#📖శ్రీ సరస్వతి దేవి🎶
దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు అమ్మవారి అవతారం "శ్రీ సరస్వతీ దేవి". చదువుకు మూలకారణం ఈ మాత. జ్ఞానం, విద్య, కళలు మరియు సత్యానికి దేవత. ఆమెను చదువుల తల్లిగా పూజిస్తారు. భక్తులకు జ్ఞానాన్ని ప్రసాధించి, వారిలో బుద్దిని నింపి అజ్ఞానాన్ని తొలగిస్తుంది. ఆమె కటాక్షం లేనిదే విద్య లేదు. జ్ఞాన ప్రధాయిని, కళలకు ఆదిదేవత, సుద్దతకు ప్రతీక, త్రి శక్తి స్వరూపిని, బ్రహ్మ భార్య, ఆదిశక్తి రూపం, అనుగ్రహ ప్రధాత్రి. ఈమె వాహనం హంస మరియు నెమలి.
ఈ తల్లిని పూజించడం వలన మనకు అంతా మంచి జరుగుతుందని నమ్మకం. ఆ చల్లని తల్లి మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాధించాలని కోరుకుంటున్నాను.🌹🌹🌹🙏🙏🙏