*సిస్టర్, బ్రదర్ అంటూనే.. పాడు పనులా?*
*ఈరోజుల్లో చాలామంది పిలుపులు పైకి బాగుంటున్నాయి కానీ, బుద్ధులు మాత్రం బాగోవటం లేదు, పైకి ఆత్మీయతను ఒలకపోస్తున్నారు కానీ లోపల నీచమైన కార్యాలు చేయడానికి తెగ ఎగబడే వారు లేరా. ఒకవేళ నీలో అటువంటి బుద్ధి ఉంటే.. వాటికి దూరం కావడం చాలా మంచిది. దేవుని చేత ఎలా సహోదరి ప్రేమ కలిగి ఉండాలో బైబిల్ లో మనం చూస్తాం. మరి నీవు దేవుని చేత సహోదరి ప్రేమ కలిగి ఉండటం నేర్చుకున్నావా? లేదా కామంతో నిండిపోయిన కోరికలతో పైకి మాత్రమే ప్రేమ కలిగిన వ్యక్తిగా నటిస్తూ.. పైకి మాత్రమే చక్కని పేర్లు పెడుతూ, చక్కని రిలేషన్ ఏర్పరచుకుంటూ.... లోపల మాత్రము నీచమైన ఆలోచనతో కూడిన మనిషిగా బతుకుతున్నావా?*
*మనం దేవుని హృదయం గలవారమైతే ఆయన ప్రేమ కలిగి జీవించాలి. బ్రదర్ అంటే బ్రదర్.. సిస్టర్ అంటే సిస్టర్ కావాలి. చెల్లి అంటే చెల్లిగానే చూడాలి, తమ్ముడు అంటే తమ్ముడు గానే చూడాలి, అన్నా అంటే అన్నయ్య గానే చూడాలి, అక్క అంటే అక్కగానే చూడాలి, కానీ ఈ రోజుల్లో చాలామంది చెల్లి, చెల్లి అంటున్నారు కానీ చివరకు చెల్లి అనే పదానికి వత్తు తీసి చెలిగా భావించేవారు ఎంతమంది లేరు, సిస్టర్ అంటూనే .. అదే సిస్టర్ తో అక్రమ సంబంధం ఏర్పరుచుకునే ఎంతమంది దుర్మార్గులు లేరు. జాగ్రత్త.. చివరికి దేవుడు నీకు జీవం లేకుండా, బ్రతుకు లేకుండా చేస్తాడు. దేవుడు నీ జీవితాన్ని ఆర్పేయబోతున్నాడు జాగ్రత్త!! ఆరోజు రాకమునుపే జాగ్రత్త పడితే మంచిది.*
*దేవుని చేత ఏర్పరచబడిన మనము ఎంత పరిశుద్ధంగా, ఎంత ఆత్మీయంగా, ఎంత పవిత్రంగా, ఎంతో బహు జాగ్రత్తగా జీవించాలో ఒక్కసారి ఆలోచించండి!! క్రైస్తవ విలువలను, క్రైస్తవ విశ్వాసమును, క్రైస్తవ వాక్యానికి జీవిత విధానమైన ఆధారాన్ని మనం ప్రతి రోజు ఘనపరిచేవారిగా ఉండాలి.*
*ప్రాముఖ్యంగా సేవలో ఉంటున్న వారు, పరిచర్యలో ఉంటున్న వారు బహు జాగ్రత్తగా ఉండాలి. సిస్టర్ అంటున్నప్పుడు సిస్టర్ గానే భావించు, బ్రదర్ అంటున్నప్పుడు బ్రదర్ గానే భావించు. నీ భార్య తప్ప ప్రతి ఒక్కరు నీకు సిస్టర్స్ కావాలి, నీ భర్త తప్ప ప్రతి ఒక్కరు నీకు బ్రదర్స్ కావాలి, నీలో వక్రపు ఆలోచనలుగాని, వక్రపు తలంపులుగాని, వక్రపు పిలుపులు గాని, వక్రపు చూపులు గాని దేవుని బిడ్డగా నీలో ఉండకూడదు. దేవుని బిడ్డలుగా జీవించడానికి మనం దేవుని మందిరంలోనికి అడుగు పెట్టాలి కానీ కామ కోరికలను తీర్చుకోవడానికి దేవుని మందిరాన్ని ఆశ్రగా తీసుకుంటున్నట్లయితే.. జాగ్రత్త! నీ దగ్గర ఉన్న దీప స్తంభాన్ని దేవుడు హఠాత్తుగా తీసేస్తాడు. ఆరోజు రాకముందు పై నీవు జాగ్రత్తపడు.*
*పైపై ప్రేమలు, పైపై ఆత్మీయత, పైపై నవ్వు, పైపై పిలుపులు, పైపై ఆప్యాయత, పైపై చిరునవ్వు మంచిది కాదు సుమా!! మనం సహోదరి ప్రేమ ఎలా కలిగి ఉండాలో దేవుని చేత నేర్పించబడ్డాం. నీవు ఎవరినైనా పలకరించాలంటే.. ప్రేమతో పలకరించు. నీ హృదయములో ఉన్న ఆత్మీయతను బట్టి పలకరించు. అంతేగాని వేషధారణ పలకరింపు, పలకరించాలి కాబట్టి పలకరించాలని, షేక్ హ్యాండ్ ఇవ్వాలి కాబట్టి షేక్ హ్యాండ్ ఇవ్వాలని అనుకోవడం దేవుని బిడ్డకు తగదు. బ్రతికున్న మూడునాలు నిజమైన దేవుని బిడ్డలుగా జీవిద్దాం, నిజమైన క్రైస్తవులుగా జీవిద్దాం, క్రీస్తును కలిగిన క్రైస్తవులుగా జీవిద్దాం!!*
*నీవు ఎవరిని పులకరించినా, ఎవరిని చూసి చిరునవ్వు నవ్వినా, ఎవరికి చేయూత ఇవ్వాలన్నా.. నటించడం మానేయండి. మనం దేవుని ప్రేమిస్తున్నాము అని చెబుతున్నట్లయితే.. మన సహోదరున్ని ప్రేమించాలి. కనిపించె సహోదరిని సహోదరుడుని ప్రేమించకపోతే.. ఇంటివారినే ప్రేమించకపోతే నీ దేవున్ని ఎలా ప్రేమించగలవు? నీ పక్కవారిని ఎలా ప్రేమించగలవు? ఒక్కసారి నిన్ను నీవు ప్రశ్నించుకో!!*
*********************************
*ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!*
*WhatsApp Community - 1 link:*
https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD
***************************************
*Telegram group Link*
https://t.me/+XtII92fKOXAyNWQ9
********************************
*యూట్యూబ్ ఛానల్ లింకు*
https://www.youtube.com/@calvarykiranalu-l7t
********************************
*మీ ప్రార్దన అవసరతను నా నెంబర్ కు మెసేజ్ చేయండి.... మీ ప్రార్దన మనవిని మన అన్నీ గ్రూప్స్ లో నేనే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ సమస్యపై మన గ్రూప్స్ సభ్యులందరూ ప్రార్దన చేస్తారు. మనకు కావల్చింది వాక్యం, ప్రార్దన.*
*- మీ సహోదరుడు మోషే*
*- (Calvary Kiranalu )*
*-(📲 9550576444)*
************************************
#JESU I LOVE YOU JESUS #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #i love jesu #Jesus #jesu #యేసు ప్రభువు
#JESU I LOVE YOU JESUS #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #jesu #యేసు ప్రభువు #Jesus #i love jesu
#jesu words #i love jesu #jesu #యేసు ప్రభువు #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #JESU I LOVE YOU JESUS
*నగ్నంగా ఉన్న వాటిని చూడటానికి పరుగులు పెట్టేవారు లేరా?*
*నగ్నంగా ఉన్న బొమ్మలను, నగ్నంగా ఉన్న స్త్రీలను, నగ్నంగా ఉన్న పురుషులను, అమ్మాయిలను అబ్బాయిలను, అందమైన వారిని చూడాలని తాపత్రయం పడేవారు లేరా? ఈ అలవాటు నీలో ఉన్నట్లయితే.. దేవుని చేత నలదిక్కుల నుంచి నలిపివేయబడతావు జాగ్రత్త!! దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని, దేవుడు నీకు ఇచ్చిన దేహాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఆధారం చేసుకుని అడ్డమైన పనులు చేస్తానంటే.. నలు దిక్కులు నుంచి దేవుడు నిన్ను ఏ విధంగా నలిపి వేస్తాడో నీవే కళ్ళారా చూస్తావు.*
*దావీదు లాంటి వాడికే తప్ప లేదండి! దావీదు లాంటివాడే ధీమాగా జీవిస్తూ.. ధైర్యంగా తప్పుచేసి ఆ తర్వాత నలుదిక్కుల నుంచి నలిపివేయబడ్డాడనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి!! యెహోవా హృదయానుసారుడైన దావీదు నలుదిక్కుల నుంచి నలిపివేయబడితే.. నిన్ను, నన్ను దేవుడు నలిపివేయకుండా ఎలా మౌనంగా ఉండగలడు? అందుకే జాగ్రత్త పడదాం!!*
*ఆనాడు దావీదు కలిగి ఉన్న అధికారాన్ని బట్టి, నేను ఏమి చేసినా, ఏ తప్పు చేసినా.. ప్రశ్నించేవారు ఎవరూ లేరు అనే ధీమాను బట్టి, తనకున్న ధైర్యాన్ని బట్టి తన దేహాన్ని పాపంతో నింపుకోవడానికి.. ఒక సైనికుడు యొక్క భార్యను ఇంటికి పిలిపించుకున్నాడు. ఆమెతో పాపం చేశాడు. అలా పాపం చేయడమే కాకుండా.. ఆ పాపాన్ని దాసి పెట్టే ప్రయత్నం చేశాడు. ఆ పాపాన్ని ఎవరూ ప్రశ్నించడానికి వీలు లేకుండా.. ప్రశ్నించే వ్యక్తిని బయట ఎవరికీ తెలియకుండా దారుణంగా హత్య చేయించాడు. చేసిన పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకోవడానికి బదులుగా, కప్పుకునే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా ఏమీ ఎరగనట్టుగా 9 నెలల పాటు గడిపేశాడు. పాపం చేసి కూడా, హత్య చేసి కూడా.. ఏమీ ఎరగనట్లుగా తాను ఎవరితో పాపం చేశాడో ఆ స్త్రీని ఇంటికి పిలిపించుకొని పెండ్లి కూడా చేసుకున్నాడు. అలాగే ఎవరికి తెలియకుండా తన పరిపాలన కంటిన్యూ చేశాడు. బహుశా దావీదు అనుకోని ఉంటాడు.. పాపాన్ని బహు తెలివిగా భలే కప్పేటేసానో, ఇక నాకు డోకా లేదని అనుకోని ఉంటాడు. దారుణం ఏంటో తెలుసా? దావీదు లాంటివాడే పాపం చేసి 9 నెలల పాటు దేవుని సన్నిధిలో కనిపించలేదు, దేవుని సన్నిధిలో మొరపెట్టలేదు. దేవుని సన్నిధిలో పశ్చాతాపపడలేదు. రోజురోజుకు దావీదు దేవునికి దూరమవుతున్న సమయంలో, రోజురోజుకు దావీదు దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్న సమయంలో.. ఇక లాభం లేదని నాతాను అనే ప్రవక్తను దావీదు వద్దకు పంపించి.. దావీదు పాపాన్ని దేవుడు బయటపెట్టించాడు. పాపం ఏదో ఒక రోజు బయటపడక తప్పదు.*
*జాగ్రత్తగా వినండి!! ఒక వ్యక్తి ఎవరికీ తెలియకుండా పాపం చేయొచ్చు, గుట్టుచప్పుడు కాకుండా పాపం చేయొచ్చు, అలాగే ఏ ఒక్కరూ కనిపెట్టలేనంతగా పాపం చేయొచ్చు. గుర్తుపెట్టుకో!! పాపాన్ని నీవు విడిచి పెట్టొచ్చు కానీ ఆ పాపం నిన్ను మాత్రము విడిచిపెట్టదని సత్యాన్ని మర్చిపోవద్దు. ఆ పాపం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. ఆ పాపం నీ తలంపుల్లో ఎప్పుడూ ప్రత్యక్షమై ఉంటుంది. నీవు చేసిన పాపం నీ కళ్ళేదుట కనిపించేటప్పుడు.. నీవు ప్రశాంతంగా జీవించడం సాధ్యం కాదు. నీవు చేసిన అన్యాయం కావచ్చు, నీవు చేసిన అక్రమం కావచ్చు, నీవు చేసిన అపవిత్రమైన పని కావచ్చు.. అవి ఎప్పుడూ నీ చుట్టూ ప్రదర్శనలు చేస్తూనే ఉంటాయి. బైబిల్ చదివిస్తుంది.. " అది నిన్ను వెంటాడుతుంది, నిన్ను పట్టుకుంటుంది"*
*"భక్తిహీనులు కదలుచున్న సముద్రమువంటివారు అది నిమ్మళింపనేరదు దాని జలములు బురదను మైలను పైకివేయును. దుష్టులకు నెమ్మదియుండదని దేవుడు సెలవిచ్చు చున్నాడు." (యెషయా 57:20,21). దుష్టులకు నెమ్మది ఉండదు. పాపం చేసేవారు నెమ్మదిని పోగొట్టుకుంటారు. సమాధానం పోగొట్టుకుంటారు. దావీదు తాను చేసిన పాపమును బట్టి సమాధానాన్ని పోగొట్టుకున్నాడు. పాపం చేసే వ్యక్తి మొదటగా దేవునితో సంబంధం పోగొట్టుకుంటాడు. తన చుట్టూ ఉన్న వారందరితో సమాధానం పోగొట్టుకుంటాడు. భక్తిహీనులు, పాపిష్టిలు నెమ్మదిగా ఉండడం సాధ్యం కాదు.*
*సాధారణంగా ఒక వ్యక్తి శక్తి కలిగి ఉన్నట్లయితే.. ఆ వ్యక్తి తనను తాను కంట్రోల్లో ఉంచుకోగలుగుతాడు. గుర్రాన్ని కంట్రోల్ చేయగలిగే శక్తి తనుకుంటే గుర్రం కంట్రోల్ లో ఉంటుంది. భక్తిహీనులు కదులుతున్న సముద్రం లాంటి వారు అంటే.. వారు కంట్రోల్ లేనివారు. వారి తలంపులు కంట్రోల్ ఉండదు, వారి పాపిష్టి చూపుల్లో కంట్రోల్ ఉండదు, వారి పాపిష్టి పనుల్లో కంట్రోల్ ఉండదు. వారి నోరు కంట్రోల్ ఉండదు, వారి కాలు కంట్రోల్లో ఉండదు, వారి కళ్ళు కంట్రోల్లో ఉండదు, వారి ఒళ్ళు కంట్రోల్లో ఉండదు. ఈరోజు చాలామంది కంట్రోల్ లేని జీవితం జీవిస్తున్నారు. దుష్టత్వము, పాపము నిన్ను కంట్రోల్లో ఉంచదు.*
******************************************
*ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!*
*WhatsApp Community - 1 link:*
https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD
***************************************
*Telegram group Link*
https://t.me/+XtII92fKOXAyNWQ9
********************************
*- మీ సహోదరుడు మోషే*
*- (Calvary Kiranalu )*
*-(📲 9550576444)*
#JESU I LOVE YOU JESUS #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #jesu #యేసు ప్రభువు #i love jesu #jesu words
#jesu words #i love jesu #jesu #యేసు ప్రభువు #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #JESU I LOVE YOU JESUS
#JESU I LOVE YOU JESUS #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #jesu #యేసు ప్రభువు #i love jesu #jesu words
#Jesus #jesu words #jesu #యేసు ప్రభువు #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #JESU I LOVE YOU JESUS
*బ్రతుకు భారంగా మారిందా?*
*ఆ ఇంటి యజమాని మరణించిన తరువాత ఆ తల్లి కూతురు జీవనం కొనసాగంచడం బహు కష్టంగా మారింది. డబ్బులు లేక చేతులు ఖాళీ, వంట గదిలో గిన్నెలన్నీ ఖాళీ కాని గుండె నిండా విశ్వాసం మాత్రం వుంది . ప్రతీ దినము దేవుడు మా భారమును మోస్తానన్నాడు, ఖచ్చితముగా ఈ దినము కూడా దేవుడు మా భారం మోస్తాడు, మాకు మార్గం తెరచి, మాకు కావలసిన ఆహారము ఇస్తాడు అని విశ్వసించింది, ప్రార్థించింది. దేవుడు తప్పక పోషిస్తాడని నమ్మి దగ్గరలో ఉన్న ఒక కిరణా షాప్ వద్దకు వెళ్ళి, ఆ షాప్ ఓనర్‌తో - అయ్యా..! నాకు నెలజీతం రావాలి, ఇంకా రాలేదు, త్వరలో ఇస్తాం అంటున్నారు. కానీ చూస్తే ఇంట్లో గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి. నా దేవునికి ప్రార్థన చేసాను ఆయన తప్పక ఈ ఆర్థిక ఇబ్బందిలో నుంచి నన్ను తప్పిస్తాడు. అప్పుగా కొంచెం రొట్టె ఇస్తే నా కుమార్తెను పోషించుకుంటాను. నా నెలజీతం రాగానే తిరిగి చెల్లించేస్తాను, దయతో ఇస్తారా' అని అడిగెను.*
*ఇప్పుడా యజమాని- నీ దగ్గర చిల్లిగవ్వలేదు కానీ ప్రార్థన చేస్తాను దేవుడిస్తాడంటున్నావ్? ప్రార్థన చేస్తే మీ దేవుడు జవాబు ఇస్తాడా? అని ప్రశ్నించగా అయ్యా..! నా దేవుడు తప్పక ప్రార్థనకు జవాబు ఇస్తాడు ఇందులో ఏ విధమైన సందేహం లేదు అని బదులిచ్చెను. అయితే ఒక పని చెయ్యి, నీవు నీ దేవునికి ఏం ప్రార్థన చేసావో ఒక చీటి మీద వ్రాసి నా కివ్వు ఆ ప్రార్థన ఎంత బరువు ఉంటే అంత రొట్టెను నీకిస్తాను. నీ దేవుడు ప్రార్థనకు జవాబు ఇస్తాడో లేదో చూస్తాను. అని ఆ యజమాని ఒక చీటి ఆ తల్లికి ఇచ్చెను. ఆ తల్లి అమాయకముగా ఆ చీటి మీద తన ప్రార్థనను వ్రాసి- అయ్యా..! నా దగ్గర ఏమి లేదు కానీ ఈ ప్రార్థన మాత్రం ఉది. ఇదిగో ప్రార్థన అని తక్కెటలో పెట్టింది.*
*అప్పుడా యజమాని రొట్టే పేకెట్లో ఉన్న ఒక చిన్న రాయి ముక్క తీసి ఆ తక్కెటలో రెండవ వైపు పెట్టాడు కాని తక్కెట ఏ మాత్రం కదలలేదు, కొంచెం భయంతో ఏమిటిది? అని అనుకొని ఇంకొక రొట్టే వేసాడు అయినా ఏ మాత్రం కదలిక లేదు. పేపర్ కన్నా రొట్టేనే బరువు ఉండాలి కదా..! ఇదేమీటి? అని అనుకొని ఒక్కొక్క రొట్టే వేస్తూ చివరికి పేకెట్ మొత్తం వేసాడు కానీ తక్కెట మాత్రం కొంచెం కూడా కదలలేదు. అప్పటికే ఆ షాప్ దగ్గర కొనడానికి వచ్చిన వారందరూ ఇదంతా విచిత్రముగా చూస్తున్నారు. తక్కెటలో ఎన్ని రొట్టెలు వేసినప్పటికి కొంచెం కూడా కదలలేదు. అందరి ముందు పరువు పోతుందని త్రాసులో ఉన్న రొట్టెలన్నీ ఒక సంచిలో వేసి అమ్మా..! ఇదిగో నీ రొట్టెలు తీసుకొని వెళ్ళు నీతో రేపు మాట్లాడుతానులే అని చెప్పి పంపించెను.*
*ఆ యజమాని మిగిలిన వారినందరినీ వారికి కావలసినవి ఇచ్చి పంపించి- ఎందుకని నా తక్కెట కదలలేదు. అసలామే ఏం ప్రార్థన చేసిందో చూద్దామని.. తక్కెటలో ఉన్న ప్రార్థన చీటి తెరచి చూడగా - తండ్రి..! మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము అని వ్రాసి ఉంది. సరే..! వీళ్ళ దేవుడు వీరికి కావాల్సిన అనుదిన ఆహారము ఇచ్చాడు కానీ నా తక్కెట సంగతేమిటి..? అని చూడగా అది పైన మధ్యలో విరిగిపోయి ఉంది. గమనించండి! యేసుక్రీస్తు మీద ఆధారపడిన వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపడయ్యడు.*
*''దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు. ఆయన చెప్పిచేయకుండున్నా? ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా? (సంఖ్యా 23:19), సింహాపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును యెహోవాను ఆశ్రయించువారికి ఏ మేలు కొదువయైయుండదు.'' (కీర్తన 34:10) మనము సింహపు పిల్లలకంటే శ్రేష్ఠులము కామా? కనుక ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకొందుమో అని చింతించక, మన కొరకు మన భవిష్యత్తు కొరకు చింతించు దేవుడు వున్నాడని విశ్వసించి ప్రశాంతముగా జీవిద్దాం. ''ఆయన మిమ్మిను గూర్చి చింతించుచున్నాడు.'' (1 పేతురు 5:7).* (దేవునితో ప్రతిదినం)
*************************************
*ప్రతిదినం పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నారా? అయితే మీ కోసమే ఈ గ్రూప్స్...!*
*WhatsApp Community - 1 link:*
https://chat.whatsapp.com/BKEcChdxaKrK0dJ8CqADcD
***************************************
*Telegram group Link*
https://t.me/+XtII92fKOXAyNWQ9
********************************
*యూట్యూబ్ ఛానల్ లింకు*
https://youtube.com/@calvarykiranalu?si=jrCqQ6F_9_-D_S1K
********************************
*మీ ప్రార్దన అవసరతను నా నెంబర్ కు మెసేజ్ చేయండి.... మీ ప్రార్దన మనవిని మన అన్నీ గ్రూప్స్ లో నేనే పోస్ట్ చేయడం జరుగుతుంది. మీ సమస్యపై మన గ్రూప్స్ సభ్యులందరూ ప్రార్దన చేస్తారు. మనకు కావల్చింది వాక్యం, ప్రార్దన.*
*- మీ సహోదరుడు మోషే*
*- (Calvary Kiranalu )*
*-(📲 9550576444)*
***********************************
#JESU I LOVE YOU JESUS #✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #jesu #యేసు ప్రభువు #jesu words #Jesus
#✝️తెలుగు క్రైస్తవ వాట్సాప్ స్టేటస్ ⛪️💒 #jesu #యేసు ప్రభువు #i love jesu #jesu words #Jesus
#jesu #i love jesu #JESU I LOVE YOU JESUS #Jesus #jesu words













