా లేక అవగుణాలనైనా చూసే నేత్రము సదా మూయబడి ఉండాలి. ఒకరికొకరు గుణగానము చేసుకోండి, స్నేహము మరియు సహయోగము అనే పుష్పాలను ఇచ్చిపుచ్చుకోండి, అప్పుడు పుణ్యాత్ములుగా అయిపోతారు. స్లోగన్:-వరదానము యొక్క శక్తి పరిస్థితి రూపీ అగ్నిని కూడా నీరుగా చేసేస్తుంది.   అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలనే ధ్యాసలోనే ఉండండి నిరాకారీ స్వరూపపు ముఖ్య శిక్షణ యొక్క వరదానము ఏమిటంటే - ‘‘కర్మాతీత భవ’’. ఆకారీ స్వరూపము లేక ఫరిశ్తాతనపు వరదానము ఏమిటంటే - ‘‘డబుల్ లైట్ భవ’’. డబుల్ లైట్ అనగా ఒకటి, సర్వ కర్మ బంధనాల నుండి తేలికగా ఉండటము మరియు రెండు, లైట్ అనగా సదా ప్రకాశ స్వరూపములో స్థితులై ఉండటము. ఇలా డబుల్ లైట్ గా ఉండేవారు సహజముగా కర్మాతీత స్థితిని ప్రాప్తి చేసుకోగలరు. కావున సేవలలోకి వస్తూ ఇప్పుడు ఇదే ధ్యాసలో ఉండండి - నేను సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాల్సిందే అని. "
#📙ఆధ్యాత్మిక మాటలు
📙ఆధ్యాత్మిక మాటలు - -0^ HLaL 3aojuain చథ] పUవగన  -0^ HLaL 3aojuain చథ] పUవగన - ShareChat
#📙ఆధ్యాత్మిక మాటలు
📙ఆధ్యాత్మిక మాటలు - கஅ ಜಐ೨ಂಅನದ ಒ5 ಏದ೦ಂಗಂ లాంటిది తల్లిగర్భం నుండి ಠಾಣಿ ప్రాణం పోసుకున్నఆ అగ్ిగి రితి  సమయాసుసారంగా ఈ ٥ ప్రపంచంలో అడుగిడితన జీవనయాత్రను ప్రారంభిస్తాడు; ఈ యాత్రరకరకాల పాత్రలమధ్య రకరకాల వ్యవహారాలు  విశేషతల మధ్య సాగుతూపోతుంది ప్రతీ మజిలీని ధైర్యంతో తేలికగా దాటుకుని వెళ్ళాలేగాని; ఆగిపోకూడదు రకరకాల పరిస్థితుల ముధ్య జీవితం గడిపే మనకు సత్యమైన మార్గాన్ని నిర్దేశించి; సుఖశాంతులతో గడిపే జీవితాన్నిపరమాత్య . తప్ప ఇంకెప్పరూ . ఇవ్వలేరు கஅ ಜಐ೨ಂಅನದ ಒ5 ಏದ೦ಂಗಂ లాంటిది తల్లిగర్భం నుండి ಠಾಣಿ ప్రాణం పోసుకున్నఆ అగ్ిగి రితి  సమయాసుసారంగా ఈ ٥ ప్రపంచంలో అడుగిడితన జీవనయాత్రను ప్రారంభిస్తాడు; ఈ యాత్రరకరకాల పాత్రలమధ్య రకరకాల వ్యవహారాలు  విశేషతల మధ్య సాగుతూపోతుంది ప్రతీ మజిలీని ధైర్యంతో తేలికగా దాటుకుని వెళ్ళాలేగాని; ఆగిపోకూడదు రకరకాల పరిస్థితుల ముధ్య జీవితం గడిపే మనకు సత్యమైన మార్గాన్ని నిర్దేశించి; సుఖశాంతులతో గడిపే జీవితాన్నిపరమాత్య . తప్ప ఇంకెప్పరూ . ఇవ్వలేరు - ShareChat
ఓంశాంతిశివబాబా 🙏🙏🙏🙏🙏 All India Arya Vysya Sangam का app आ गया है । सभी सदस्य नीचे दिए लिंक पर क्लिक करके तुरंत ही जुड़ें और अपना सदस्य Community कार्ड प्राप्त करे - Powered by Kutumb App https://primetrace.com/group/16372/post/1172920239?utm_source=android_post_share_web&referral_code=LJ10Z&utm_screen=post_share&utm_referrer_state=PENDING #📙ఆధ్యాత్మిక మాటలు