#jesu #యేసు ప్రభువు #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #JESU I LOVE YOU JESUS #i love jesu #✝️Jesu✝️
#Jesus #✝️Jesu✝️ #JESU I LOVE YOU JESUS #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #jesu #యేసు ప్రభువు
*నీవు బ్రతకాలంటే..!!*
*ఈ రోజుల్లో చాలామంది సేవకులు కావొచ్చు, విశ్వాసులు కావొచ్చు, క్రైస్తవుడినని చెప్పుకుంటున్న ఎవరైనా కావొచ్చు... అలాంటి వారు చేసే ఘోరమైన పాపిష్టి పనియేమిటో తెలుసా? బైబిల్ను ఇంట్లో పెట్టుకుంటారు, చంకలో పెట్టుకుని తిరుగుతారు కానీ ఆ బైబిల్ను తెరిచి చదవడానికి ఇష్టపడరు. ఎప్పుడో గుర్తుకు వచ్చినప్పుడు, ఏదో బాధ కలిగినప్పుడు మాత్రమే అలా చదివి, ఇలా వదిలేస్తారు. అంటే వారి ఇష్టం వచ్చినప్పుడు ఏదో చదవాలి కదా? అని అలా చదువుతారు. మరీ ఇలాంటి వారు సేవకులేనా? విశ్వాసులేనా? క్రైస్తవుడేనా? ఇలాంటి వారిని ఏమానాలి? సైతాను బిడ్డలని అనడం ఏమాత్రం తప్పులేదు. మరీ దేవుని బిడ్డలని చెప్పుకోవడానికి ఏం చేయాలని ఆలోచలోపడ్డారా? అయితే విను!!*
*బైబిల్లోని ద్వితీయోపదేశకాండములో స్పష్టంగా లిఖించబడి ఉంది, ''నీవు ఊపిరితో ఈ భూమిపై ఉన్నంతవరకు బైబిల్ (పరిశుద్ధగ్రంథము)ను చదవాలి'' ప్రతిరోజు క్రమం తప్పకుండా బైబిల్ను చదవాలి, ఆ విధంగా బైబిల్ చదివేవారు మాత్రమే దేవుని బిడ్డలని అనుటకు, దేవుని బిడ్డలని పిలిపించుకోవడానికి అర్హులు. మరీ ఈ రోజు దేవుడు నిన్ను ఊపిరితో బ్రతుకునిచ్చాడు కదా? అయితే ఈ రోజు బైబిల్లోని ఎన్ని ఆధ్యాయాలు ధ్యానించావు? దేవుడు నీ జీవితంలో మంచి కార్యాలు చేయాలంటే.. ప్రతిరోజు మనస్ఫూర్తిగా బైబిల్ను ధ్యానించాల్సిందే.*
*ప్రతిరోజు క్రమంగా బైబిల్ను చదవకుండా.. నీవు ప్రతి ఆదివారం మందిరానికి వెళ్లినంతమాత్రానా, ఇంటింటికి తిరిగి సువార్త చెప్పినంత మాత్రానా, పేదవారికి నీవు ఎంత డబ్బు సహాయం చేసినంత మాత్రానా, దినమంతా మందిరంలో నివసించినంత మాత్రానా, దినంలో ఎక్కువగా దేవుని పాటలు పాడినంత మాత్రానా, ఎక్కువ సమయం ప్రార్థించినంత మాత్రానా, అలాగే ప్రతిదినం క్రమం తప్పకుండా బైబిల్ చదవకుండా సేవకుడినని చెప్పుకుంటూ.. ఇంటింటికి తిరిగినంత మాత్రానా, అదే రీతిగా స్టేజీలపై ప్రసంగాలపై ప్రసంగాలు దంచికొట్టినంత మాత్రానా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడు. ఏంటి బ్రదర్? మీరు ఇంత కచ్చితంగా ఎలా చెప్పగల్గుతున్నారని నన్ను ప్రశ్నిస్తున్నారా? అయితే విను..*
*''నీవు బ్రదుకు దినములన్నియు పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలనేది దేవుని యొక్క ఆజ్ఞ కదా? మరి దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడం పాపమే కదా? అంటే ప్రతిరోజూ నిన్ను బ్రతికిస్తున్న దేవుడు చెప్పిన పని చేయకపోవడం తప్పే కాదా? పరిశుద్ధ గ్రంథాన్ని చదవమని చెప్పిన దేవుని యొక్క ఆజ్ఞను పక్కనపెడుతూ... నీవు ఎన్ని మంచి పనులు చేసినా ఏం ప్రయోజనం? ఫలితం శూన్యమే కదా? అందుకే నా రెండు చేతులు జోడించి కన్నీటితో చెబుతున్నాను..*
*ప్రియ సహోదరి, సహోదరుడా!! ప్రతిదినం వేకూజామునే నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. అంటే కనీసం ఉదయం 5 గంటలకు నిద్రలేచి 2 అధ్యాయాలు బైబిల్ చదవండి, 20 లేదా 30 నిమిషాలు ప్రార్థన చేయండి, అలాగే రాత్రి నిద్రించే ముందు రెండు అధ్యాయాలు బైబిల్ చదవండి, 20 లేక 30 నిమిషాలు ప్రార్థించండి. ప్రతిదినం ఇలా చేయడం వలన దేవునిపై, ఆయన వాక్యంపై, ప్రార్థనపై నీకు శ్రద్ధ పెరుగుతుంది. తద్వారా నెలలు గడిచిపోయేకొలది నీవు మరింత ఎక్కువగా బైబిల్ చదవడానికి, ఎక్కువసేపు ప్రార్థించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు నీవు ఎటువంటి భయంకరమైన సమస్యకైనను భయపడవు, ధైర్యంగా విశ్వాసంతో దేవునిపై ఆధారపడి బ్రతికే మనసును కల్గివుంటావు. ఈ విధానాన్ని.. ఇది చదువుతున్న నీవు ప్రతిదినం క్రియల్లో పెడుతూ.. దేవుడు చేసే మహా గొప్ప అద్భుతకార్యాలను కళ్లారా చూడాలని నా మనవి. ''నీవు బ్రదుకు దినములన్నిటను ఆ గ్రంథమును (బైబిల్) చదువుచుండవలెను.'' (ద్వితీ 17: 20)*
******************************************
*ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!*
*WhatsApp Community - 1 link:*
https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD
***************************************
*Telegram group Link*
https://t.me/+XtII92fKOXAyNWQ9
********************************
*యూట్యూబ్ ఛానల్ లింకు*
https://www.youtube.com/@calvarykiranalu-l7t
********************************
*మీ ప్రార్దన అవసరతను నా నెంబర్ కు మెసేజ్ చేయండి.... మీ ప్రార్దన మనవిని మన అన్నీ గ్రూప్స్ లో నేనే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ సమస్యపై మన గ్రూప్స్ సభ్యులందరూ ప్రార్దన చేస్తారు. మనకు కావల్చింది వాక్యం, ప్రార్దన.*
*- మీ సహోదరుడు మోషే*
*- (Calvary Kiranalu )*
*-(📲 9550576444)*
************************************
#jesu #యేసు ప్రభువు #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #JESU I LOVE YOU JESUS #✝️Jesu✝️ #Jesus
#JESU I LOVE YOU JESUS #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #Jesus #✝️Jesu✝️ #jesu #యేసు ప్రభువు
#Jesus #i love jesu #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #jesu #యేసు ప్రభువు #JESU I LOVE YOU JESUS
*ఆ దాపరికమే నీ జీవితాన్ని మట్టిపాలు చేసేస్తుంది..!!*
భర్తకు తెలియకుండా భార్యలు. భార్యకు తెలియకుండా భర్తలు. తల్లిదండ్రులకు తెలియకుండా కొడుకులు, కుమార్తెలు. కుమారులు, కుమార్తెలకు తెలియకుండా తల్లిదండ్రులు. అత్తామామలకు తెలియకుండా కోడళ్లు... పాపిష్టి పనులు చేస్తూ, అలాగే చేయకూడని పనులు చేస్తూ... దాపరికాల్లో మునిగితేలుతున్నారు. చివరికి ఆ దాపరికాలే వారి జీవితాలను సర్వనాశనం చేస్తున్నాయి. దాపరికం అనేది మనిషిని ఎంత నీచమైన స్థితికైనా దిగజారుస్తుందనే విషయాన్ని గుర్తిస్తే చాలా మంచిది. ఆ రోజు అవ్వ, ఆదాము దాపరికమే వారి నాశనానికి దారితీసింది. అలాగే ఆ రోజు కయీనూ దాపరికమే.. దేశదిమ్మరిగా ముద్రించాల్సి వచ్చింది. అవును ఈ రోజుల్లో చాలామంది జీవితాలు నాశనం కావడానికి కారణం... దాపరికమే. ఆ దాపరికం వల్లే కుటుంబాలు విచ్ఛినం అవుతున్నాయి. ఆ దాపరికమే కలిసివుండవల్చిన భార్యభర్తలు ఎడబాసి వుంటున్నారు. ఆ దాపరికంతోనే ఎంతో మంది కోడళ్లు అత్తామమలకు దూరంగా ఉంటూ... సమాజంలో విలువలేని జీవితాలు ఎంతోమంది జీవిస్తున్నారు. ఆ దాపరికాలతో ఎంతోమంది కొడుకులు తల్లిదండ్రులకు దూరమైపోతున్నారు. ఆ దాపరికాలతోనే ఎంతో మంది తల్లులు, తండ్రులు కొడుకులకు, కుమార్తెలకు దూరంగా జీవిస్తూ... అంధకారంలో మగ్గిపోతున్నారు.
ఉద్యోగం అంటూ ఇంటి నుంచి బయటకు వెళ్లిన భార్యలు తమ ఇష్టానుసారంగా జీవిస్తూ... తమ శరీరాలను తాకట్టు పెడుతూ.. బరితెగిస్తూ.. జీవించే వారు చాలామంది వున్నారు. ఇప్పటివరకు ఏం చేశావ్? అని భర్త ప్రశ్నిస్తే... తను చేసిన ఆ పాపిష్టి పనులను దాస్తూ... ఏమీ తెలియనట్టుగా తమ భర్తలకు మాయ మాటలు చెబుతూ... ఎంతమంది దాపరికంలో మగ్గిపోవడం లేదు. ఈ బంగారం ఎక్కడిది? ఇన్ని చీరలు ఎలా కొంటున్నావు?, ఇంత డబ్బు నీకు ఎక్కడనుంచి వస్తుంది? అని భర్త ప్రశ్నిస్తే... అసలు విషయాలను కప్పెస్తూ... దాచేస్తూ... ఏవేవో చెబుతూ.. తమ భర్తల కళ్లను కప్పే భార్యలు ఎంతమంది లేరు. అలాగే ఇప్పటివరకు ఎక్కడి పోయావు అని తమ భర్తలను భార్యలు ప్రశ్నిస్తే... బయటకు వెళ్ళి ఎన్నో పాడు పనులు చేస్తూ... మాయ మాటలతో తమ భార్యలను మోసం చేసే భర్తలు ఎంతమంది లేరు. బయట ఎదో పని వుందని చెప్పి... ఇంటి నుంచి బయటకు వెళ్లిన భర్తలు... ఎంతమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేయడం లేదు. ఎన్ని గబ్బు పనులు చేయడం లేదు. ప్రశ్నించిన భార్యకు మాయమాటలు చెప్పి ఎంతమంది భర్తలు కాలాన్ని గడిపేయడం లేదు.
అలాగే కోడళ్లు విషయానికొస్తే... ఇప్పటివరకు ఎక్కడకు వెళ్ళావు అని అత్తామామలు ప్రశ్నిస్తే... బయట చేస్తున్న ఆ పాడు పనులను కప్పెడుతూ.. దాచిపెడుతూ... అత్తామామలను మోసం చేసే కోడళ్లు ఎంతమంది లేరు. బయటకు వెళ్లి ఏం చేశావ్? ఇప్పటివరకు ఎక్కడి వెళ్లావు? అమ్మా, నాన్న అని కొడుకులు, కుమార్తెలు ప్రశ్నిస్తే... పరాయి పురుషులతో, పరాయి స్త్రీలతో చేస్తున్న ఆ అడ్డమైన పనులను దాచిపెడుతూ... ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డలను మోసం చేయడం లేదు. కాలేజీ అంటూ వెళ్తున్నావు?, ట్యూషన్ అంటూ ఇంటినుంచి బయటకు వెళ్తున్నావు? కోచింగ్ సెంటర్ అంటూ వెళ్తున్నావు? స్కూల్ అంటూ వెళ్తున్నావ్? అలాగే ఏదో పనంటూ బయటకు వెళ్తున్నావు? ఇంత సమయం వరకు ఏం చేశావ్? అని తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రశ్నిస్తే.... బయట చేస్తున్న ఆ గబ్బు పనులను, ఆ వ్యభిచారాన్ని, ఆ తిరుగుబోతు తనాన్ని దాచిపెడుతూ... తమ తల్లిదండ్రులను మాయ చేసే బిడ్డలు ఎంతమంది లేరు.
జాగ్రత్తగా వినండి..!! తమ తమ్ముడిని చంపిన కయీనును దేవుడు ప్రశ్నించాడు. కయీనూ నీ తమ్ముడు ఎక్కడ? అంటే చేసి ఆ పాపాన్ని దాచిపెట్టి, ఏం తెలియనట్టుగానే దేవునికి మాయమాటలు చెప్పాడు. చేసిన ఆ పాపాన్ని ఒప్పుకోకుండా... ఆ పాపాన్ని దాచిపెట్టిన విధానమే అతన్ని జీవితాన్ని నాశనం చేసింది. అలాగే అవ్వను, ఆదామును దేవుడు ప్రశ్నించాడు. ఆదామా..? ఎందుకు ఆ పండు తిన్నావు? అంటే... చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా... దాచిపెట్టేశాడు... ఆ దాపరికమే ఆదాము, అవ్వల జీవితం నాశనమైంది. నీ భర్త వద్ద లేక నీ భార్య వద్ద, నీ బిడ్డల వద్ద, అలాగే నీ అత్తామామల వద్ద, నీ కోడళ్లు వద్ద పాపాన్ని దాచిపెడుతూ... ఎదురు మాటలు మాట్లాడుతున్నావేమో... జాగ్రత్త... ఆ రోజు కయీను, ఆదాము, అవ్వలకు పట్టిన గతే నీకు పడుంది. నీ పాపిష్టి జీవిత దాపరికాన్ని బట్టి శిక్ష అనుభవివిస్తున్నావేమో..!! ఎందుకని నీ యొక్క పాపాన్ని దేవుని వద్ద ఒప్పుకుని మరల నూతన జీవితం జీవించకూడదు..!!
‘‘యెహోవా నీ తమ్ముడైన హేబెలు ఎక్కడున్నాడని కయీను నడుగగా అతడు నేనెరుగను; నా తమ్మునికి నేను కావలివాడనా అనెను.’’ (ఆది 4:9). (ఇక్కడ కయీను తమ్ముడిని చంపిన విషయాన్ని దాచిపెట్టాడు). ‘‘నీవు దిగంబరివని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా? అని అడిగెను. అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నా కియ్యగా నేను తింటిననెను.’’ (ఆది 3:11,12). (ఇక్కడ ఆదాము చేసిన తప్పును దాచిపెట్టాడు. ఆ తప్పును ఒప్పుకోకుండా తన భార్యపైకి నెట్టేశాడు.).
*************************************
*ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!*
*WhatsApp Community - 1 link:*
https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD
***************************************
*Telegram group Link*
https://t.me/+XtII92fKOXAyNWQ9
********************************
*యూట్యూబ్ ఛానల్ లింకు*
https://www.youtube.com/@calvarykiranalu-l7t
********************************
*మీ ప్రార్దన అవసరతను నా నెంబర్ కు మెసేజ్ చేయండి.... మీ ప్రార్దన మనవిని మన అన్నీ గ్రూప్స్ లో నేనే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ సమస్యపై మన గ్రూప్స్ సభ్యులందరూ ప్రార్దన చేస్తారు. మనకు కావల్చింది వాక్యం, ప్రార్దన.*
*- మీ సహోదరుడు మోషే*
*- (Calvary Kiranalu )*
*-(📲 9550576444)*
************************************
#✝️Jesu✝️ #jesu #యేసు ప్రభువు #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #i love jesu #Jesus
*హఠత్తుగా వ్యాధిబాధలు, కరవుకాటకాలు, నష్టాలు వస్తే*...!!
*హఠాత్తుగా ఆ దేశం మీదకి కరువు వచ్చి పడింది. జీవనం దినదిన గండంగా మారింది. పూట గడవడం కష్టమైపోయింది. కుటుంబాన్ని పోషించవలసిన భర్తకు మిగిలింది ఒకే ఒక ప్రశ్న ఇప్పుడు ఏం చేయాలి? ఎలా కుటుంబాన్ని పోషించాలి? ఏం చేయాలో పాలు పోలేదు. తన ముందు ఏ మార్గము కనబడని సందిగ్ద పరిస్థితి! ఈ పరిస్థితిలో మీరుంటే ఏం చేస్తారు? మీరు క్రైస్తవులైయుండి హఠాత్తుగా మీ ఇంటిమీదికి కష్టమో, కరువో, ఆర్థిక ఇబ్బందో వచ్చి పడితే మీరు ఏ విధముగా దానిని ఎదుర్కొంటారు? అతనేం చేశాడంటే... మూటాముల్లె కట్టుకుని, ‘బెత్లెహేము’ (అంటే రొట్టెల ఇల్లు)ను విడిచిపెట్టి శాపగ్రస్తమైన, దైవ భయమ లేని అన్య దేశమైన మోయాబు దేశానికి ప్రయాణమయ్యాడు. (రూతు 1:1-4) బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. ఎందుకు రొట్టెల ఇంటికి కరువు వచ్చి పడింది? ఇశ్రాయేలును కాపాడుచు కనుకక నిద్రపోక అనుదినము వారి భారము భరించు దేవున్ని కలిగియుండి కూడా ఎందుకు ఆ దేశానికి కరువు? కారణం: ‘‘ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను’’ (న్యాయాధి 21: 25). దాని తరువాత వచనమే (రూతు 1:1)లో న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా....*
*అవును, ఎప్పుడైతే మనుష్యులు తమ ఇష్టానుసారముగా దేవునియందు భయభక్తులు లేకుండా జీవిస్తారో తమ కుటుంబాల్లో, వారి పనిపాటల్లో దేవునికి చోటివ్వకుండా వారికిష్టం వచ్చినట్లు జీవించినప్పుడు కరువులు, ఇరుకులు, ఇబ్బందులు, రోగాలు, వ్యాధులు హఠాత్తుగా వచ్చి పడతాయి. ‘‘ఆకాశామా ఆలకించుము భూమీ చెవియొగ్గుము- నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నా మీద తిరుగబడి యున్నారు. ఎద్దు తన కామమందు నెరుగును, గాడిద తన సొంతవానిని దొడ్డి తెలిసికొనును. ఇశ్రాయేలుకు తెలివిలేదు, నాజనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానామా, చెరుపుచేయు పిల్లలారా మీకు శ్రమ. వారు యోహోవాను విసర్జించి యున్నారు. ఆయనను విడిచి తొలగిపోయి యున్నారు. నిత్యము తిరుగుబాటు చేయుచు మీరేలఇంకను కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి గలిగియున్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యెను. అరికాలు మొదలుకొని తలవరకు స్వస్థత కొంచెమైనను లేదు.’’ (యెషయా 1:2-6).*
*‘‘మీరు విస్తారముగా విత్తినను మీకు కొచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, కష్టము చేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా వున్నది’’ (హగ్గయి 1:6) ‘‘మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి’’ అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. (హగ్గయి 1:7) గమనించారా? మన ఇష్టానుసారముగా జీవించినప్పుడు దేవునికి వ్యతిరేకముగా బ్రతికినప్పుడు మన జీవితాలు మనకు తెలియకుండానే కష్టాలపాలౌతాయి. నష్టాలు కొనితెచ్చుకుంటాము. యెహోవా సెలవు లేక భోజనముచేసి సంతోషించుట ఎవరికి సాధ్యము? (ప్రసంగి 2:25) ఆయన సెలవులేక ఆయన కృపలేకుండా ఈ లోకంలో ఏ జీవి మనజాలదు. ‘‘తగిన కాలమున నీవు వాటికి ఆహారమిచ్చెదవని ఇవన్నియు నీ దయకొరకు కనిపెట్టుచున్నవి. నీవు దయకొరకు కనిపెట్టుచున్నవి. నీవు నీ గుప్పిలిని విప్పగా అవి మంచివాటిని తిని తృప్తి పరచబడును. నీవు ముఖము మరుగుచేసికొనగా అవి కలతపడును. (కీర్తన 104: 274-29) సర్వసృష్టి ఆయన దయమీద ఆధారపడి బ్రతుకుతుంటే స్వేచ్ఛాజీవి అయిన మానవుడు దేవుడు లేకుండా ఏవో సాధించాలని, ఏదైనా సాధించాలని, ఏదైనా సాధించగలనని భ్రమ చెందుతున్నాడు. ఆ భ్రమలోనే జీవిత పరమార్ధము తెలుసుకొనక దేవునిమీద ఆధారపడి సుఖవంతమైన జీవితాన్ని గడపక తనువు చాలించుచున్నాడు.*
*బెత్లెహేమునుండి దేవునికి దూరమై మోయాబు దేశానికి బ్రతకాలని వెళ్ళిన ఎలీమెలెకు తన భార్యను ఇద్దరు కుమారులను దిక్కుమాలిన వారిని చేసి చనిపోయాడు. తండ్రిని అనుసరించిన కుమారులు చివవరకు తమ ఇద్దరు భార్యలను దిక్కులేని వారిగాచేసి వారూ చనిపోయారు. బెత్లెహేము విడిచి దేవునికి దూరమై ప్రాణాలు పోగొట్టుకొనిన వీరినిచూసి జాగ్రత్త పడదాం. మనకు కరువు సంభవిస్తే, కష్టమువస్తే దానినుండి తప్పించుకోడానికి ప్రయత్నించక, అవి వచ్చిన కారణాన్ని గ్రహించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి జవాబు పొందుకుందాం. చివరికి దేవుడు దయతలచాడు. నమోమి పెనిమిటి లేనిదాయెను. ‘‘వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె (నయోమి) మోయాబు దేశంలో వినెను. గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. (రూతు 1:6-7) దిక్కులేని వారిని, కృంగిపోయిన వారిని, దర్శించి వారికున్న అక్కరను తీర్చేది మన ప్రభువైన యేసుక్రీస్తే. కనుక ఆయన్నే ఆశ్రయిద్దాం. మన కష్టాలు విడిచిపెట్టి ఆయన ఇష్టానుసారముగా జీవించి, ఆయన కరుణా హస్తాలక్రింద సుఖవంతంగా జీవిద్దాం. నా అంతట నేను ఏమియు చేయలేను. (యోహాను 5:30) అని ప్రభువే అంటుంటే దేవుడు లేకుండా మనమేమి చేయగలం?*
___________________________
*ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!*
*WhatsApp Community - 1 link:*
https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD
***************************************
*Telegram group Link*
https://t.me/+XtII92fKOXAyNWQ9
********************************
*యూట్యూబ్ ఛానల్ లింకు*
https://www.youtube.com/@calvarykiranalu-l7t
********************************
*మీ ప్రార్దన అవసరతను నా నెంబర్ కు మెసేజ్ చేయండి.... మీ ప్రార్దన మనవిని మన అన్నీ గ్రూప్స్ లో నేనే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ సమస్యపై మన గ్రూప్స్ సభ్యులందరూ ప్రార్దన చేస్తారు. మనకు కావల్చింది వాక్యం, ప్రార్దన.*
*- మీ సహోదరుడు మోషే*
*- (Calvary Kiranalu )*
*-(📲 9550576444)*
************************************
#JESU I LOVE YOU JESUS #jesu #యేసు ప్రభువు #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #i love jesu #Jesus
#✝️Jesu✝️ #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #jesu #యేసు ప్రభువు #Jesus #JESU I LOVE YOU JESUS
*భయంకరమైన సమస్య గుండా వెళ్తున్నావా?*
చాలామంది తమ కుటుంబాల్లో కష్టాలు, నష్టాలు, ఇరుకు ఇబ్బందులు అలాగే కుదరని వ్యాధులు, కుదరని సమస్యలు వచ్చినప్పుడు, వారు కలిగివున్న ఆ బాధలను తమ బంధువులతో, తమ చుట్టుప్రక్కల వారికితో లేక తమ స్నేహితులకు చెప్పుకుంటారు. నీ సమస్యను నీ తోటి వారికి చెప్పుకోవడం ద్వారా ఆ సమస్యకు పరిష్కారం దొరకదు. ఆ సమస్య సమస్యగానే మిగిలిపోతుంది. చివరకు ఆ సమస్యే నీ జీవితంలో పెనుతుఫానుగా మారి తీవ్ర భయాందోళనకు గురిచేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నీవు కలిగివున్న సమస్య, నీ నుంచి దూరం అవ్వాలంటే.. ఒక దేవునికి చెప్పుకుంటేనే సాధ్యం. కుటుంబ వ్యవస్థను నిర్మించింది దేవుడే. నీ కుటుంబాన్ని దేవుడు నిర్మించాడు కాబట్టి, నీ కుటుంబంలో మీరు కలిగివున్న ప్రతి సమస్యను మీ నుంచి దూరం చేయాలంటే ఆయనకే సాధ్యపడుతుంది.
భర్తగా, భార్యగా మీ ఇద్దరూ ఒక కుటుంబంగా ఏర్పడిన విషయంలో దేవుని పాత్ర ఉంది. అలాగే భార్యభర్తలుగా మీరు కుటుంబంగా ఏర్పడ్డ విషయంలో మీ స్నేహితులు, నీ బంధువులు, నీ తోటివారు పాత్ర లేనేలేదు. అలాంటప్పుడు నీ కుటుంబంలో కలిగివున్న సమస్యను వారికి చెప్పుకోవడం ద్వారా ఏం లాభం? ఉదాహరణ: మీ ఇంటిలో ఫ్రిజ్ చేడిపోయిందనుకోండి... ఎక్కడి తీసుకెళ్తారు? ఆ ఫ్రీజ్ను తయారు చేసిన వారి వద్దకు గానీ, లేక రిఫేర్ చేసేవారి వద్దకు తీసుకెళ్తేనే, పాడైపోయిన ఆ ఫ్రీజ్ బాగుపడుతోంది. అంతేకాని, ఒకవేళ వాచ్లు రిఫేర్ చేసి వారికి వద్దకు తీసుకెళ్తే ఆ ఫ్రీజ్ను బాగుచేయలేరు. అలాగే కుటుంబ వ్యవస్థను దేవుడే ఏర్పర్చాడు కాబట్టి, మీ కుటుంబలో కలిగివున్న ప్రతి సమస్యను మొదటగా దేవుని వద్దకు తీసుకెళ్లడం గొప్ప విషయం. మందిరానికి వెళ్తారు, బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు కానీ, వారి కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు మాత్రం మొదటగా మనుష్యల వద్దకు తీసుకెళ్తారు. ఈ విధానం క్రైస్తవులకు ఏ మాత్రం తగదు. అలాగే అలాంటి వారు దేవుని బిడ్డలు అని చెప్పుకోవడం కూడ చాలా దారుణం.
నీ భర్త నిన్ను దూరం చేసుకోవాలనుకుంటున్నాడా? నిన్ను విడిచి వేరు అమ్మాయితో సంసారం చేయాలనుకుంటున్నాడా?, పూర్తిగా నీకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడా? అలాగే నీ భర్త నిన్ను నానా రకాలుగా హింసిస్తున్నాడా? నీపై అనుమానంతో చిత్రహింసలకు గురిచేస్తున్నాడా?, చేయరాని పనులకు నిన్ను బలిపశువుగా మార్చేస్తున్నాడా? ఎవరితో మాట్లాడినా కానీ, అలాగే నీ బంధువులతో మాట్లాడిన కానీ వారితో నీకు అక్రమ సంబంధాన్ని అంటగడుతున్నాడా? తాగొచ్చి నిన్ను శారీరకంగా, మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడా? అలాగే నీ నుంచి నీ భార్య విడాకులు కోరుకుంటుందా? నీవు ఎవరితో మాట్లాడినాసరే వారితో నీకు నీ భార్య అక్రమసంబంధాలు అంటగడుతుందా? భర్తగా నీవు ఏం చెప్పినాసరే... నీకు ఎదురు మాట్లాడుతుందా? నీ మాటలు నీ భార్య లెక్కచేయడం లేదా? నీ ముందే పరాయి పురుషులతో నీ భార్య, చేయకూడని తప్పులు చేస్తుందా? పరాయి పురుషుల మోజులో పడి నీ భార్య, నిన్ను చిన్న చూపు చూస్తుందా?... ఈ సమస్యలు గుండా మీరు వెళ్తున్నట్లైతే...
మీ కుటుంబ వ్యవస్థను నిర్మించిన... దేవుని వద్దకు నీ సమస్యను తీసుకెళ్తేనే పరిష్కారం దొరుకుతుంది. అలాకాకుండా నీవు కలిగివున్న సమస్యను మనుష్యల వద్దకు తీసుకెళ్తే ఎటువంటి ప్రయోజనం వుండదు. అలాగే ఆ సమస్య తీవ్ర రూపం దాల్చి... మరింత పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంటుంది. మొదటగా నీవు కలిగివున్న సమస్యను దేవుడు చెప్పడం అలవాటు చేసుకో. దినంలో మొదటి ఘడియా దేవునితో ప్రారంభించు... ఆ ప్రారంభంలోనే నీవు కలిగివున్న సమస్యను దేవునితో చెప్పడం అలవాటు చేసుకో. తన కొడుకు చనిపోయాడన్న విషయం తెలుసుకున్న దావీదుకు...పెద్ద సమస్య వచ్చి పడింది. ఆ సమస్య కలిగివున్న దావీదు ఏం చేశాడో తెలుసా? తన కుమారుని శవం వద్దకు వెళ్లలేదు. తిన్నగా దేవుని మందిరానికి వెళ్లాడు. దావీదు చేసిన పాపం బట్టి, క్షమాపణ కోసం దేవున్ని బతిమాలుకున్నాడు. తద్వారా అప్పటి నుంచి ప్రశాంతంగా బ్రతకగలిగాడు.
ఈరోజు భార్యభర్తలుగా మీరు సమస్యలు కలివుండటానికి కారణం.. మీరు చేసిన ఆ పాపమేనేమో..!! ఆ తప్పు విషయంలో, అలాగే ఆ పాపం విషయంలో దేవుని వద్ద క్షమాపణ అడిగి, భార్యభర్తలుగా ఎందుకు ఈరోజు సమాధానం పడకూడదు?. " మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు '' (కీర్తనలు 118: 8).
**************************************
*ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!*
*WhatsApp Community - 1 link:*
https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD
***************************************
*Telegram group Link*
https://t.me/+XtII92fKOXAyNWQ9
********************************
*యూట్యూబ్ ఛానల్ లింకు*
https://www.youtube.com/@calvarykiranalu-l7t
********************************
*మీ ప్రార్దన అవసరతను నా నెంబర్ కు మెసేజ్ చేయండి.... మీ ప్రార్దన మనవిని మన అన్నీ గ్రూప్స్ లో నేనే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ సమస్యపై మన గ్రూప్స్ సభ్యులందరూ ప్రార్దన చేస్తారు. మనకు కావల్చింది వాక్యం, ప్రార్దన.*
*- మీ సహోదరుడు మోషే*
*- (Calvary Kiranalu )*
*-(📲 9550576444)*
************************************
#i love jesu #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #JESU I LOVE YOU JESUS #Jesus #✝️Jesu✝️
*యాయీరు కుమార్తెను బ్రతికించుట*
ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నాకుమార్తె యిప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమెమీద ఉంచుము, ఆమె బ్రదుకుననెను. యేసు లేచి అతని వెంట వెళ్లెను; ఆయన శిష్యులు కూడ వెళ్లిరి. అంతలో యేసు ఆ అధికారి యింటికి వచ్చి, పిల్లన గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి ..... స్థలమియ్యుడి; ఈ చిన్నది నిద్రించుచున్నదేగాని చనిపోలేదని వారితో చెప్పగా వారాయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి, ఆయన లోపలికి వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటను వ్యాపించెను. (మత్తయి 9:18 - 26; లూకా 8:40-56)
1. యాయీరు అధికారి:
యాయీరు ఒక అధికారి అయినప్పటికీ, ప్రభువుకున్న అధికారం తనవంటిదికాదని గ్రహించగలిగాడు. ఆయన అధికారమునకు ఒప్పుకొని, ప్రభువును బ్రతిమాలాడుతున్నాడు.
2. యాయీరు యొక్క అచంచలమైన విశ్వాసం:
నా కుమార్తె చనిపోయింది. అయిననూ, నీవు వచ్చి, నాకుమార్తె మీద చేయి వేస్తే? ఆమె బ్రతుకుతుంది. అని ప్రార్ధిస్తున్నాడు. ఈ మాటలు చూస్తుంటేనే అర్ధమవుతుంది. అతని విశ్వాసమెంతటి పరిపూర్ణమైనదో? తన కుమార్తె కొరప్రాణంతో లేదు. తను చనిపోయిందని అతనికి పూర్తిగా తెలుసు. అతనే ఆ విషయం చెప్తున్నాడు కూడా. గొల్లు చేయువారు వచ్చి ఏడ్వడం ప్రారంభించేసారు. అతని పనివారు అయ్యా, ఆయనను యిబ్బంది పెట్టవద్దు పాప చనిపోయిందికదా? చనిపోయిన ఆమెను ఈయనేమి చేయగలడు? అంటూ సలహాలిస్తున్నారు. “అయిననూ”, నీవు వచ్చి నా కుమార్తెను తాకితే తను బ్రతుక వచ్చేమో? ఒకసారి ప్రయత్నించి చూడు. అనడం లేదు. "బ్రతుకుతుంది". ఇది పరిపూర్ణమైన విశ్వాసం. పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు ఫలితం శూన్యం. “అయిననూ” నీమాట చొప్పున వల వేస్తాను. ఇదే విధేయత. విశ్వాసానికి విధేయత తోడైతే, విప్లవాత్మకమైన విజయాలు సాధ్యమవుతాయి.
3. యాయీరు కోరికను మన్నించిన ప్రభువు
నీవు పిలిస్తే దాటిపోయేవాడు కాదు మన ప్రభువు. చనిపోయిందికదా? వెళ్లి పాతిపెట్టుకో అని ఉచిత సలహా యివ్వలేదు. అతనిని ధైర్యపరిచారు. యేసు ప్రభువు వారు తన శిష్యులతో కలసి ఆ అధికారి ఇంటికి వెళ్లారు. అప్పటికి, పిల్లనగ్రోవులు వాయించేవారు, యేడ్చేవారు వారి పని వారు చేస్తున్నారు. ( ఆ కాలంలో వీరిని డబ్బులిచ్చి పిలిపించుకునే వారు) ప్రభువురాకతో కొందరైతే ఏమిజరుగబోతుందోనని ఆసక్తితో చూస్తుంటే, మరికొందరైతే చనిపోయిన ఆమెను ఇతడేమిచేయగలడని హేళనగా మాట్లాడుతున్నారు “ఈమె చనిపోలేదు నిద్రపోతుంది” అనే ప్రభువు మాటలు మరింత అపహాస్యం చేసేటట్లు చేశాయి. బైబిల్ గ్రంధములో మరణమును నిద్రతో పోల్చడం జరిగింది. నిద్రించిన వాడు తప్పక తిరిగి లేస్తాడు. ఒక వేళ మరణించినా ఆయన మధ్యాకాశములో నుండి, బూర ఊదినప్పుడు, ప్రభువు నందు మృతులైన మృతులు తప్పక లేస్తారు. వారికి ఆ మాటలు అర్ధం కాలేదు.
4. స్థలమియ్యుడి
ఆయన మర్యాదస్తుడు. త్రోసుకొని వెళ్ళేవాడుకాదు. స్థలమిస్తేనే ఆయన ప్రవేశిస్తారు. ఆయన ప్రవేశిస్తేనే అద్భుతకార్యం జరుగుతుంది. అక్కడ అదే జరిగింది కూడా. మన జీవితాల్లో ప్రభువుయొక్క ఆశ్చర్యకార్యాలను ఎందుకు చూడలేకపోతున్నాము? పేతురు దోనెలో ఆయనకు స్థలముంది. మన హృదయంలో ఆయనకు స్థలముందా? *ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపుతీసిన యెడల, నేను అతనియొద్దకు వచ్చి అతనితో నేనును, నాతోకూడ అతడును భోజనము చేయుదుము*. (ప్రకటన 3 :20) నీ హృదయమనే తలుపు తీసి ఆయనకు స్థలమిస్తే? నీ జీవితమంతా సమాధానమే. ఆయన మహిమను నీవు కళ్లారా చూస్తావు. అనుభవిస్తావు.
5. చనిపోయిన బిడ్డను బ్రతికించిన ప్రభువు:
యేసు ప్రభువు వారందరిని బయటకు పంపివేసి, ఆయన లోపలికి వెళ్లి, ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచింది. వారిని బయటకు పంపించడం దేనికి? వారి మధ్యనే ఆ చిన్నదానిని బ్రతికించవచ్చు కదా? ఎందుకంటే? ఆయనను ఎగతాళి చేసినవారు, ఆయన కార్యంలోని మహిమను చూచే అర్హతను కోల్పోతారేమో? సమస్యను చూచి, ఆయన శక్తిని శంకించి, మన జీవితాల్లోకూడా ఆయన ఆశ్చర్య కార్యాలను అనుభవించే ధన్యతను కోల్పోతున్నామేమో? మనలను మనమే పరిశీలన చేసుకోవాలి.
6. ముగింపు
మన ప్రార్ధన దేవుని నుండి సమాధానాన్ని తీసుకొని రాలేకపోతుందంటే? మన హృదయంలో ఆయనకు స్థలము లేదేమో? విశ్వాసం కొరవడిందేమో? ఆయనను ఇంకనూ అపహాస్యం చేసే సమూహంలోనే వున్నానేమో? అట్లా అయితే! నీ జీవితంలో ఆయన కార్యాలు చూడడం సాధ్యం కాదు. నీ హృదయమనే తలుపు తీసి ఆయనకు స్థలమిస్తే? నీ జీవితమంతా సమాధానమే. ఆయన మహిమను నీవు కళ్లారా చూస్తావు. అనుభవిస్తావు. ఆరీతిగా మన జీవితాలను
సిద్ద పరచుకుందాం! అట్టి కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక! ఆమెన్! ఆమెన్! ఆమెన్! ---- ( సేకరణ)
*****************************************
*ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!*
*WhatsApp Community - 1 link:*
https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD
***************************************
*Telegram group Link*
https://t.me/+XtII92fKOXAyNWQ9
********************************
*యూట్యూబ్ ఛానల్ లింకు*
https://www.youtube.com/@calvarykiranalu-l7t
********************************
*మీ ప్రార్దన అవసరతను నా నెంబర్ కు మెసేజ్ చేయండి.... మీ ప్రార్దన మనవిని మన అన్నీ గ్రూప్స్ లో నేనే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ సమస్యపై మన గ్రూప్స్ సభ్యులందరూ ప్రార్దన చేస్తారు. మనకు కావల్చింది వాక్యం, ప్రార్దన.*
*- మీ సహోదరుడు మోషే*
*- (Calvary Kiranalu )*
*-(📲 9550576444)*
************************************
#Jesus #✝️Jesu✝️ #JESU I LOVE YOU JESUS #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #i love jesu













