Bandi stephen paul
ShareChat
click to see wallet page
@401271730
401271730
Bandi stephen paul
@401271730
simple
#hosanna #church #tears #johnwesly #god @stephenpaul
church - ShareChat
00:49
#life #struggle #family #hate #motivation #inspire
motivation - ShareChat
00:52
#money #Jesus #hosanna #christian #bible @bandi stephenpaul
christian - ShareChat
00:58
#money #Jesus #hosanna #christian #bible @bandi stephenpaul
christian - ShareChat
00:58
#bible #hosanna #christian #viral #trend
trend - ShareChat
00:38
#hosanna #johnwesly #christian #god #bible
god - ShareChat
00:42
#christian #hosanna #church #bible #🌹🌿🌹calvery temple🌹🌿🌹
church - ShareChat
01:00
#home #sarees #family #christian #couple
christian - ShareChat
00:47
#💞💞cute family💗💞💞 #wife #christian #god #husband
wife - ShareChat
00:59
🍇 *మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రియులైన మీకందరికి హృదయపూర్వక వందనములు.* 🌳 *బాగున్నారా!పరిచర్య కొరకు కొన్నటువంటి వస్తువులకు,మరియు కొందరి ద్వారా ఆర్థికముగా చాలా మోసపోవడము,నష్టపోవడము,కోలుకోలేని,ఊహించలేని ఎదురు దెబ్బలు కలుగడము జరిగినది, ఇప్పుడు ఆ ఆర్థికమును కట్టవలసిన భారము నాపైన మోపబడియున్నది,దేవుని యెదుట నమ్మకముగా చేయుచున్న ఈ పరిచర్యకొరకు భారముగా ప్రార్థించాలని,పరిచర్య కొరకు మీరు సహాకారులుగా ఉండాలని ప్రేమతో మీ ఆత్మీయ సహోదరునిగా కోరుచున్నాను.* పాస్టర్ బి.స్టీఫెన్ పాల్: IPC church:9618361226 ✍ఈ దిన సందేశము✍ 👤 *మనుషులను మోసము చేసినంత సుళువు కాదు? దేవునిని మోసము చేయడము!*👥 👤 *ఈ లోకములో మనము ఎవ్వరినైనా మోసము చేయవచ్చు*.. *భార్య,భర్తను మోసము చేయవచ్చు*, *భర్త,భార్యను మోసము చేయవచ్చు*. *అన్న,తమ్మునిని, తమ్ముడు(రీడ్ మోర్ నొక్కండి)👇👇👇 అన్నను మోసము చేయవచ్చు. అక్క,చెల్లెలిని*, చెల్లెలు అక్కను మోసము చేయవచ్చు. స్నేహితులు ఒకరికొకరు మోసము చేసుకోవచ్చు. పిల్లలు,తల్లిదండ్రులను, తల్లిదండ్రులు,పిల్లలను మోసము చేయవచ్చు కానీ ఈ లోకమును,మరియు నిన్నూ' నన్ను కలుగజేసినా దేవునిని మాత్రము మోసము చేయలేము*. *అవును మనుషులను మోసము చేసినంత సులువు కాదు దేవునిని మోసము చేయడము*. 📖 *ఒకడు నరులను మోసముచేయునట్లు మీరు ఆయనను మోసముచేయుదురా*?( యోబు 13:9) 🙇‍♀️ *భక్తుడైన యోబు అంటున్నాడు. మనుషులను మోసము చేసినట్లు దేవునిని మోసము చేయలేము*. *కొంతమంది భక్తులము అని చెప్పుకునేవారు కూడా హృదయములో పాపమును దాచిపెట్టుకొని కుళ్ళును, కుతంత్రములను దాచిపెట్టుకొని జీవిస్తూవుంటారు*. 👤 *చాలామంది దేవునిని మోసము చేయడానికి ప్రయత్నములు చేస్తువుంటారు. మనుషులకు భక్తులులుగా కనబడుతుంటారు. కానీ భక్తిలో వున్న శక్తిని అనుభవించక రక్తితో కూడిన జీవితమును చేయుచున్నారు*. *మాలాంటి సేవకులు కూడా కొంతమంది అందరు కాదు పైకి బాగానే కనబడుతున్నారు కానీ లోపల మాత్రము లోక,కోరికలు అనుభవిస్తూ చీకటి జీవితమును చేస్తూ దేవునిని మోసము చేయడానికి ప్రయత్నములు చేస్తువుంటారు*. 🤦‍♀️ *ఒకసారి ఒక వ్యక్తిని ప్రత్నిస్తే ఆయనంటాడు అబ్రాహాముకు ఇద్దరు, ముగ్గురు భార్యలున్నారు, మరి నాకు నలుగురైన లేకపోతే ఎలాగండి అని అన్నాడు. దేవుని మోసము చేయడానికి ప్రయత్నములు చేస్తున్నారు కానీ మనుషులను మోసము చేసి బ్రతకవచ్చు కానీ, దేవునిని మోసము చేసి బ్రతకలేము. తప్పక మన పాపమే మనలను పట్టిస్తుంది*. 🙋‍♂️ *పాపమును మనము విడిచిపెట్టిన కూడా పాపము మాత్రము మనలను విడువదు. తప్పక పాపమునకు శిక్షను అనుభవిచవలసి వస్తుంది. తప్పక దోషిగా నిలబడవలసి వస్తుంది ఎవరితోనైనా ఆటలాడవచ్చు కానీ దేవునితో ఆటలాడలేము కదా*! *తోటి విశ్వాసులను మోసము చేసి బ్రతకవచ్చు, సంఘమును మోసము చేసి బ్రతకవచ్చు, సమాజమును మోసము చేసి బ్రతకవచ్చు కానీ దేవునిని మోసము చేసి బ్రతికేవారు సమాధానకరమైన జీవితమును జీవించలేరు. తప్పక మన పాపమే మనలను పట్టిస్తుంది ఆ తరువాత సమాజములో తలదించుకునే పరిస్థితులు ఏర్పడుతాయి*. 🤷‍♂️ *ప్రియా సహోదరి,సహోదరులారా! నేను చేసినది ఎవరు చూడలేదులే అని నీవనుకోవచ్చు.! నీవు చేసిన ఆ పాపమును ఎవరు చూడలేదు అని నీవనుకోవచ్చు కానీ నీవు చీకటిలో చేసిన పాపమును దేవుడు చూసాడు. ఎవరి కన్నులనైనా మోసము చేయవచ్చు కానీ దేవుని కన్నులను మాత్రము మోసము చేయలేము. జాగ్రత్త*! 🙍‍♂️ *మనము ఒక సమయములో ఒకరి గురించి మాత్రమే ఆలోచన చేస్తాము, మనము మన కన్నుల ఎదుట కనబడేంతవరకు మాత్రమే చూడగలుగుతాము కానీ దేవుడు ఒకేసారి ప్రతిఒక్కరిని చూస్తున్నాడు. ఎక్కడ ఏమి చేస్తున్నామో దేవుడు చూస్తున్నాడు. ఏ సందులలో ఎలా ప్రవర్తిస్తున్నామో దేవుడు చూస్తున్నాడు. ఎవరూలేని సమయములో మన ఆలోచనలు ఎలా ఉన్నాయో దేవుడు చూస్తున్నాడు. ఫోన్ లో మనము మాట్లాడే మాటలు ఎవరు వినలేదని మనము అనుకుంటున్నాము కానీ దేవుడు వింటున్నాడు మనలను చూస్తున్నాడు. మొబైల్ లో చూసే దృశ్యాలు ఎవరు గమనించలేదని మనమనుకోవచ్చు కానీ దేవుడు గమనిస్తున్నాడు తప్పక మన పాపమే మనలను బట్టబయలు చేస్తుంది*. 🤦‍♀️ *మన పాపమే మనలను పట్టుకుంటుంది*. *ఈ లోకములో మోసము చేసినవారిని లేక దొంగతనము చేసినవారిని పోలీసు వారు చాల సులువుగా పట్టుకుంటున్నారు. ఎంతటి గజ దొంగనైనా సరే దొంగతనంలో ఎంత నైపుణ్యము కలిగినవారినైనా సరే ఒక్క దొంగతన విషయములోనే కాదు ఏ విషయములోనైనా కానివ్వండి చాల త్వరగా పట్టుకుంటున్నారు. కారణము సీసీ కెమెరాలు వుండడము ద్వారా అవునంటారా*! 📸 *ఈ సీసీ కెమెరాలు ప్రతి మనిషిని పట్టిస్తున్నాయి. మరి దేవుని కన్నులు సీసీ కెమెరాలకంటే కొన్ని కోట్లరెట్లు ఎక్కువ..సీసీ కెమెరాల నుండే తప్పించుకోలేకపోతే మరి నిన్ను,నన్ను కలుగజేసిన దేవుని కన్నులనుండి మనము తప్పించుకోలేము. మనిషి దేవునిని మోసము చేయడానికి ప్రయత్నములు చేస్తున్నాడు*. 🙍‍♂️ *కయీను,హేబెలును చంపాడు..కారణము కయీను అర్పణను దేవుడు అంగీకరించలేదు. కయీను తమ్ముడైన హేబెలు అర్పణను దేవుడు అంగీకరించాడని దేవునిమీద కోపము పెట్టుకున్నాడు. దేవునిమీద కోపపడితే మనకే కదా నష్టము. కయీను దేవునిని ఏమి చేయలేక తన తమ్ముడైన హేబెలుమీద ఆ కోపమును చూపించి హేబెలును చంపేస్తాడు*. ✍ *అప్పుడు కయీను అనుకున్నాడు. నేను నా తమ్మునిని చంపిన సంగతి ఎవరు చూడలేదనుకున్నాడు. కానీ దేవుడు చూశాడు. అప్పుడు దేవుడు అడుగుతున్నాడు.* కయీను నీ తమ్ముడు ఎక్కడఉన్నాడు. అని కయీనును అడిగాడు. అప్పుడు కయీను నేను నా తమ్మునికి కాపలా వున్నానా నన్ను అడుగుతున్నారు అని సమాధానమిస్తాడు. కయీను దేవునిని కూడా మోసము చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నాకేమి తెలుసు నేను కాపల వున్నానా అని అంటున్నాడు. దేవుడు కయీనును అడుగుతున్నాడు. అప్పటికైనా చంపిన సంగతిని ఒప్పుకుంటాడేమో అని అనుకున్నాడు కానీ పాపమును ఒప్పుకోక అబద్ధములు చెప్పి నాకేమి తెలుసు అని దేవుని కన్నులనే మోసము చేయాలనుకున్నాడు. (ఆది 4:9) 🤷‍♂️ *ప్రియ సహోదరి,సహోదరులారా! కయీను చేసిన పాపమును ఒప్పుకోక దేవుని కన్నులనే కప్పిపుచ్చేదానికి ప్రయత్నములు చేస్తున్నాడు*. *మన పాపమును దేవుడు అందరియెదుట బట్టబయలు చేయకముందే దేవునిసన్నిధిలో కన్నీరువిడిచి పశ్చాత్తాపపడితే అయన కనికరించి నీతిమంతులుగా మారుస్తాడు. అంతేకాని దేవుడు మన పాపమును బట్టబయలు చేసేంతవరకు ఉన్నామనుకొండి ఆ తరువాత సమాజములో నీవు భక్తిపరుడిగా ప్రార్థన పరుడిగా కనబడిన ఆఆ మోసము బయటపడుతుంది*. సమాజములో ఒక దోషిగా నిలబడవలసి వస్తుంది. సిగ్గుతో తల దించుకొని జీవించవలసి వస్తుంది. ✍ *చెప్పేదానికి చాల విషయములున్నాయి*. *సహోదరి సహోదరులారా! ఇప్పటికైనా పాపమును గ్రహించు ఇంతవరకు అందరిని మోసము చేసి బ్రతుకుతున్నాను నాలాంటి తెలివిగలిగినవారు ఎవరు లేరు అని నీవు మిడిసిపోవద్దు. చేసిన పాపమును ఒప్పుకో. దేవుని కన్నులనుండి నేను తప్పించుకోలేను అని గ్రహించు ..నీ ఇంటిలోవున్నవారిని మోసము చేసి బ్రతకిన దినములు ఇక చాలు..కన్నీరు విడిచి ప్రభువు సన్నిధిలో ప్రార్థించు మోసపు బ్రతుకును విడిచిపెట్టి దేవుని ఎదుట యధార్థముగా జీవించే మనసును కలిగివుండు తప్పక దేవుడు కనికరించి కాపాడుతాడు*. 🙇‍♀️ *ప్రభువు సన్నిధిలో తగ్గించుకునేవారు ఎవరో తెలుసా? చేసిన పాపము కొరకు కన్నీరు విడిచి ఒప్పుకొని విడిచిపెట్టేవారు తగ్గిచుకునేవారు వారే యధార్థపరులు. ఇప్పటికైనా జాగ్రత్తగా జీవించుదాము. నిందారహితులుగా బ్రతుకుదాము. కుటుంబములో సమాధానము సంతోషముతో బ్రతుకుదాము. దేవుని కరకు సాక్షులుగా జీవించుదాము.దేవుని కృప మనకు తోడై ఉండును గాక* ఆమెన్! దేవుడు మిమ్ములను మీ కుటుంబమును దీవించును గాక! మీ సహోదరుడు పాస్టరు బి.స్టీఫెన్ పాల్ IPC church పుట్లూరు,తాడిపత్రి,అనంతపురం 9618361226 #✝జీసస్ #సండే ప్రేయర్స్ ✝ #💑 కపుల్ గోల్స్ #😥మనసులోని బాధ💔 #💝కుటుంబ బంధం
✝జీసస్ - ATECOSTAL ೩ అంశమర @॰@6@%8&33@ మనుషులను మోసము చేసినంత సుళువు కాదు, దేవునిని మోసము చేయడము! ATECOSTAL ೩ అంశమర @॰@6@%8&33@ మనుషులను మోసము చేసినంత సుళువు కాదు, దేవునిని మోసము చేయడము! - ShareChat