హరే కృష్ణ!!
🙏🙏🙏
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
శ్రీశైలం లో విరాళాలు ఇచ్చే భక్తులకు స్పెషల్ ప్రసాదాలు.. #"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
Kasba Ganapati 🎉👏💫
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
కాలానికే అతీతులు: సప్త చిరంజీవులు ⚔️✨
హిందూ పురాణాల ప్రకారం, ఈ ఏడుగురు మరణం లేనివారు (చిరంజీవులు). కలియుగాంతం వరకు వీరు భూమిపైనే ఉంటారని ప్రతీతి.
* హనుమంతుడు (Hanuman) 🧡🙏
శ్రీరాముని పట్ల అచంచలమైన భక్తికి, అపారమైన బలానికి ప్రతీక. రామనామం ఎక్కడ వినిపిస్తే అక్కడ హనుమంతుడు ఉంటాడని నమ్మకం. ధైర్యానికి, సేవానిరతికి మారుపేరు.
* వేద వ్యాసుడు (Ved Vyasa) 📜🖊️
జ్ఞానానికి ప్రతిరూపం. మహాభారతం, వేదాలు, అష్టాదశ పురాణాలను అందించిన మహర్షి. సత్యం మరియు జ్ఞానం ఎప్పటికీ అంతరించవు అనడానికి నిదర్శనం.
* పరశురాముడు (Parashurama) 🪓🔥
విష్ణువు యొక్క ఆరవ అవతారం. అన్యాయాన్ని ఎదిరించే ధైర్యం, యుద్ధ విద్యలో ప్రావీణ్యం మరియు తపస్సుకు ప్రతీక. రాబోయే 'కల్కి' అవతారానికి గురువుగా ఉంటారని చెబుతారు.
* విభీషణుడు (Vibhishana) 🏹🤝
రావణుడి సోదరుడైనప్పటికీ, అధర్మాన్ని వీడి ధర్మాన్ని (శ్రీరాముడిని) నమ్ముకున్నవాడు. కష్టకాలంలో కూడా నిజాయితీగా ఉండాలని చాటిచెప్పిన వ్యక్తిత్వం.
* అశ్వత్థామ (Ashwatthama) 🛡️😢
ద్రోణాచార్యుని కుమారుడు. చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా, కలియుగాంతం వరకు భూమిపై సంచరిస్తూ ఉంటాడని శాపం ఉంది. కర్మఫలానికి నిదర్శనం.
* బలి చక్రవర్తి (Mahabali) 👑✨
అసుర రాజు అయినప్పటికీ, గొప్ప దాతగా, సత్యసంధుడిగా పేరు పొందాడు. వామనుడికి తన సర్వస్వం దానం చేసిన త్యాగశీలి. ప్రతి సంవత్సరం (ఓనం సమయంలో) తన ప్రజలను చూడటానికి వస్తాడని నమ్మకం.
* కృపాచార్యుడు (Kripacharya) 🎓⚖️
కురువంశ గురువు. యుద్ధ నీతిని, రాజధర్మాన్ని పాటించడంలో నిష్పాక్షికతకు పెట్టింది పేరు. బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికి ఉదాహరణ.
ముగింపు:
ఈ సప్త చిరంజీవులు కేవలం పురాణ పాత్రలు మాత్రమే కాదు; భక్తి, జ్ఞానం, పౌరుషం, ధర్మం, మరియు త్యాగానికి ఎప్పటికీ నిలిచి ఉండే స్ఫూర్తి దాతలు. 🌟🙌
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
్రీ దేవి భాగవతం నుండి, రుద్రాక్షలు- భేదాలు
సనాతన ధర్మం
నారాయణమహర్షీ ! రుద్రాక్ష మహిమ గురించి చాలా గొప్పగా చెబుతున్నావు. కారణం తెలుసుకోవచ్చా ? నారదా ! ఒకప్పుడు కుమారస్వామి ఇలాగే అడిగితే శంకరుడు చెప్పింది నీకు తెలియపరుస్తున్నాను. విను. వెనకటికి త్రిపురుడు అని ఒక దైత్యుడున్నాడు. సర్వదుర్జయుడు. బ్రహ్మాదిదేవతల నందరినీ
పీడించుకుతినేవాడు. అందరూ వెళ్ళి శంకరుడితో మొరపెట్టుకున్నారు. అప్పుడు శంకరుడు అఘోరము
అనే మహాశస్త్రాన్ని ధ్యానించాడు. అది సర్వదేవమయమూ ఘోరాతిఘోరమూను. ఒక వెయ్యి దివ్య సంవత్సరాలు దాన్ని ధ్యానించి కన్నులు మూడూ తెరిచాడు. బాష్పజలబిందువులు రాలిపడ్డాయి. ఆ నీటి బిందువులనుంచి మహారుద్రాక్షలు అనే వృక్షాలు ఆవిర్భవించాయి. సూర్యనేత్రంనుంచి రాలిపడిన జలబిందువులతో కపిలవర్ణంలో పన్నెండూ, సోమనేత్రం నుంచి శ్వేతవర్ణంలో పదహారూ, వహ్నినేత్రంనుంచి కృష్ణవర్ణంలో పదిరకాలూ రుద్రాక్షలు మొలిచాయి. శ్వేత - రక్త - మిశ్ర - కృష్ణ రుద్రాక్షలు నాలుగు వర్ణాలకూ ప్రతీకలు. ఏకముఖ రుద్రాక్ష సాక్షాత్తూ శంకరుడే. బ్రహ్మహత్యాది మహాపాతకాలను సైతం తొలగిస్తుంది. ద్విముఖరుద్రాక్ష పార్వతీపరమేశ్వరులు. సకలపాప విమోచకం. త్రిముఖ రుద్రాక్ష సాక్షాత్తు అగ్నిదేవుడు. స్త్రీహత్యాది పాపాలను సైతం దహించివేస్తుంది. చతుర్ముఖరుద్రాక్ష అంటే బ్రహ్మదేవుడే. నరహత్యాది
ఘోరపాపాలనుకూడా తొలగిస్తుంది. పంచముఖీ రుద్రాక్షనే కాలాగ్ని అంటారు. అదే రుద్రుడు. అభక్ష్యభక్షణ అగమ్యాగమనాది దోషాలను అంతరింపజేస్తుంది. షణ్ముఖరుద్రాక్షమంటే కుమారస్వామియే. దీన్ని
కుడిచేతికి ధరించాలి. బ్రహ్మహత్యాదిక పాపాలుకూడా పోతాయి. సప్తముఖ రుద్రాక్షను మన్మథుడంటారు. స్వర్ణస్తేయాదిపాతకాలు నశిస్తాయి. అష్టవక్త్ర రుద్రాక్షమంటే వినాయకుడు. దీన్ని ధరిస్తే అన్ని పనులూ నిర్విఘ్నంగా సాగుతాయి. గురుపత్నిగమనాది దోషాలు నశిస్తాయి. నవముఖి రుద్రాక్షమంటే కాలభైరవుడు. దీన్ని ఎడమచేతికే ధరించాలి. భుక్తిముక్తిప్రదం. మహాబలవర్ధకం. భ్రూణహత్యాదిదోష నాశకం. సద్యఃఫలదాయకం. దశముఖి రుద్రాక్ష సాక్షాత్తూ జనార్ధనుడు. దీన్ని ధరిస్తే దుష్టగ్రహ భూతప్రేతపిశాచోరగభయాలు అంతరిస్తాయి. ఏకాదశముఖి రుద్రాక్షమంటే ఏకాదశరుద్రులతో సమానం. దీన్ని శిఖలో ధరించినవాడు వెయ్యి అశ్వమేధాలూ నూరువాజపేయాలూ పదివేల గోదానాలూ చేసిన పుణ్యఫలం పొందుతాడు. ద్వాదశాస్య రుద్రాక్ష దొరికితే ద్వాదశాదిత్యులూ చేతికి అందినట్టే. దీన్ని చెవికి ధరించాలి. అశ్వమేధ గోమేధ యజ్ఞఫలం లభిస్తుంది. క్రూరజంతు క్రూరపురుష భయాలు తొలగిపోతాయి.
ఆధివ్యాధులు దరికి చేరవు. పదమూడు ముఖాలున్న రుద్రాక్షను ధరించినవాడు సాక్షాత్తూ కార్తికేయుడే అవుతాడు. ఇది సర్వవాంఛాప్రదం. పట్టిందల్లా బంగారమే అవుతుంది. మాతృహత్యాది పాపాలు సైతం తొలగిపోతాయి. పధ్నాలుగు ముఖాలున్న రుద్రాక్ష లభించిందంటే పుణ్యం ఫలించిందన్నమాటే. దాన్ని శిరస్సున ధరించాలి. శివుడితో సమానుడవుతాడు. నారదా! వెయ్యేల! రుద్రాక్షకు సాటివచ్చే పవిత్రవస్తువు ఈ సృష్టిలో లేదు. దేవతలుకూడా పూజిస్తారు. ధరిస్తారు. ఏదో ఒక రుద్రాక్షను నిత్యమూ ధరిస్తే చాలు ఇహపరాలు శుభాస్పదాలవుతాయి. ఇరవైయారు రుద్రాక్షలతో శిరోమాలనూ యాభైతో కంఠమాలనూ వదహారుతో బాహుమాలికనూ పన్నెండుతో మణిబంధమాలికనూ తయారుచేసుకుని ధరించాలి. ఇరవైయేడుగానీ యాభైగానీ
నూటెనిమిదిగానీ రుద్రాక్షలతో జపమాలను చేసుకోవాలి. వీటిలో అష్టోత్తర శతరుద్రాక్ష జపమాల ఉత్తమోత్తమం. ఈ జపమాలలను ధరించవచ్చు కూడా. క్షణక్షణమూ అశ్వమేధం చేసినంతటి పుణ్యఫలం చేకూరుతుంది - అని సాక్షాత్తూ శివుడు షణ్ముఖుడికి తెలియజేశాడు.
అష్టోత్తరశతైర్మాలా రుద్రాక్షైర్దార్యతే యది ।
క్షణే క్షణేఒశ్వమేధస్య ఫలం ప్రాప్నోతి షణ్ముఖ ॥
(అధ్యాయం 4-40)
సనాతన ధర్మం నుండి #"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
#"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status
*🌹🕉️🙏 నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శించడం వెనుక రహస్యం!🙏🕉️🌹*
శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని చెప్పుకొంటారు.
నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యతా.,పరమేశ్వరుడికి అనుంగుభక్తుడు నందీశ్వరుడు. అందుకనే ఆలయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు.
ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం వుంటుంది. ఆలయంలోని మూలవిరాట్టు దర్శనం చేసుకొనే సమయంలో మనస్సుని భగవంతునిపై కేంద్రీకరించాలి.
అందుకే గర్భాలయంలో చాలా చిన్న అఖండదీపారాధన మాత్రమే వాడతారు. మరే ఇతర దేవాలయాలలోనూ లేని విధంగా శివాలయంలో మాత్రమే నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని చూస్తారు.
సాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార(ఇతర)దేవతల దర్శనం చేసి పరమశివున్ని దర్శించుకుంటాము.
కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణం దర్శనం అని శాస్త్రములు చెబుతున్నాయి.
పరమ శివుడు ఏ శివాలయంలో అయిన శివలింగ రూపంలో ఉంటాడు. అంటే ఇతర దేవతలలాగ కరచరనాదులు(విగ్రహ రూపం) లేకుండా లింగాకారంగా ఉండే సాకార స్వరూం.
విగ్రహ రూపంలో ఉండే భగవంతుని స్వరూపంను మనస్సు వెంటనే గ్రహించగలదు కానీ, లింగరూపంలో ఉన్న పరమశివుడిని చూస్తూ స్వామి నిజ రూపాన్ని దర్శించడానికి దృష్టిని మనస్సు పై కేంద్రీకృతం చేయాలి.
అందుకే ఎప్పుడూ పరమశివుడి ముందు ఉండే నంది శృంగము(కొమ్ముల)నుంచి శివలింగాన్ని చూస్తూ దృష్టిని మనస్సు పై కేంద్రీకరింఛి దర్శనం చేసుకోవాలి. నంది యొక్క పృష్ట భాగంను నిమురుచూ, శృంగముల మధ్య నుంచి స్వామిని దర్శించుకోవడం వలన నంది యొక్క అనుగ్రహం కూడా కలిగి మంచి ఫలితాలు కలుగుతాయి.
అంతే కాకుండా నంది చెవులలో కోరికలు చెప్పే విధానంలో కూడా ఒక పద్ధతి ఉంది.
కుడిచేతిని నందీశ్వరుని చెవికి అడ్డంగా పెట్టి, నెమ్మదిగా గోత్రము, పేరు, కోరిక చెప్పడం మంచిది.
తర్వాత శివాలయంలో ఇచ్చిన పుష్పాన్ని నంది వద్ద పెట్టాలి. గురు, శిష్యుల మధ్య ఎవరూ వెళ్లకూడదు.
అందుకనే నంది విగ్రహం పైన కొమ్ముల మధ్యనుంచి శివదర్శనం చేసుకోవాల్సివుంటుంది.
శంభుడు త్రినేత్రుడు. ఆయన త్రినేత్రం తెరిస్తే సకలా చరాచర జగత్తు తల్లడిల్లుతుంది అందుకనే నేరుగా శివుని ముందుకు వెళ్లకూడదని పెద్దలు చెబుతారు. దీంతో ముందుగా ఆయన వాహనమైన నంది కొమ్ములపై వేళ్లను ఆనించి దర్శనం చేసుకున్న అనంతరమే మందిరం లోపలికి వెళ్లాలి. దీన్నే శృంగదర్శనం అంటారు.
రాశి చక్రంలోని మిథున రాశి గౌరీ శంకర స్వరూపం. వృషభరాశి నందిశ్వర రూపం. రాశి చక్రం ఉదయించే సమయంలో వృభరాశి, మిథున రాశి కిందుగా, అస్తమించే సమయంలో మిథున రాశి, వృషభరాశి కిందుగాను ఉంటుంది. ఆ కారణం వలనే శివుడు వృషభవాహనుడు, వృషభద్వజుడు అయ్యాడు.
వృషభం (నందీశ్వరుడు)యొక్క వృషభ బాగాన్ని స్పృషిస్తూ శివుని దర్శించటం వల్ల విధి విహితం. శివాలయంలో నంది కొమ్ముల మధ్య నుంచి శివున్ని దర్శించిన వారికీ కైలాస ప్రాప్తి కలుగుతుందని శివ పురాణలో ఉన్నది.
🙏 #"భక్తి సమాచారం" #🙏భక్తి స్పెషల్ #🙏🏻భక్తి కోట్స్📝 #🙏ఆధ్యాత్మిక జీవితం😇 #🙆 Feel Good Status




!["భక్తి సమాచారం" - కర్ణదుర్యోధనులుస్నేహితులే: కృష్ణకుచేలులుస్నేహితులే]` ರೌಮ ಲಕ್ಷಮೆಣುಲು ಸ್ದರಲ? వాలిసుగ్రీవులు సోదరులే: అయితేస్నేహితులంటే: కృష్ణకుచేలులది అనిచెబుతాం?ి ಸ್ದರುಲು ಅಂಟೆ. Katpana wriings లక్ష్మణులను తలుస్తాండి | రామ స్వార్థాలతో ఎందుకంటే అవసర పెనవేసుకునేబంధాలకన్నా నిస్వార్థ నిష్కల్మషాలతో బలపడే బంధాలలోనే బాసట బాధ్యతఉంటాయి కాబట్టి?! కర్ణదుర్యోధనులుస్నేహితులే: కృష్ణకుచేలులుస్నేహితులే]` ರೌಮ ಲಕ್ಷಮೆಣುಲು ಸ್ದರಲ? వాలిసుగ్రీవులు సోదరులే: అయితేస్నేహితులంటే: కృష్ణకుచేలులది అనిచెబుతాం?ి ಸ್ದರುಲು ಅಂಟೆ. Katpana wriings లక్ష్మణులను తలుస్తాండి | రామ స్వార్థాలతో ఎందుకంటే అవసర పెనవేసుకునేబంధాలకన్నా నిస్వార్థ నిష్కల్మషాలతో బలపడే బంధాలలోనే బాసట బాధ్యతఉంటాయి కాబట్టి?! - ShareChat "భక్తి సమాచారం" - కర్ణదుర్యోధనులుస్నేహితులే: కృష్ణకుచేలులుస్నేహితులే]` ರೌಮ ಲಕ್ಷಮೆಣುಲು ಸ್ದರಲ? వాలిసుగ్రీవులు సోదరులే: అయితేస్నేహితులంటే: కృష్ణకుచేలులది అనిచెబుతాం?ి ಸ್ದರುಲು ಅಂಟೆ. Katpana wriings లక్ష్మణులను తలుస్తాండి | రామ స్వార్థాలతో ఎందుకంటే అవసర పెనవేసుకునేబంధాలకన్నా నిస్వార్థ నిష్కల్మషాలతో బలపడే బంధాలలోనే బాసట బాధ్యతఉంటాయి కాబట్టి?! కర్ణదుర్యోధనులుస్నేహితులే: కృష్ణకుచేలులుస్నేహితులే]` ರೌಮ ಲಕ್ಷಮೆಣುಲು ಸ್ದರಲ? వాలిసుగ్రీవులు సోదరులే: అయితేస్నేహితులంటే: కృష్ణకుచేలులది అనిచెబుతాం?ి ಸ್ದರುಲು ಅಂಟೆ. Katpana wriings లక్ష్మణులను తలుస్తాండి | రామ స్వార్థాలతో ఎందుకంటే అవసర పెనవేసుకునేబంధాలకన్నా నిస్వార్థ నిష్కల్మషాలతో బలపడే బంధాలలోనే బాసట బాధ్యతఉంటాయి కాబట్టి?! - ShareChat](https://cdn4.sharechat.com/bd5223f_s1w/compressed_gm_40_img_199942_1134fa89_1769024196419_sc.jpg?tenant=sc&referrer=user-profile-service%2FrequestType50&f=419_sc.jpg)






