#జీవిత సత్యాలు #మంచి మాటలు
*నాలుక, కోపం, కోరిక...*
*ఈ మూడింటినీ అదుపులో ఉంచుకోవాలి.*
*పవిత్రత, నిజాయితీ, కఠోరశ్రమ...*
*ఈ మూడింటిని అలవర్చుకోవాలి.*
*సోమరితనం, అబద్ధం, పరనింద...*
*ఈ మూడింటినీ విడిచిపెట్టాలి.*
*దైర్యం, కీర్తి, ప్రశాంతత...*
*ఈ మూడింటి కోసం పాటుపడాలి.*
*వాగ్దానం, స్నేహం, వాత్సల్యం...*
*ఈ మూడింటినీ నిలబెట్టుకోవాలి.*
*మాట, నడవడిక, పని...*
*ఈ మూడింటినీ నిరంతరం నేర్చుకోవాలి.*
*సత్ప్రవర్తన, దానగుణం సేవ...*
*ఈ మూడింటినీ నేర్చుకోవాలి, పెంచుకోవాలి.*
*ఈర్ష్య, అహంకారం, ద్వేషం...*
*ఈ మూడింటినీ లేకుండా చూసుకోవాలి.*
*ఇలా పై మూడింటిని విస్మరిస్తే, పాటించకపోతే, మనకు మూడుతుంది, మన జీవితం అర్ధాంతరంగా ముగిసిపోతుంది అని గుర్తుపెట్టుకోండి...*
*కాబట్టి ప్రతీ ఒక్కరు మూడు అనే మాటను, ఈ మూడింటిని, ఈ మూడు విషయాలను మనసా, వాచా, కర్మేణా తూ.చా తప్పకుండా, త్రికరణ శుద్ధిగా పాటిస్తూ, అందమైన, ఆరోగ్యకరమైన, మనశ్శాంతి పూర్వకమైన జీవితాన్ని గడపాలని మనసారా ఆకాంక్షిస్తూ...
🌸🌹🌸 ✨🙇✨ 🌸🌹🌸